• Follow NativePlanet
Share
» »మీతో పాటు అటు పై 21 తరాలకు ముక్తిని ప్రసాదించే ప్రాంతం...అందుకే ఇప్పటికీ

మీతో పాటు అటు పై 21 తరాలకు ముక్తిని ప్రసాదించే ప్రాంతం...అందుకే ఇప్పటికీ

Written By: Kishore

ఈ దేవాలయాన్ని దేవ శిల్పి మయుడు 300 తీర్థాలతో నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ కార్తీక దీప ఉత్సవం దాదాపు 3వేల సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా జరుగుతూ ఉన్నట్లు పురాణాలుచెబుతాయి. ఇక్కడే అర్థనారీశ్వర రూపం వెలిసిందని కథనం. ఇక్కడ ఓ వినాయకుడు తన శరీరం మొత్తం రక్తం పూసుకొని కనిపిస్తాడు. ఇక్కడే తన అది అంతం కనుక్కోవలసిందిగా పరమశివుడు విష్ణు, బ్రహ్మలకు సూచించినట్లు చెబుతారు. అంతే కాకుండా ఈ క్షేత్రం పంచభూత లింగాల్లో ఒకటి. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రం గురించి మరింత వివరంగా ఈ కథనంలో తెలుసుకొందాం.

ఖురాన్ చదివితేనే ముందుకు కదిలే భూ వరహాస్వామి

ఆంగ్లేయుడికి కూడా శ్రీరాముడు దర్శనమిచ్చిన ప్రాంతం...ఈ క్షేత్రంలో కాలుపెడితే...

1. పంచభూత లింగాల్లో ఒకటి

1. పంచభూత లింగాల్లో ఒకటి

P.C:You Tube

పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటిగా పేర్కొనబడే అరుణాచలం తమిళనాడులో ఉంది. ఇక్కడ ఉన్న లింగాన్ని అగ్నికి ప్రతీకగా భావిస్తారు. అందువల్లే ఇక్కడి దేవాలయంలో చాలా వేడిగా ఉంటందని కథనం.

2. అందుకే ఆపేరు

2. అందుకే ఆపేరు

P.C:You Tube

అరుణాచలం ను తిరువణ్ణామలై అని కూడా అంటారు. శివుడికి ఉన్న అనేక పేర్లలో అణ్ణాల్ కూడా ఒకటి. అణ్ణాల్ అంటే అగ్ని అని అర్థం. మలై అంటే పర్వతం. ఇక్కడ శివుడు పర్వత రూపంలో వెలిశాడు

3. గౌరవ సూచకంగా తిరు

3. గౌరవ సూచకంగా తిరు

P.C:You Tube

కాబట్టి దీనిని అణ్ణామలై అని తొలుత పిలిచే వారు. తెలుగులో శ్రీ ని గౌరవ సూచకంగా ఎలా వాడుతామో తమిళంలో తిరు ను గౌరవ సూచకంగా వినియోగిస్తారు. అందువల్ల ఈ క్షేత్రం తిరువణ్ణామలై అనే పేరుతో ప్రసిద్ధి కెక్కింది.

4. ఆ ఘటన జరిగింది ఇక్కడే

4. ఆ ఘటన జరిగింది ఇక్కడే

P.C:You Tube

పరమశివుడు బ్రహ్మ విష్ణువుల్లో గొప్పవారెవరన్న విషయం తేల్చడానికి అగ్ని స్తంభంగా మారిన చోటు ఇదేనని తమిళ పురాణాల్లో ఉంది. ఇక ఆ ఘట్టం ముగిసిన తర్వాత పరమశివుడు ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు.

5. పరమేశ్వరుడిని వేడుకొనడంతో

5. పరమేశ్వరుడిని వేడుకొనడంతో

P.C:You Tube

అయితే శివ స్వరూపాన్ని కొండరూపంలో తమతో పాటు సాధారణ ప్రజలు పూజించడం కష్టమవుతుందని అందువల్ల లింగ రూపంలో ఇక్కడ కొలువై ఉండాలని బ్రహ్మ విష్ణువులు ఆ పరమేశ్వరుడిని వేడుకొంటారు.

6. మయుడు నిర్మించిన దేవాలయం

6. మయుడు నిర్మించిన దేవాలయం

P.C:You Tube

దీంతో శివుడు చిన్న లింగం రూపంలో ఈ పర్వత ప్రాంతంలో కొలువై ఉన్నాడు. ఇక బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు దేవ శిల్పి మయుడు ఇక్కడ ఆ పరమ శివుడి కోసం ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఇక్కడ 300 పుణ్యతీర్థాలు కూడా ఉన్నాయి.

7. 21 తరాల వారికి ముక్తి

7. 21 తరాల వారికి ముక్తి

P.C:You Tube

అందువల్లే ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికే కాకుండా వారి తర్వాత 21 తరాల వారికి కూడా ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్ర మహిమ తెలుసుకొన్న వశిష్టుడు, వ్యాసుడు, అగస్త్యుడు మొదలైన మహర్షలు ఎంతో మంది ఈ క్షేత్రాన్ని దర్శించిన వారిలో ఉన్నారు.

8. అర్థనారీశ్వర రూపం

8. అర్థనారీశ్వర రూపం

P.C:You Tube

అర్థనారీశ్వర రూపం ఈ క్షేత్రంలోనే ఉద్భవించిందని భక్తుల విశ్వాసం. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి రెండు కన్నులను మూసింది.

9. అంధకారమవుతుంది.

9. అంధకారమవుతుంది.

P.C:You Tube

దీంతో ఈ లోకం మొత్తం అంధకారంలో మునిగిపోతుంది. దీంతో శివుడు తన మూడో కన్ను తెరిచి ఈ లోకానికి వెలుగును ప్రసాదిస్తాడు. చేసిన తప్పును తెలుసుకొన్న పార్వతి చాలా బాధపడుతుంది.

10. ఈ కొండ శివుడి స్వరూపం

10. ఈ కొండ శివుడి స్వరూపం

P.C:You Tube

దీంతో పరమశివుడి సూచనమేరకు పార్వతీ దేవి తిరువణ్ణామలై చేరుకొని అక్కడ తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న కొండ సాక్షాత్తు పరమశివుడి స్వరూపమని గౌతమ మహర్షి పార్వతి దేవికి చెబుతాడు.

11. ఇప్పటికీ గిరి ప్రదక్షణ

11. ఇప్పటికీ గిరి ప్రదక్షణ

P.C:You Tube

దీంతో ఆ కొండకు ప్రదక్షిణ చేస్తూ శివుణ్ణి ఆరాధిస్తుంది. ప్రసన్నుడైన శివుడు పార్వతీదేవికి తన శరీరంలో సగ భాగం ఇచ్చి అర్థనారీశ్వరుడైనట్లు కథనం.ఇప్పటికీ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని నమ్ముతారు.

12. పౌర్ణమి రోజుల్లో

12. పౌర్ణమి రోజుల్లో

P.C:You Tube

14 కిలోమీటర్ల ఉండే ఈ గిరి ప్రదక్షణ మార్గంలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి ఆలయం, రమణమహర్షి ఆశ్రయం తదితరాలు ఉన్నాయి. పౌర్ణమి రోజు ఎక్కువ మంది ఈ గిరి ప్రదక్షణ చేస్తారు. ఆ సమయంలో కాళ్లకు పాదరక్షలు ధరించరు. ఇప్పటికీ ఇక్కడ యోగి పుంగవులు అద`ష్య రూపంలో గిరి ప్రదక్షణ చేస్తుంటారని చెబుతారు.

13. కంబత్ ఇల్లయనార్

13. కంబత్ ఇల్లయనార్

P.C:You Tube

దేవాలయంలో రాజగోపురం సమీపంలో ఉన్న కంబత్ ఇల్లయనార్ సన్నిది అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినది. తిరుప్పగళ అనే కావ్యాన్ని రచించిన అరుణగిరి నాధుడికి సుబ్రహ్మణ్యస్వామి తన దేవేరులతో సహా దర్శనమిచ్చాడని చెబుతారు.

14. ఎరుపు రంగులో వినాయకుడు

14. ఎరుపు రంగులో వినాయకుడు

P.C:You Tube

ప్రధాన ఆలయానికి లోపల సంబంధ వినాయగర్ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు ఎరుపు రంగులో పెద్ద ఆకారంలో, సుఖాశీనుడై దర్శనమిస్తాడు.

15. ఆ రక్తంతో

15. ఆ రక్తంతో

P.C:You Tube

ఒక రాక్షసుడిని సంహరించి అతని రక్తాన్ని వినాయకుడు తన శరీరానికి రాసుకోవడం వల్ల తన దుష్ట శిక్షణా శక్తిని ప్రదర్శించాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ వినాయకుడికి అరుణ వర్ణంతో అలంకరిస్తారని స్థానిక కథనం.

16. పాతాళ లింగం

16. పాతాళ లింగం

P.C:You Tube

ఆలయానికి దగ్గర్లో పాతాళ లింగం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ లింగం ఉన్న గుహలో రమణ మహర్షి తిరువణ్ణామలై వచ్చిన కొత్తలో అనేక సంవత్సరాలు ధ్యానం చేసినట్లు చెబుతారు.

17. అమ్మవారిని

17. అమ్మవారిని

P.C:You Tube

ఇక్కడ అమ్మవారిని అణ్ణములై అమ్మన్ అని అంటారు. మూడు అడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. గర్భగుడి వెలుపల ఉన్న మండపంలోని స్తంభాల పై అష్టలక్ష్ములు ఉంటారు. అందువల్ల దీనిని అష్టలక్ష్మీ మంటపం అని అంటారు.

18. కార్తీక దీప ఉత్సవం

18. కార్తీక దీప ఉత్సవం

P.C:You Tube

ఇక్కడ జరిగే కార్తీక దీప ఉత్సవం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. నవంబర్ 15 డిసెంబర్ 15 మధ్య అంటే తమిళుల కార్తీక మాసంలో ఉత్తరాషాడ నక్షత్రం రోజున ప్రారంభమయ్యి భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది.

19. పదవ రోజున

19. పదవ రోజున

P.C:You Tube

పదవరోజు తెల్లవారుజామున గర్భగుడిలో దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలం పై మహాదీపం వెలిగిస్తారు. ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, ఐదు అడుగుల చుట్టు కొలత ఉన్న పెద్ద లోహ పాత్రను వినియోగిస్తారు.

20. 350 మీటర్ల పొడవైన వస్త్రం

20. 350 మీటర్ల పొడవైన వస్త్రం

P.C:You Tube

ఇందులో స్వచ్భమైన నేతిని వేసి 350 మీటర్ల పొడవైన నూలు వస్త్రంతో తయారుచేసిన వత్తిని వెలిగిస్తారు. ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగిసి ఆ కాంతి చుట్టు పక్కల దాదాపు 35 కిలోమీటర్ల వరకూ కనబడుతుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి