Search
  • Follow NativePlanet
Share
» »తిరువెంకడు - శివ భగవానుడి ఉగ్ర రూపం !

తిరువెంకడు - శివ భగవానుడి ఉగ్ర రూపం !

By Mohammad

తిరువెంకడు, తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కలదు. నాగపట్టినం లేదా నాగపట్నం నుండి తిరువెంకడు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న నవ గ్రహ ఆలయాలలో ఒకటి. చెన్నై నుండి 268 కిలోమీటర్ల దూరంలో, తిరుచిరాపల్లి నుండి 160 కిలోమీటర్ల దూరంలో తిరువెంకడు కలదు.

తిరువెంకడు ప్రదేశంలో ఇంద్ర దేవుని యొక్క ఐరావతం (తెల్ల ఏనుగు) ధ్యానం చేయటం వల్ల ఈ ప్రదేశానికి ఆపేరొచ్చిందని చెబుతారు. తిరువెంకడు కాశీని పోలిన ఆరు దివ్య క్షేత్రాలలో ఒకటిగా, యాభై శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్నది.

తిరువెంకడు ఆలయం

తిరువెంకడు ఆలయం

చిత్ర కృప : chandrasekaran arumugam

స్థల పురాణం

మురుతువన్ అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరాన్ని పొంది దేవతలను చిత్రహింసలకు గురిచేసెను. దేవతలు శివుని వద్దకు వెళ్లి ప్రార్ధిస్తే, ఆయన తిరువెంకడు వెళ్లి నివాసం ఉండమని చెప్పెను. వారితో పాటు నందిని వెంట పంపెను. అతను రాక్షసుడిని చంపి సముద్రంలో పడవేసెను.

ఇది కూడా చదవండి : ఆ చిదంబర రహస్యం ఏమిటీ ??

ఆతర్వాత రాక్షసుడు తీవ్రమైన తపస్సు ద్వారా శివుని శూలాన్ని వరంగా పొందెను. మరలా దేవతల అభ్యర్థన మేరకు శివుడు తన వాహనమైన నందిని పంపెను. వారిద్దరి మధ్య జరిగిన భీకర పోరులో నంది గాయపడెను. వెనక భాగంలో గాయపడిన నంది విగ్రహాన్ని ఇప్పటికీ చూడవచ్చు. నందికి తగిలిన గాయాన్ని చూసి శివుడు కోపోద్రిక్తుడై మూడవ కన్ను తెరవటం వలన రాక్షసుడు మరణించెను.

ఆలయ ధ్వజ స్తంభం

ఆలయ ధ్వజ స్తంభం

చిత్ర కృప : chandrasekaran arumugam

శివుడి యొక్క 64 ముద్రలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ శివుడి ఉగ్రరూపం ను చూడవచ్చు. ఉగ్రరూపంలో ఉన్న శివుడి విగ్రహాన్ని ఇక్కడ పూజిస్తారు.

స్వేతరంయేస్వరార్ ఆలయం

స్వేతరంయేస్వరార్ ఆలయం, తిరువెంకడులో ఉంది. ఈ ఆలయం బుధ గ్రహం కొరకు నిలయంగా ఉంది. లార్డ్ శివ ను ప్రధానంగా మరియు స్వేతరంయేస్వరార్ విగ్రహంను ఇక్కడ పూజిస్తారు. పార్వతీదేవిని బ్రహ్మవిద్యానాయకిగా పూజిస్తారు. బుదునికి ఒక ప్రత్యేకమైన గర్భగుడి ఉన్నది. దానిని స్వేతరంయేస్వరార్ ఆలయం అని అంటారు.

ఆలయ గోడలపై శివతాండవం పెయింటింగ్

ఆలయ గోడలపై శివతాండవం పెయింటింగ్

చిత్ర కృప : sowrirajan s

స్వేతరంయేస్వరార్ ఆలయంలో ఒక అరుదైన అంశం శివుడి చిత్రాలు 5 ముఖాలుగా (తత్పురుషం, వామదేవం, ఏఅసనం, సద్యోజాతం మరియు అఘోరం) కలిగి ఉంది. ఈ ఆలయం ముందు ద్వారం వద్ద, ఈ ఆలయం యొక్క మరొక అసాధారణ లక్షణం నంది యొక్క భంగిమ ఉంది. ఆ నందికి దాని శరీరం మీద 9 మచ్చలు కలిగి, దేవీ మందిరం యొక్క తలుపు వద్ద ఉంటుంది . నంది యొక్క మొహం శివ మందిరం వైపు మరియు చెవులు దేవత వైపు వంగి ఉంటాయి. నంది శివుడు మరియు పార్వతి నుండి ఆదేశాలను అంగీకరించడాన్ని ఈ ప్రదేశం సూచిస్తుంది.

ఇక్కడ అగ్ని తీర్థం మరియు చంద్ర తీర్థం,సూర్య తీర్థం అనే మూడు తీర్దాలు ఉన్నాయి. ఈ తీర్దాలు శివుడు తాండవం చేస్తున్నప్పుడు తన కంటి నుంచి మూడు చుక్కలు క్రింద పడటం వల్ల ఏర్పడ్డాయి. ఈ ఆలయ గోడలపై చెక్కబడిన నగీషీలు చోళ రాజవంశం మరియు విజయనగర ఇతర చక్రవర్తులకు సంభందించిన ముఖ్యమైన చారిత్రక సమాచారం సూచిస్తాయి.

ఆలయం వెలుపల ఉన్న కోనేరు

ఆలయం వెలుపల ఉన్న కోనేరు

చిత్ర కృప : விழிகளின் பார்வை

అంతే కాకుండా లార్డ్ శివ అంకితం ఒక దేవాలయంలో ఒక వ్యక్తీ యొక్క జన్మ పట్టికలో ఉన్న దుష్ప్రభావాలు మరియు గ్రహ ప్రభావాలు పోయి మరియు జీవితంలో అదృష్ట విషయాలను ఆహ్వానించడానికి బుధుడు గ్రహంను ఆరాధించటానికి ప్రజలు గుంపులుగా వస్తారు. తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటైన ఈ ఆలయంలో పూజలు చేస్తే ప్రజలకు సంపద మరియు జ్ఞానం లభిస్తాయి.

ఆలయ గోపురం మరియు ముఖద్వారం

ఆలయ గోపురం మరియు ముఖద్వారం

చిత్ర కృప : Vijay R

తిరువెంకడు ఆలయానికి ఎలా వెళ్ళాలి ?

విమాన మార్గం : ట్రిచి సమీప విమానాశ్రయం (160 km). ఇక్కడికి బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం తదితర నగరాల నుండి విమానాలు వస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి తిరువెంకడు చేరుకోవచ్చు.

రైలు మార్గం : మైలదుతురై రైల్వే స్టేషన్ తిరువెంకడుకు 19 km ల దూరంలో కలదు. ఇక్కడికి ట్రిచి, చెన్నై తదితర రైల్వే స్టేషన్ నుండి రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ వెలుపల క్యాబ్ లేదా టాక్సీ లో తిరువెంకడు చేరుకోవచ్చు.

బస్సు మార్గం : తంజావూరు, మైలదుతురై, నాగపట్టినం, ట్రిచి తదితర పట్టణాల నుండి ప్రవేట్, ప్రభుత్వ బస్సులు తిరువెంకడు కు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X