Search
  • Follow NativePlanet
Share
» »40 ఏళ్లకోసారి మాత్రమే దక్కే అత్తి వరదర్‌ దర్శన భాగ్యం..తిరిగి 2059లోనే..ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

40 ఏళ్లకోసారి మాత్రమే దక్కే అత్తి వరదర్‌ దర్శన భాగ్యం..తిరిగి 2059లోనే..ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

తమిళనాడులో కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ది చెందినది. కంచిలో సుమారు 1000కి పైగా ఆలయాలున్నాయంటే ఆశ్చర్యం కలగకు మానదు. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచిలో ఉన్న ప్రసిద్ది చెందిన ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్వతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్వక్షేత్రాలలో ఒకటిగాను విరాజిల్లుతోంది. తమిళుల ఆరాధ్యదైవంగా... కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్‌ కథ ఇది...

ఈనెల 1న ప్రారంభమైన అత్తివరదర్‌ వేడుకలు 48 రోజుల పాటు జరగనున్నాయి. దేశంలోని శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాల్లో కాంచీపురం ఒకటి. అక్కడి వైష్ణవాలయాల్లో ప్రసిద్ధి చెందింది వరదరాజ పెరుమాళ్‌ ఆలయం. వేఘవతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో మూలవిరాట్టు వరదరాజ పెరుమాళ్‌ పశ్చిమంవైపు, తాయారు పెరుందేవి తూర్పు వైపు నిలబడినట్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయం ఉన్న కొండ ఏనుగు రూపంలో ఉంటుంది. పెరుమాళ్‌ను మోస్తున్నందున ఈ కొండకు అత్తిగిరి కొండ అని కూడా పేరు ఉంది.

వరదరాజ స్వామి ఆలయంలో మరో విశేషం ఏంటంటే శ్రీ అత్తి వరదరాజ స్వామి.

వరదరాజ స్వామి ఆలయంలో మరో విశేషం ఏంటంటే శ్రీ అత్తి వరదరాజ స్వామి.

కంచి అనగానే చాలా మందికి బంగారు వెండి బల్లులే గుర్గుకు వస్తాయి.ప్రసిద్ధమైన బంగారు, వెండి బల్లులు ఉన్నది ఇక్కడే. ఈ బల్లులను తాకితే, బల్లి పడిన దోషాలు పోతాయంటారు. కంచిలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయాన్ని ‘విష్ణు కంచి' అంటారు. ఈ వరదరాజ స్వామి ఆలయంలో మరో విశేషం ఏంటంటే శ్రీ అత్తి వరదరాజ స్వామి.

PC:YOU TUBE

మత్స్యావతారం ఎత్తి, జలాలలో దాగిన సోమకుణ్ణి

మత్స్యావతారం ఎత్తి, జలాలలో దాగిన సోమకుణ్ణి

మత్స్యావతారం ఎత్తి, జలాలలో దాగిన సోమకుణ్ణి వధించి, వేదాలను కాపాడిన శ్రీమహావిష్ణువు... సప్త మోక్షపురాలలో ఒకటైన తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామిగా నీటి కొలనులో విశ్రమిస్తాడు. నాలుగు దశాబ్దాలకు ఒకసారి పైకి వస్తాడు. వివిధ అలంకారాల్లో అర్చనలు అందుకుంటాడు. మళ్ళీ జలగర్భంలోకి చేరుకుంటాడు. ఏ ఆలయంలోనూ కనిపించని ఈ విశేషానికి కంచిలోని శ్రీ వరదరాజ పెరుమాళ్‌ ఆలయం ప్రసిద్ది.

PC:YOU TUBE

పురాణ కాలంలో ఛతుర్మఖ బ్రహ్మ దివ్వమైన యాగ

పురాణ కాలంలో ఛతుర్మఖ బ్రహ్మ దివ్వమైన యాగ

పురాణ కాలంలో ఛతుర్మఖ బ్రహ్మ దివ్వమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచేత అత్తి చెట్టు కాండంతో శ్రీవరదరాజ స్వామి(వరములను ఇచ్చేటి శ్రీ నారాయణుని)విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.

PC:YOU TUBE

ఈ మూర్తికి యుగయుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో

ఈ మూర్తికి యుగయుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో

ఈ మూర్తికి యుగయుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తరుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చివేసి , దేవాలయ సంపదను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలుగకుండా ఉండేదుంకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట.

PC:YOU TUBE

శ్రీవారి మూర్తి విగ్రహంలోపలికి నీళ్ళు చేరని విధంగా జాగ్రత్తలు

శ్రీవారి మూర్తి విగ్రహంలోపలికి నీళ్ళు చేరని విధంగా జాగ్రత్తలు

శ్రీవారి మూర్తి విగ్రహంలోపలికి నీళ్ళు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంతర కాలంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్వ మూర్తిని ప్రతిష్టించారు. అత్తి వరదర్‌ విగ్రహం ఎత్తు సుమారు 10 అడుగులు.

PC:கி. கார்த்திகேயன்

అయితే పుష్కరిణి అడుగు భాగాన పెట్టేలో భద్రపరిచిన

అయితే పుష్కరిణి అడుగు భాగాన పెట్టేలో భద్రపరిచిన

అయితే పుష్కరిణి అడుగు భాగాన పెట్టేలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 సంవత్సరాలకొక సారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జూలై ఒకటో తేదీ నుండి ఆగష్టు 17వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు.

PC:YOU TUBE

మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమలోనూ, చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) భంగిమలోనూ దర్శనం

మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమలోనూ, చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) భంగిమలోనూ దర్శనం

మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమలోనూ, చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) భంగిమలోనూ దర్శనం ఇస్తారు. 48 రోజుల తరువాత స్వామి వారి విగ్రహాన్ని తిరిగి వెండి పెట్టెలో పెట్టి పుష్కరిణిలోని నాలుగు కాళ్ల మంటపంలో అనంత సరోవరం (అనంత పుష్కరణి)లో ఉంచి నీటితో నింపేస్తారు. విశేషమేంటంటే అత్తివరదర్‌ వసంత మంటపం నుంచి భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు ఎలాంటి అర్చనలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలు ఉండవు.

PC:Fahad Faisal

అత్తి వరదర్‌ను భూమిలోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత

అత్తి వరదర్‌ను భూమిలోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత

అత్తి వరదర్‌ను భూమిలోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత పుష్కరిణిగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. పురాణాలు మాత్రం యాగ గుండం నుంచి అత్తివరదర్‌ పుట్టినట్లు చెబుతున్నాయి. చివరిగా అత్తివరదర్‌ను 1979లో అనంత సరస్సును నుంచి బయటకు తీసుకొచ్చారు. తిరిగి స్వామిదర్శనం 2059లో జరుగుతుంది.

PC:Ssriram mt

కంచిలో దర్శించవల్సిన ఇతర ప్రదేశాలు :

కంచిలో దర్శించవల్సిన ఇతర ప్రదేశాలు :

కంచి కామాక్షి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి ఆలయం (శివకంచి), కామకోటి పీఠం.

PC:ShamaliKolhe

దర్శన సమయాలు...

దర్శన సమయాలు...

ఉదయం 6 గం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. తమిళనాడులోని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాల నుంచి తిరుపతి, చెన్నైల నుంచి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

PC:Ravindraboopathi

 ఉచిత దర్శనంతో పాటు

ఉచిత దర్శనంతో పాటు

ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 నుంచి 12 వరకు సాయంత్రం 7 నుంచి 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఈ సేవలో స్వామిని సేవించడానికి రూ.500 టికెట్ తీసుకోవలసి ఉంటుంది.

PC:Ssriram mt

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

చెన్నై నుంచి 80 కి.మీ., తిరుపతి నుంచి 180 కి.మీ. దూరంలో కంచి ఉంది. ఆ నగరాల నుంచి బస్సుల్లో కంచి చేరుకోవచ్చు.

నాగర్‌కోయిల్‌, మదురై వెళ్ళే కొన్ని రైళ్ళు కంచి రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.

సమీప విమానాశ్రయం చెన్నైలో ఉంది.

PC:YOU TUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X