Search
  • Follow NativePlanet
Share
» »కోవ్ లాంగ్ బీచ్ - బీచ్ ప్రియులకు ఆనందం !

కోవ్ లాంగ్ బీచ్ - బీచ్ ప్రియులకు ఆనందం !

By Mohammad

కొవ్ లాంగ్ బీచ్ తమిళనాడులో ప్రసిద్ధి చెందిన తీర ప్రాంతం. చెన్నై సందర్శించే పర్యాటకులు మెరీనా బీచ్ తో పాటు తప్పక దీన్ని కూడా సందర్శిస్తారు. చెన్నై మహానగరం నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొవ్ లాంగ్ మత్స్య గ్రామానికి, చెన్నై నుండి ప్రతిరోజూ ప్రభుత్వ బస్సులు మరియు ప్రవేట్ వాహనాలు తిరుగుతుంటాయి. పూర్వం ఈ తీరప్రాంతం డచ్ వారి ఆధీనంలో ఉండేది.

కొవ్ లాంగ్ బీచ్ ... బీచ్ ప్రేమికులకు తప్పక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ గల ప్రధాన ఆకర్షణ రిసార్ట్ లు. డచ్ కట్టడాలను చాలా వరకు రిసార్ట్ లుగా మార్చి టూరిస్ట్ లను ఆకర్షిస్తుంటారు స్థానికులు. ఇంతేకాక 5 వ మరియు 8 వ శతాబ్దానికి చెందిన ఆలయాలు చూడవచ్చు. వీటిని పల్లవ రాజులు నిర్మించినట్లు చెబుతారు.

ఇది కూడా చదవండి : తమిళనాడులోని ఆరు మురుగన్ దివ్య క్షేత్రాలు !

టెంపుల్స్ తరువాత ప్రధానంగా చెప్పుకోవలసినవి నీటి క్రీడలు. కొవ్ లాంగ్ బీచ్ లో పర్యాటకులు సురక్షితమైన నీటిక్రీడలు ఆడుతారు. ఇక్కడ గల విండ్ సర్ఫింగ్ దేశంలోనే ఏకైక క్రీడగా పేర్కొంటారు. ఇవేకాక ఇక్కడ మరికొన్ని పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. వాటి వివరాలలోకి వెళితే ..

పల్లవుల ఆలయం, కొవ్ లాంగ్

పల్లవుల ఆలయం, కొవ్ లాంగ్

డచ్ ఫోర్ట్

ఇక్కడున్న డచ్ ఫోర్ట్ చరిత్ర ప్రియులకు ఆసక్తిని రేకిస్తుంది. అప్పటి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సైనిక బలగాల కోసం దీనిని నిర్మించారు. దీని వైభవోపేత రోజులు గడిచినప్పటికీ ఇప్పటికి ఒక పెద్ద ఆకర్షణగా పర్యాటకులు వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం సందర్శిస్తూనే వుంటారు. ఫోర్ట్ కు సమీపంలో కాటేజ్ లు, విల్లాలు కలవు.

విండ్ సర్ఫింగ్, కొవ్ లాంగ్ బీచ్

విండ్ సర్ఫింగ్, కొవ్ లాంగ్ బీచ్

చిత్రకృప : Wings and Petals

ముట్టుకాడు బ్యాక్ వాటర్స్

ఈ బ్యాక్ బ్యాక్ వాటర్స్ ఎన్నో రకాల నీటి క్రీడలను సాహసికులు అందిస్తుంది. కయింగ్, విండ్ సర్ఫింగ్, కేనోయింగ్ వంటివి ఇక్కడ ఆచరించవచ్చు. చక్కని పచ్చదనం, పుష్కలమైన నీటి అందాలు, వృక్ష, జంతు సంపదలతో ఈ ప్రదేశం నిండి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నిర్వహించే విండ్ సర్ఫింగ్ క్రీడలో పాలొనటానికి సాహసికులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తుంటారు. చెన్నై నుండి ఇది 28 కి. మీ ల దూరంలో కలదు.

కేథలిక్ చర్చి, కొవ్ లాంగ్

కేథలిక్ చర్చి, కొవ్ లాంగ్

చిత్రకృప : Vincent D Souza

కేథలిక్ చర్చి

కాథలిక్ చర్చి ఇక్కడున్న ప్రధాన మత కేంద్రం. దీనిని కూడా డచ్ వారు నిర్మించారని కొందరు, కాదు బ్రిటీష్ వారు నిర్మించారని మరికొందరు అంటుంటారు. ఎవరు ఏమన్నా వలస రాజ్యాలు నిర్మించారనేది వాస్తవం. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే రోజులలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. దీని శిల్పశైలి అద్భుతంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : ట్రాన్క్విబార్ - అంతులేని గీతం ఆలపించే సముద్రం ఉన్న ప్రదేశం !

కొవ్ లాంగ్ బీచ్ సందర్శన సమయం : వింటర్ సీజన్ (అక్టోబర్ ప్రారంభం నుండి మర్చి చివరి వరకు)

విశ్రాంతి పడకలు, కొవ్ లాంగ్ బీచ్

విశ్రాంతి పడకలు, కొవ్ లాంగ్ బీచ్

చిత్ర కృప : simianwolverine

కొవ్ లాంగ్ ఎలా చేరుకోవాలి ?

కొవ్ లాంగ్ బీచ్ చేరుకోవటానికి చక్కటి రోడ్డు సౌకర్యం కలదు. సమీపాన రైల్వే స్టేషన్, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా కలవు.

విమాన మార్గం : విమానాలలో వచ్చే పర్యాటకులు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి కొవ్ లాంగ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : రైళ్లలో వచ్చే పర్యాటకులకు చెన్నైసూచించదగినది. చెన్నై నుండి బస్సు లేదా టాక్సీ లలో ప్రయాణించి కొవ్ లాంగ్ వెళ్ళవచ్చు.

బస్సు / రోడ్డు మార్గం : చెన్నై, పాండిచ్చేరి, ట్రాంకేబార్ తదితర సమీప ప్రాంతాల నుండి కొవ్ లాంగ్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు, ప్రవేట్ వాహనాలు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X