Search
  • Follow NativePlanet
Share
» »5000 సంవత్సరాలుగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలుగా జీవిస్తున్న వ్యక్తి !

By Venkatakarunasri

అసలు ఏవరైనా నిజంగా 5000 సంవత్సరాలగా బ్రతకగలరా? సైంటిఫిక్ గా చూస్తే అది అసాధ్యం. ఎటువంటి మనిషికైనా సరే 5000 సంవత్సరాలు జీవించటంఅనేది సాధ్యం గాని పని. నేను కూడా ఇదే నమ్ముతాను.ఎందుకంటే ఒక మనిషేకాదు.ఈ భూమిపైనఎటువంటిమనిషైనా సరే 5000 సంవత్సరాలు బతకటంఅనేది అసాధ్యం. కాని మన భారతదేశంలోనే ఒక ప్రదేశంలో ఒక మనిషి 5000 సంవత్సరాలగా జీవించివున్నాడని ఆ ప్రదేశంలోని ప్రజలు సవాల్ చేస్తున్నారు.

'భారత దేశం హృదయం' గా పిలువబడే మధ్య ప్రదేశ్ దేశంలోని రెండో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్ర చరిత్ర, దాని భౌగోళిక స్థానం, ప్రాకృతిక అందం, సాంస్కృతిక వారసత్వ౦, ప్రజలు ఈ రాష్ట్రాన్ని దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాయి. రాజధాని భోపాల్ 'సరస్సుల నగరం'గా ప్రసిద్ది పొందింది. పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను మధ్య ప్రదేశ్ పర్యాటకం అందిస్తోంది. బాంధవ్ ఘర్ జాతీయ పార్కులో పులులను చూడడం దగ్గర నుంచి ఖజురహో లాంటి దేవాలయాల్లో నిర్మాణాల వరకు నిజమైన భారత దేశాన్ని పర్యాటకులు కనుగొంటారు.మధ్య ప్రదేశ్ భౌగోళిక స్వరూపం దేశం మధ్యలో వున్న ఈ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలబెడుతుంది.

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఎక్కడ వుంది?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బురాన్పూర్ అనే ఒక చిన్న నగరఅంచులలో పెద్దపెద్ద ఎత్తైన పర్వతాలపైనున్న ఈ అసిర్ ఘర్ కోట ఎన్నోసంలుగా ఈ ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాన్ని తనలో తను దాచుకుంది.

బురాన్పూర్ నగరానికి వుత్తరదిశగా 20కిమీల దూరంలో సముద్రమట్టానికి 775అడుగులఎత్తులో పర్వతశిఖరాలపై ఈ అసిర్ ఘర్ కోట వుంది.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఇక్కడ నివశించే ప్రజలు నివసించే వివరాలప్రకారం ఈ కోటలో మహాభారతంకాలం నాటి ఒక వ్యక్తివున్నాడని అతనునేటికీ జీవించే వున్నాడని అతనిని తాముకూడా చూసామనిచెబుతారు. హిందువులకి ఎంతో పవిత్రమైనగ్రంథం మరియు సాహిత్యంలోనే వున్నతమైన మహాభారతం సాధారణమనుషులకు ఈరోజుకీ జిజ్ఞాసను పెంచే అంశమే.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఇందులో పొందుపరచబడిన అద్భుత మరియు ఆశ్చర్యకరమైన విషయాలగురించి విన్నప్పుడు ఈ గ్రంథాలను చదివినప్రేరణ మనలో ఇంకా పెరుగుతుంది.అలాంటి ఒక ప్రేరణే అశ్వత్థామయొక్క చావు. అతను ఈ రోజుకీ ఇంతకి జీవించివున్నాడనే చెబుతారు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఈ మాటల్లో ఎంత నిజం వుందో తెలీదు. దీన్ని పూర్తిఆధారాలతో ఎవరూ నిరూపించలేదు. కాని అసిర్ ఘర్ ప్రజలుమాత్రం దీనిని 100కి 100పాళ్ళు నిజమని వాదిస్తున్నారు. మన పురాణాలప్రకారం పాండవులుకారణంగా తన తండ్రి ద్రోణాచార్యులు మరణించాడని అశ్వత్థామ పగతో రగిలిపోయాడు. తన తండ్రిమరణానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్న అశ్వత్థామ పాండవపుత్రులను చంపేసాడు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

పాండవ వంశాన్ని సమూలంగా నాశనంచేయాలనే వుద్దేశ్యంతో అర్జునుని కోడలైన వుత్తర గర్భంలో వున్న అభిమన్యుపుత్రుడైన పరీక్షిత్తుని చంపటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కాని శ్రీకృష్ణభగవానుడు పరీక్షిత్తుని రక్షించాడు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

అశ్వత్థామచేసిన ఈ దారుణానికి శ్రీకృష్ణుడు అతనిని ఇలా శపించాడు. నువ్వు పాపభరితమైన ప్రజలపాపాలని భరిస్తూ జనావాసాలకి దూరంగా వుండే ప్రదేశాల్లో తిరుగుతూవుంటావని నీ శరీరం నుండి ఎప్పుడూ భయంకరమైన దుర్వాసన వస్తుందని నీవు అనేక రోగాలతో పీడించబడుతూ వుంటావని శపించాడు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

మనషులు మరియు ఈ సమాజమంతా నిన్ను చెడుగా భావించి అసహ్యించుకుంటుందని శపించాడు. ఆనాడు శ్రీకృష్ణుడిచే శపించబడ్డ అశ్వత్థామ ఈనాటికీ తన చావును వెతుక్కుంటూ తిరుగుటాడని అంటారు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

కాని ఆ చావుఅనే అదృష్టం ఈనాటికీ అతనిని వరించలేదు.ఇక దేశంలో ఇంకా అశ్వత్థామ వున్నాడనే వాదనలు నేటికీ వినిపిస్తూవుంటాయి. కాని చాలామంది చరిత్రకారులుమాత్రం అశ్వత్థామ యొక్క నిజమైన నివాసస్థలం ఈ అసిర్ ఘర్ కోటేనని అంటారు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

గ్రామంలోని వారు నమ్మకం ప్రకారం ఎవరికైనా అశ్వత్థామ కనపడితే వారి ఆరోగ్యం పాడౌతుందని వారి మానసికస్థితి చిన్నాభిన్నం అవుతుందని అంటారు.కోటలో వున్న చిన్నచెరువులో స్నానం చేసి అశ్వత్థామ శివమందిరంలోకెళ్ళి పూజలు చేస్తాడని అంటారు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఇంకొంతమంది నదిలో స్నానంచేసి ఇక్కడకు పూజలు చేయటానికి వస్తాడని అంటారు. ఇక్కడ ఆశ్చర్యపరచే విషయం ఏంటంటే కొండలపై కోటలో వున్న ఈ చిన్నచెరువు బురాన్పూర్ లో వున్న కఠిన వేసవిసెలవుల్లో కూడా ఎండిపోదంట.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

చెరువుదాటి కొంచెంముందుకెళ్తే గుప్తేశ్వర్ మహదేవ్ ఆలయం వుంది. ఈ మందిరానికి 4వైపులా త్రవ్వబడ్డ పొడవైన కందకాలు వున్నాయి. ఈ కందకాల్లో యేదోఒకదాంట్లో నుండి ఒక రహస్యమైన మార్గం వుందని అంటారు.ఆ మార్గం కాండవవనం నుండి నేరుగా ఈ మందిరంలోకి వుంటుందని అంటారు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

మన పౌరాణికనమ్మకాల్ని మరియు ఆచారాల్ని సందేహించటం చాలాతప్పు. ఎందుకంటే ఈ విషయాలను తరతరాలుగా మనపూర్వికులకాలం నుండి చెబుతూనేవస్తున్నారు.కాని అశ్వత్థామకధ ఎంతవరకువాస్తవమో కాని ఈ రహస్యాలను చేధించటమే మిగిలుంది. హిందూధర్మాలను పాటించేవారు ఈ విషయాలను 100కి 100పాళ్ళు నమ్ముతారు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఖజురహో, సంచి, భీమ్ బెట్కా లను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా ప్రకటించింది. మధ్య ప్రదేశ్ లోని గిరిజన సంస్కృతి ఇక్కడి పర్యాటకంలో ప్రధాన భాగం. గోండ్ లు, భిల్లులు, ఇక్కడ నివసించే ప్రధాన జాతులు. గిరిజన హస్త కళాకృతులు ఇక్కడి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఇక్కడి జానపద సంగీతం, నృత్యం దేశ కళా వారసత్వానికి పట్టుగొమ్మలు. వన్య ప్రాణులు - మధ్య ప్రదేశ్ లో ప్రేరణ కలిగించే అంశం.వింధ్య, సాత్పురా పర్వతాలు, పచ్చటి అడవులు చాలా జీవజాతులకు ఆలవాలం. వన్య ప్రాణి అభయారణ్యాలు, వన్యప్రాణి జాతీయ పార్కులు కూడా మధ్య ప్రదేశ్ పర్యాటకం లోని ప్రధాన ఆకర్షణలు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

బాంధవ్ ఘర్ జాతీయ పార్కు, పెంచ్ జాతీయ పార్కు, వన్ విహార్ జాతీయ పార్కు, కాన్హా జాతీయ పార్కు, సాత్పురా జాతీయ పార్కు, మాధవ్ జాతీయ పార్కు, పన్నా జాతీయ పార్కు మధ్య ప్రదేశ్ లోని కొన్ని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. ఈ కేంద్రాల్లో చాలా జాతులకు చెందిన పక్షులు, జంతువులూ, మొక్కలూ చూడవచ్చు. నీముచ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యం కూడా వన్యప్రాణి నిలయమే.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఈనాడు మధ్య ప్రదేశ్ ఒక సుప్రసిద్ధ పర్యావరణ పర్యాటక కేంద్రం.మధ్య ప్రదేశ్ లోని ఆహారం, పండుగలు పబ్బాలుమధ్య ప్రదేశ్ లోని విభిన్న వంటకాలు మధ్య ప్రదేశ్ పర్యాటకానికి కీలకమైన భాగం. ఆహారంలో ప్రధానం గా రాజస్థానీ, గుజరాతీ వంటకాలు వుంటాయి. సీఖ్, షాహీ కబాబ్ లాంటి రాచరికపు వంటకాలు రాజధాని భోపాల్ ప్రసిద్ది.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

జిలేబీ, జీడిపప్పు బర్ఫీ లైతే మధ్య ప్రదేశ్ లోని అన్ని నగరాల్లో ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరుకుతాయి. అయితే రాష్ట్రంలోని వివిధ భాగాలలో ఆహారపు అలవాట్లలో తేడా వుంది. ఖజురహో లోని ఖజురహో నృత్యోత్సవం, గ్వాలియర్ లో జరిగే తాన్సేన్ సంగీత ఉత్సవం ప్రపంచ ప్రసిద్ది పొందాయి. మడాయి పండుగ, భాగోరియా పండుగ గిరిజన తెగలు జరుపుకునే సుప్రసిద్ధ గిరిజన పండుగలు.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల తో ప్రకృతి లోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది. వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్య ప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

మధ్య ప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం వివిధ వంశాలకు చెందినా ఎంతో మంది రాజుల పాలన చూసింది మధ్య ప్రదేశ్. ప్రాచీన కాలం లో మౌర్యులు, రాష్ట్రకూటులు, గుప్తుల నుంచి ఇటీవలి బుందేలా, హోల్కర్, ముఘలాయి, సింధియాల పాలన వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాల ఉత్థాన పటణాలకు ఇది సాక్షి.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

వివిధ రాజుల పాలన వల్ల రకరకాల కళా, నిర్మాణ శైలులు కూడా వచ్చాయి.ఖజురహో లోని శృంగార శిల్పాలు, రాజసం వుట్టి పడే గ్వాలియర్ కోట, ఉజ్జయిని లోని దేవాలయాలు, ఒర్చ్చా లోని చిత్రకూట్ లేదా చట్ట్రిస్ - అన్నీ అద్భుత నిర్మాణాలకు ప్రతీకలే.

PC:youtube

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

ఎలా చేరాలి?

రోడ్ మార్గం

ఖజురహో బస్సు సేవలు ద్వారా అనేక పెద్ద మరియు చిన్న నగరాలు మరియు మహోబా, జబల్పూర్, భూపాల్, ఝాన్సీ, ఇండోర్, గౌలియార్, మొదలైన పట్టణాలకు అనుసంధించబడి ఉన్నది. ఖజురహో నుండి ఈ ప్రదేశాలకు ప్రైవేటు మరియు రాష్ట్ర రవాణా బస్సులు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు ఖజురహో నుండి సాధారణ, AC, నాన్ AC, డీలక్స్ మరియు సూపర్ డీలక్స్ బస్సుల సౌకర్యాలను పొందవచ్చు.

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

రైలు మార్గం

ఖజురహో రైల్వే స్టేషన్ ఝాన్సి అనే చిన్న గ్రామానికి మరియు కొన్ని నగరాలకు అనుసంధించబడి ఉన్నది. ఖజురహో నుండి 73 కి.మీ. దూరంలో పెద్ద రైల్వే స్టేషన్, మహోబా ఉన్నది. మహోబా నుండి ఖజురహోకు టాక్సి ద్వారా చేరుకోవటానికి రూ.1200/- అవుతుంది.

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

5000 సంవత్సరాలగా జీవిస్తున్న వ్యక్తి !

విమానమార్గం

ఖజురహోలో విమానాశ్రయం ఉన్నది. పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఈ విమానాశ్రయం ఉన్నది. ప్రధాన విమానయాన సంస్థలు దేశంలోని ప్రధాన నగరాలకు ప్రజలను ఈ విమానాశ్రయం నుండి రవాణా చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న సౌకర్యాలు మరియు నిర్మాణం అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more