Search
  • Follow NativePlanet
Share
» »ట్రాన్క్విబార్ - అంతులేని గీతం ఆలపించే సముద్రం ఉన్న ప్రదేశం !

ట్రాన్క్విబార్ - అంతులేని గీతం ఆలపించే సముద్రం ఉన్న ప్రదేశం !

By Mohammad

ట్రాన్క్విబార్ లేదా పూర్వం 'తరంగంబడి' గా పిలువబడిన ఈ పట్టణం తమిళనాడు లోని నాగపట్టణం జిల్లలో ఉంది. తరంగంబడి ని సాహిత్యపరంగా అనువదిస్తే "పాటలుపాడే అలల ప్రదేశం" అని అర్థం. గతంలో దీనిని డేనిష్ కాలనీ అని పిలిచేవారు. ప్రస్తుతం డేనిష్ భాష లో దీనిని 'ట్రాన్క్విబార్' అని పిలుస్తున్నారు. 17 వ శతాబ్దం ముందు నుండి 19 వ శతాబ్దం మధ్య వరకు ట్రాన్క్విబార్ ఎంతో కీర్తిని కలిగి ఉండేది. ఆ సమయంలో ఇది డేనిష్ వారి ఆధీనంలో ఉన్న ఒక ముఖ్యమైన ఓడ రేవు.

ట్రాన్క్విబార్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ట్రాన్క్విబార్ చూడడానికి కారణం డేనిష్ నిర్మాణ శైలి. డాన్స్ బోర్గ్ (డేనిష్ కోట) ట్రాన్క్విబార్ లోని చూడదగ్గ మరో ప్రదేశం. ఇక్కడ క్రైస్తవ మిషనరీలు నిర్మించిన చాలా చర్చిలు కూడా వున్నాయి. డేనిష్ మ్యూజియం, ట్రాన్క్విబార్ తీరం కూడా ఇతర ఆకర్షణలు. రవాణా సౌకర్యాలు బాగున్న ట్రాన్క్విబార్ చెన్నై కి చాలా దగ్గర.

బీచ్ ఒడ్డున డేనిష్ కోట

బీచ్ ఒడ్డున డేనిష్ కోట

చిత్రకృప :Esben Agersnap

డేనిష్ కోట

డేనిష్ వారు ఇండియాకి వచ్చి స్థిరపడిన తరువాత నిర్మించిన భవంతులలో డేనిష్ కోట ఒకటి. ఓవే జెడ్డే అనే డేనిష్ కెప్టెన్ ఇక్కడ ఒక కాలనీని నిర్మించాడు. 400 ఏళ్ల క్రితం నిర్మించిన కోట ఎన్నో సార్లు పునర్నిర్మించబడింది. ఆ ప్రాంత గవర్నర్ కు, ఇతర విదేశీ అధికారులకు ఇది అధికారిక నివాసంగా 150 ఏళ్ల పాటు సేవలు అందించింది.

ఇది కూడా చదవండి : తిరువెంకడు - శివభగవానుడి ఉగ్రరూపం !

కోట ను సందర్శించేటప్పుడు యూరోపియన్ పరిపాలన కాలం నాటి విలువైన అవశేషాలను గుర్తించవచ్చు. చరిత్ర మీద ఆసక్తిగలవారికి ఈ ప్రదేశం సూచించదగినది. కోట సముద్ర తీరానికి ఒడ్డున కలదు. కోట మీద నుంచి బంగాళాఖాతం సముద్ర దృశ్యాలు చూడవచ్చు.

మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచిన వస్తువులు

మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచిన వస్తువులు

చిత్రకృప : Mukulfaiz

డేనిష్ మ్యూజియం

డేనిష్ మ్యూజియంలో కళాఖండాల ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భద్రపరిచిన వస్తువులు పురాతనమైనది. వీటిలో చాలా వరకు డేనిష్ వారే కనుగొన్నారు.

మ్యూజియంలో చూడదగ్గవి : అరుదైన డచ్చి రాత ప్రతులు, పింగాణి సామాను, మట్టి బొమ్మలు, ఆయుధాలు లాంటివి.

ట్రాన్క్విబార్ బీచ్

ట్రాన్క్విబార్ బీచ్

చిత్రకృప : samjayanth

ట్రాన్క్విబార్ బీచ్

మీ బాధలను మైమరపించే అలల సంగీతం అందించే సముద్ర తీరం ట్రాన్క్విబార్. కోరమండల్ తీరంపై ఉన్న దీనిని ఇంకా పూర్తిగా అన్వేషించాల్సి ఉంది. బడ్జెట్ ఎకామడేషన్ సౌకర్యాలెన్నో అందించే ఈ తీరంలో ఉన్నపుడు తప్పక చూడాల్సిన ప్రాంతం బీచ్ మీది బంగళా అనబడే నీమ్రానా హోటల్స్ వారు నిర్వహించే హోటల్.

ఇది కరైకల్ నుండి 15 కిలోమీటర్ల కొద్ది దూరంలో ఉంది. ఇది ఉండడానికి, అనేక ఖండాంతర వంటకాలను రుచిచూడడానికి ఒక ప్రత్యెక ప్రదేశం. ఈ తీరమే చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి. అటు సూర్యుడిని, ఇటు ఎగసిపడే అలలని కలుపుతూ రెండువైపులా విస్తరించి ఉంది ఈ తీరం. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ తీరంలో అలసిన మనసుకి కావలసిన ప్రశాంతత దొరుకుతుంది. శతాబ్దాల నుండి క్రైస్తవ మిషనరీలు నిర్మించిన అనేక చర్చిలు కూడా ఈ తీరం వెంట చూడవచ్చు.

బీచ్ మీది బంగళా

బీచ్ ఒడ్డున దృశ్యాలు

ట్రాన్క్విబార్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై ఎయిర్ పోర్ట్ సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి ట్రాన్క్విబార్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : నాగపట్టినం, చిదంబరం రైల్వే స్టేషన్ లు ట్రాన్క్విబార్ కు సమీపాన ఉన్నాయి.

రోడ్డు మార్గం : తంజావూర్, చెన్నై, బెంగళూరు, తిరువరూర్, కరకైల్, పాండిచ్చేరి ల నుండి రోజువారీ బస్సులు ట్రాన్క్విబార్ కు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X