• Follow NativePlanet
Share
» »భారతదేశంలోని ఈ దేవాలయాలు మీకు తెలుసా?

భారతదేశంలోని ఈ దేవాలయాలు మీకు తెలుసా?

భారతదేశంలోని ఆలయాలు ఎక్కువగా రాజ కుటుంబాలచే నిర్మించబడ్డాయి. వీటిలో కొన్ని మాత్రం అద్భుతమైన కట్టడాలు, ప్రపంచ వారసత్వసంపద.భారతదేశం లో కొన్ని పురాతన మరియు అద్భుతమైన ఆలయ నిర్మాణాలు ఒకసారి గమనించండి...!

భారతదేశంలోని ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాల కన్నా తక్కువేమి కాదు. ఆ కాలంలోని రాజులు, రాజవంశీయులు అనేక ఆలయాలను నిర్మించిదానిపోషణాభారంగా భూమిని ఇచ్చారు. ఆ రోజుల్లో అత్యంత సంపన్నమైన ఆలయం ఇది.కాబట్టి భారతదేశంలోని ఆ ప్రసిద్ధ దేవాలయాలు ఏమిటి?అనే ప్రశ్నలకు జవాబులను వ్యాసంమూలంగా తెలుసుకుందాం

బృహదీశ్వరదేవాలయం

బృహదీశ్వరదేవాలయం

తంజావూరిలోని బృహదీశ్వరదేవాలయాన్ని చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ 1002లో నిర్మించెను.ఇందులో ప్రధానమైన దేవుడు మహాశివుడు.ఈ దేవాలయం విష్ణువు విగ్రహం కలిగి ఉన్న దేవాలయాలలో ఒకటి. ఈ అందమైన ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగం.

PC:Nara J

కైలాసనాథ దేవాలయం

కైలాసనాథ దేవాలయం

కైలాసనాథ్ ఆలయం ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలలో ఉంది. ఈ గుహలు భారీ రాతి శిలలమీద చెక్కబడిన ఈ గుహల్లో హిందూ మతం, బౌద్ధ మరియు జైన ధర్మాల దేవాలయాలు, సన్యాసి ఆశ్రమాలు వున్నాయి. 16వ గుహలో కైలాసనాథదేవాలయం 60,000 చదరపుఅడుగుల విస్తీర్ణంలో నిర్మించిరి.కైలాసనాథదేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల ఆలయం.

PC : Travelling Slacker

చెన్నకేశవదేవాలయం

చెన్నకేశవదేవాలయం

కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన చెన్నకేశవ ఆలయం బేలూర్ లో ఉంది.ఈ ఆలయాన్ని మృదువైన రాయిని ఉపయోగించి నిర్మించబడింది.హొయసల విష్ణువర్ధన 11 వ శతాబ్దంలో నిర్మించబడింది.విజయనగర కాలంలో ఈ ఆలయ రాజగోపురాలను నిర్మించారు.

PC:Dineshkannambadi

తుంగనాథ్ మందిరం

తుంగనాథ్ మందిరం

తుంగనాథ్ మందిరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చోప్తలో ఉంది.ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శివ దేవాలయం. చరిత్ర ప్రకారం ఇది పాండవులలో ఒక్కడైన అర్జునులచే నిర్మించబడింది.

PC: Wikipedia

ఆది కుంభేశ్వరర్ దేవాలయం

ఆది కుంభేశ్వరర్ దేవాలయం

ఆది కుంభేశ్వర ఆలయం తమిళనాడులోని కుంబకోణం పట్టణంలో ఉంది. ఇక్కడి ప్రధానమైన దేవుడు శివుడు.మహాశివున్ని కుంభేశ్వరర్ అని కూడా పిలుస్తారు.ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించినట్లు చెబుతారు.9 అంతస్థుల ఎత్తుగల ఆలయ గోపురం ప్రధాన ఆకర్షణ.

PC:Arian Zwegers

జగత్ పిత బ్రహ్మేశ్వర దేవాలయం

జగత్ పిత బ్రహ్మేశ్వర దేవాలయం

సృష్టికర్తయైనబ్రహ్మకి దేవాలయాలు వుండటంఅరుదు. రాజస్థాన్ లోని పుష్కర్ వాటిలో ఒకటి.ఈ ఆలయం 2000 సంవత్సరాల నాటిది. ఇది క్రీ.శ.14 వ శతాబ్దంలో నిర్మించబడినదని చెప్తారు.4ముఖాలుకలిగి వున్న కమలంలో నిశ్చలంగా కూర్చునివున్న బ్రహ్మదేవునికి ఒక పక్కన గాయత్రీ దేవి మరొక వైపు సావిత్రి దేవి చిత్రం ఉంది.

PC:Redtigerxyz

శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం

శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం

తిరునెల్వేలిలో కృష్ణవర్మ రాజు చేత నిర్మించబడింది. ఈ ఆలయం తమితబరని నది ఒడ్డున ఉంది.ఈ దేవాలయంలోని ప్రధానమైన మూలవిగ్రహాన్ని "మూలవార్" అని పిలుస్తారు.శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయ ప్రవేశద్వారం ఉదయం 7 నుండి 11 గంటల వరకు, రాత్రి 6 గంటల నుండి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

PC:Ssriram mt

సూర్యదేవాలయం

సూర్యదేవాలయం

భువనేశ్వర్ కి60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్, స్మారక కట్టడాలు కలిగిన ఒక అందమైన పట్టణం.ఇక్కడి అత్యంత ఆకర్షణీయమైన సూర్యదేవాలయాన్ని చూచుటకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు సందర్శిస్తారు.దీనిని 13 వ శతాబ్దంలో నరసింహ దేవ నిర్మించారు.

PC:Tetraktys

దిల్వార జైన దేవాలయం

దిల్వార జైన దేవాలయం

దిల్వార జైన దేవాలయం రాజస్థాన్ లోని మౌంట్ అబు సమీపంలో వుంది. జైన దేవాలయం రాజస్థాన్ లోని అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటి.ఈ ఆలయం తెల్ల పాలరాయితో అలంకరించబడి ఉంది.

PC:Malaiya

పంచరత్న దేవాలయం

పంచరత్న దేవాలయం

పంచరత్న దేవాలయం పశ్చిమ బెంగాల్ లోని బంకురా పట్టణంలో ఉంది.దీనిని క్రీ.శ.1643లో కింగ్ రఘునాథ సింగ్ నిర్మించారు.సున్నం మరియు ఇటుకలతో నిర్మించిన ఈ అద్భుతమైన కట్టడం బెంగాల్ యొక్క వారసత్వం.ఆలయ గోడలపై మతపరమైన మరియు సాంస్కృతిక కథలు కూడా ఉన్నాయి.

PC:Jonoikobangali

బాదామి గుహ

బాదామి గుహ

బాదామి కర్ణాటక రాష్ట్రంలో ఒక పురాతన పట్టణం.చాళుక్యులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా పాలించారు.బాదామి మరియు దాని గుహలు ప్రసిద్ధి చెందాయి.ఇందులో మొత్తం 4 గుహలు ఉన్నాయి.

PC:Nilmoni Ghosh

విఠల దేవాలయం

విఠల దేవాలయం

విఠాల ఆలయం విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలో ఉంది.క్రీశ16 వ శతాబ్దంలో 2వదేవరాయ రాజు ఈ దేవాలయాన్ని తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించెను. ఇది దేవాలయంలో ఏ స్తంభాన్ని తాకినా సంగీతం పాడుతుంటుంది.

PC:Vinoth Chandar

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి