Search
  • Follow NativePlanet
Share
» » అటు కఠినం, ఇటు కమనీయం...గంగోత్రితో మొదలయ్యి, కేదర్నాథ్ తో ముగిసే ట్రెక్

అటు కఠినం, ఇటు కమనీయం...గంగోత్రితో మొదలయ్యి, కేదర్నాథ్ తో ముగిసే ట్రెక్

అడెన్స్ కూల్ ట్రెక్ గురించి కథనం.

By Sridevi

ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లు ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఒక వైపు మంచు పర్వతాలు, మరోవైపు పచ్చటి భూభాగాలు అంతేనా చుట్టూ ఉరకలేసే నదులూ అన్నీఉత్తరాఖండ్ సొంతం. అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మంచుకొండల్లో 18 వేల అడుగుల ఎత్తున ఉన్న 'ఆడెన్స్ కల్' పర్వత మార్గం సాహక పర్యాటకులకు స్వర్గధామం అనే చెప్పాలి. 1939లో ఈ మార్గాన్నేర్పరిచారు. దీనిని జాన్ బిక్‌నెల్ ఆడెన్ పేరుతో పిలుస్తున్నారు. ప్రకృతి సోయగానికి పేరుగాంచిన ఈ మార్గం కఠిన ప్రయాణానికీ అంతే పేరుగాంచింది. హిమాలయాల్లోని గార్వాల్ శ్రేణిలో ఉన్న ఈ పర్వత మార్గం భారతదేశంలోని అత్యంత సాహసభరితమైన ట్రెక్కింగ్ మార్గాల్లో ఒకటి. భీతావహ ఎత్తుల్లో , అత్యంత కఠినమైన భూభాగంతో ఈ మార్గంలో ట్రెక్కింగ్ అంటే సవాలే.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube

ఆడెన్ మార్గం ఖట్లింగ్, జోగిన్-1 హిమనీనదాలను కలుపుతుంది. ఇది గంగోత్రిలో మొదలై కేదారనాథ్‌లో ముగుస్తుంది. గంగోత్రి, కేదారనాథ్‌లు దేశంలోని అత్యంత ప్రముఖ పుణ్యస్థలాలు. ఛార్‌ధామ్ యాత్రలో ఇవి భాగం.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
సన్నని శిఖరాగ్రాలను ఎక్కుతూ వంపులు తిరిగిన పర్వత దారుల్లో సాగుతూ సన్నని బాటలను దాటుకుంటూ ముందుకు సాగాల్సి ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణాన్ని అత్యంత కష్టమైనదిగా చెప్తారు.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
అంతేకాదు... ఇది ప్రొఫెషనల్ ట్రెక్కర్లు మాత్రమే వెళ్లగలిగే మార్గం. ట్రెక్కింగ్‌లో ఏమాత్రం అనుభవం లేనివారు వెళ్తే ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని చెప్పాలి. మొత్తం నాలుగు రోజుల దిల్లీ-గంగోత్రి-దిల్లీ ప్రయాణం సహా 20 రోజులు పట్టే ఈ ట్రెక్కింగ్‌లో గుర్తుంచుకోవాల్సిన మరో అంశమేంటంటే... ఎత్తయిన మార్గంలో సాగాల్సిరావడం.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
గమ్యస్థానం అత్యంత ఎత్తున ఉండడంతో వాతావరణ పరిస్థితులకు శరీరం అలవాటుపడాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ ఎంత కష్టంగా ఉన్నప్పటికీ మార్గమధ్యంలో సుందరమైన ఆల్పెన్ మైదానాల్లోంచి వెళ్లడం, గార్వాల్ శ్రేణుల వీక్షణం ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తాయి.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
ఆడెన్స్ కల్ మార్గంలో ట్రెక్కింగ్‌కు మే నుంచి జూన్ వరకు, అలాగే సెప్టెంబర్ నుంచి అక్టోబరు రెండో వారం వరకు అనుకూలమైన కాలం. మే నుంచి జూన్ మధ్య ట్రెక్కింగ్ గొప్ప అనుభూతినిస్తుంది.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
దేశమంతా ఎండలు మండిపోతున్న వేళ గార్వాల్‌ హిమాలయాల్లోని చల్లని వాతావరణంలో ట్రెక్కింగ్ హాయి కలిగిస్తుంది. ఆ సమయంలో మంచు అంత దట్టంగా ఉండదు. ఇక సెప్టెంబరు తరువాత ట్రెక్కింగ్‌కు వెళ్తే గడ్డ కట్టే చలిలో సాగాల్సి ఉంటుంది. ఎటుచూసినా దట్టంగా పేరుకున్న మంచే కనిపిస్తుంది.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
ఈ మొత్తం యాత్రలో తొలి రెండు రోజులు దిల్లీ నుంచి గంగోత్రి చేరడానికే సరిపోతాయి. అప్పటికి అలసిపోయినట్లుగా అనిపిస్తే గంగోత్రిలో ఒకరోజు రెస్ట్ తీసుకోవచ్చు. ఇది ప్రాథమికంగా హిమాలయాల వాతావరణానికి అలవాటుపడే అవకాశం కల్పిస్తుంది. యాత్రలో చివరి రెండు రోజుల కూడా గంగోత్రి నుంచి రిషికేశ్ మీదుగా దిల్లీ చేరడానికే కేటాయిస్తారు.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
దిల్లీ నుంచి గంగోత్రికి రెండు రోజులు.. అక్కడ ఒక రోజు విశ్రాంతి తరువాత నాలుగో రోజు నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. గంగోత్రి నుంచి నాలా బేస్‌కేంప్‌కు చేరుకుంటారు. ఈ ప్రయాణం గంగోత్రి నేషనల్ పార్కులోంచి సాగుతుంది.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
దారిపొడవునా సెడర్, రొడోడెండ్రన్ చెట్లు అంతులేకుండా కనిపిస్తూనే ఉంటాయి. రుద్రగైరా నదిని చేరడంతో ఆ రోజు యాత్ర ముగుస్తుంది. 5వ రోజున రుద్రగైరా క్యాంప్‌కు చేరాల్సి ఉంటుంది.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
ఇందుకు 7 నుంచి 8 గంటలు పడుతుంది. ఒక శిఖరం నుంచి మొదలై వాగులువంకల్లోంచి సాగుతూ చివరగా మరో నిటారైన శిఖరంపైకి చేరుతారు. అక్కడ నుంచి అద్భుతమైన రుద్రగైరా, జోగిన్ శిఖరాలు కనిపిస్తాయి. ఇక ఆరో రోజున మళ్లీ విశ్రాంతి.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
వాతావరణానికి అలవాటుపడడానికి ఆ రోజు ఉపయోగపడుతుంది. అప్పటికే 14,270 అడుగుల ఎత్తుకు చేరుతారు. ఏడో రోజున గంగోత్రి గ్రూప్ బేస్ క్యాంప్‌కు చేరాలి. దారిపొడవునా రాళ్ల గుట్టలు, నిట్టనిలువన ఎక్కాల్సిన దారులు ఉంటాయి. కానీ, క్యాంప్‌కు చేరాక అక్కడి నుంచి గంగోత్రి శిఖర సమూహాలను చూస్తుంటే ఆ ఆనందమే వేరు.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
ఎనిమిదో రోజు నుంచి ట్రెక్కింగ్ ఇంకా కష్టతరంగా ఉంటుంది. ఆ రోజున ఆడెన్స్ కల్ బేస్ క్యాంప్‌కు చేరుతారు. ఇక అక్కడి నుంచి ఖట్లింగ్ హిమనీనదాన్ని చేరడానికి సాగించే తొమ్మిదో రోజు ప్రయాణం అసలైనది. అత్యంత సాహసభరిత ప్రయాణమిది.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
ఈ ప్రయాణం వేకువనే ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేకాదు... కాదు, మార్గమధ్యంలో శిఖరాలను దాటుకుంటూ వెళ్లడానికి తాళ్లు, ఇతర ట్రెక్కింగ్ సామగ్రి ఉపయోగించడం తప్పనిసరి. 18 వేల అడుగుల ఎత్తున ఉన్న ఆడెన్స్ కల్ చేరుకున్నాక అక్కడ నుంచి హిమాలయాల అందం చూడ్డానికి విరామం తీసుకోవాల్సిందే.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
ఆ తరువాత మళ్లీ యాత్ర మొదలుపెడితే అక్కడ నుంచి ఒకింత సులభంగానే ఖట్లింగ్ హిమనీనదాన్ని చేరుకోవచ్చు. అక్కడ క్యాంప్ వేసుకోవచ్చు. పదో రోజున జీరో పాయింట్‌కు చేరాల్సి ఉంటుంది. సుమారు 12 గంటల ట్రెక్కింగ్ ఇది.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
మొత్తం గ్లేసియర్లలోంచి వెళ్లాలి. అత్యాధునిక ట్రెక్కింగ్ సామగ్రి లేనిదే ముందుకు కదలలేరు. మొత్తం యాత్రలో అత్యంత కఠినమైనది ఇదే. జీరోపాయింట్ చేరుకున్నాక అక్కడి నుంచి 12వ రోజున చౌకీ చేరుతారు.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
నాలుగైదు గంటల్లోనే ఇది ముగుస్తుంది. పైగా.. కొంత చదునైన మార్గం తగులుతుంది కాబట్టి యాత్ర అంత కష్టం అనిపించదు. 12, 13వ రోజుల్లో మీరు సుందరమైన మసార్ సరస్సు, వాసుకి సరస్సులను చేరుతారు. 14వ రోజున కేదారినాథ్ చేరుకుంటారు.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. అక్కడ ట్రెక్కింగ్ ఆపేయొచ్చు లేదంటే రిషికేశ్ వరకు వెళ్లేందుకు కొనసాగించొచ్చు. ఒకవేళ కొనసాగిస్తే... 15వ రోజున అక్కడి నుంచి సరళమైన మార్గంలోనే 14 కిలోమీటర్లు ప్రయాణించి గౌరీకుండ్ వెళ్లాలి.

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

గంగోత్రిలో మొదలై కేదారనాథ్ వరకు..

P.C: You Tube
16వ రోజున రిషికేశ్ చేరుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అక్కడితో ట్రెక్కింగ్ ముగుస్తుంది. మళ్లీ ఒక రోజు విశ్రాంతి తీసుకుని దిల్లీకి ప్రయాణం కట్టాలి. దాంతో ఆడెన్స్ కల్ యాత్ర ముగిసినట్లవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X