Search
  • Follow NativePlanet
Share
» »తిరుచిరాపల్లి - తమిళనాడు గుండె కాయ !

తిరుచిరాపల్లి - తమిళనాడు గుండె కాయ !

త్రిచి లేదా తిరుచి లేదా అతి పురాతనంగా పిలువబడే తిరుచిరాపల్లి దక్షిణ భారత దేశ రాష్ట్రమైన తమిళనాడు లోని మధ్య ప్రాంతంలో కలదు. ఇండియా లోని పురాతన పట్టణాలలో త్రిచి ఒక పర్యాట కుడికి ఎన్నో ఆకర్షణలు అందిస్తుంది. తంజావూర్, మదురై , కుంబకోణం మొదలైన పట్టణాల వలెనె, త్రిచి పట్టణం కూడా చోళులు, పాండ్యులు , విజయ నగర రాజులు, నాయక లు మొదలైన వారి పాలన చవి చూసింది. చరిత్ర ఈ పట్టణానికి అనేక, స్మారకాలు, దేవాలయాలు అందించినది. ఈ నగరంఅక్కడ కల ప్రసిద్ధ విద్యా సంస్థలు, పరిశ్రమలు కారణంగా తమిళనాడు లో ఒక ప్రసిద్ధ విద్యా రంగ, పారిశ్రామిక రంగ కేంద్రంగా కూడా పేరు తెచ్చుకుంది. త్రిచి లోని కొన్ని పర్యాటక ఆకర్షణలు పరిశీలిద్దాం.

కల్లనాయి డాం

కల్లనాయి డాం

కల్లనాయి డాం ను గ్రాండ్ ఆనకట్ట అని కూడా పిలుస్తారు. ఇది సుమారు రెండు వేల సంవత్సరాల కిందట చోళుల పాలనలో నిర్మించినదిగా చెపుతారు. ఈ డాం కావేరి నదిని ఇక్కడ నాలుగు భాగాలుగా చీలుస్తుంది. ఇక్కడ కల ప్రకృతి అందాలు ఈ ప్రదేశాన్ని ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా చేసాయి. Photo Courtesy: Thangaraj Kumaravel

శ్రీ రంగనాథ స్వామి టెంపుల్

శ్రీ రంగనాథ స్వామి టెంపుల్

త్రిచి లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ద్రావిడ దేవాలయ శిల్ప శైలి లో కల ఈ దేవాలయం 108 దివ్య దేశాలలో ఒకటి. కావేరి నదిలోని చిన్న ద్వీపంలో ఈ టెంపుల్ ను సుమారు 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇండియ లో అతి పెద్ద దేవాలయ సమూహం గాను, ప్రపంచంలో పెద్ద దేవాలయంగాను గుర్తించబడినది. దీనికి 21 గోపురాలు కలవు. ప్రధాన రాజ గోపురం ఆసియా లో రెండవ పొడవైన గోపురంగా చెపుతారు.
Photo Courtesy: Ajith Kumar

ఉచ్చి పిళ్ళయార్ టెంపుల్

ఉచ్చి పిళ్ళయార్ టెంపుల్

7 వ శతాబ్దానికి చెందిన ఉచ్చి పిళ్ళయార్ టెంపుల్ ను రాక్ ఫోర్ట్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. దీనిలో దేముడు గణేశ. విగ్రహం ఎత్తు సుమారు 272 అడుగులు కలదు. పల్లవుల రాతి శిల్ప శైలి కి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ ప్రదేశం నుండి నగరం పూర్తిగా చూడవచ్చు.
Photo Courtesy: Santhoshj

శ్రీరంగం ద్వీపం

శ్రీరంగం ద్వీపం

త్రిచి పట్టణంలోని శ్రీరంగం ద్వీపంలో కల శ్రీ రంగనాధ స్వామి టెంపుల్ ప్రసిద్ధి చెందినది. ఈ ద్వీపం చుట్టూ కావేరి మరియు కొల్లి డాం లు కలవు. దేవాలయాన్ని మరియు ఇతర ఆకర్షణలు చూసేందుకు శ్రీరంగ పట్టణానికి దేశ వ్యాప్తంగా యాత్రికులు వస్తారు. పండుగల సమయంలో శ్రీరంగంకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.
Photo Courtesy: FlickreviewR

జంబుకేశ్వర టెంపుల్

జంబుకేశ్వర టెంపుల్

జంబుకేశ్వర దేవాలయం త్రిచి లో ఒక పురాతన దేవాలయం. దీని ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయం సుమారు 1,800 సంవత్సరాల నాటిదిగా చెపుతారు. ఇది పంచభూత స్థలం లలో ఒకటి. ఈ టెంపుల్ నీటిని ప్రతి బిమ్బిస్తుంది. ఈ దేవాలయం గురించిన అనేక కధలు ప్రచారంలో కలవు. దీని ప్రవేశ మార్గం నాలుగు అడుగులు ఎత్తు మరియు రెండున్నర అడుగుల వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది.

Photo Courtesy: Varun Shiv Kapur

వయ లూర్ మురుగన్ టెంపుల్

వయ లూర్ మురుగన్ టెంపుల్

సుమారు 1,200 సంవత్సరాల పురాతనమైన వయలూర్ మురుగన్ టెంపుల్ చోళ శిల్ప శైలికి మరొక ఉదాహరణ. ఈ దేవాలయంలో హిందూ దేవుడు ఐన మురుగన్ లేదా సుబ్రమన్యుడు ప్రధాన దైవం. త్రిచి లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ.

Photo Courtesy: Jean-Pierre Dalbera

పులి ఆన్చోలాయి

పులి ఆన్చోలాయి

కొల్లిమలాయి కొండల దిగువ భాగంలో కల పులియాన్ చోలాయి ఒక సహజ ప్రకృతి దృశ్యాల ప్రదేశం. ఇక్కడ అనేక పచ్చని వృక్షాలు, ఇతర ప్రకృతి దృశ్యాలు, ఒక చిన్న నీటి ప్రవాహం, మొదలైనవి కలవు. దీనిని ఒక పిక్నిక్ స్పాట్ గా ఆనందిస్తారు. ఈ ప్రవాహ నీరు ఔషధ గుణాలు కలదని భావిస్తారు. Photo Courtesy: Simply CVR

ముక్కోమ్బు

ముక్కోమ్బు

త్రిచి పట్టణానికి సుమారు 18 కి. మీ. ల దూరంలో కల ముక్కోమ్బు పర్యాటకులకు ఎన్నో ఆకర్షణలు అందిస్తుంది. వాటిలో ఒక డాం , అమ్యూజ్ మెంట్ పార్క్, పిల్లల పార్క్ , స్పోర్ట్స్ పార్క్ , బోటింగ్, ఫిషింగ్ మొదలైనవి కలవు. పిల్లలకు గుడులు అన్నీ చూపి కోపం తెప్పించిన తర్వాత, ఈ ప్రదేశం వారికి వినోదం కలిగిస్తుంది.
Photo Courtesy: Balajiviswanathan

ఆహారాలు మరియు షాపింగ్

ఆహారాలు మరియు షాపింగ్

రాక్ ఫోర్ట్ టెంపుల్ వద్ద కల వసంత భవన్ వంటి హోటళ్ళలో మీరు చక్కని అసలు సిసలైన దక్షణాది వంటకాలు తిని ఆనందించవచ్చు. వేసవిలో త్రిచి మామిడి పండ్లు చాలా రుచికరం. షాపింగ్ చేయాలనుకునే వారు స్థానిక చైనా బజార్ లేదా ప్రభుత్వ ఎంపోరియం లకు వెళ్లి కొనుగోళ్ళు చేయవచ్చు. Photo Courtesy: kifo

త్రిచి ఎలా చేరాలి ?

త్రిచి ఎలా చేరాలి ?

ఇండియా లోని అన్ని ప్రధాన జాతీయ రహదారుల నుండి త్రిచి పట్టణానికి మార్గం కలదు. ప్రభుత్వ బస్సు లు, ప్రైవేట్ వాహనాలు అనేకం ఇతర రాష్ట్రాలనుండి నడుస్తాయి.
రైలు ప్రయాణం
త్రిచి రైల్వే స్టేషన్ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.
విమాన ప్రయాణం
విమాన ప్రయాణం చేయాలనుకునే వారు తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు నేరుగా ఫ్లైట్ లలో చేరుకొనవచ్చు. iఇతర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ల నుండి ఇక్కడకు విమాన సేవలు కలవు.

Photo Courtesy: Bombman

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X