Search
  • Follow NativePlanet
Share
» »మీ స్వతంత్రాన్ని కోల్పోవడానికి ఇవే ఉత్తమమైన ప్రాంతాలు

మీ స్వతంత్రాన్ని కోల్పోవడానికి ఇవే ఉత్తమమైన ప్రాంతాలు

బాచిలర్స్ పార్టీల కోసం యువత ఇటీవల సుదూర పర్యాటక ప్రాంతలకు వెళ్లడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం ప్రత్యేక కథనం.

By Beldaru Sajjendrakishore

వివాహమన్నది మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అన్న విషయాన్ని ఎవరూ కాదనలేని సత్యం. పెళ్లి తర్వాత మన జీవితంలో అనేక బాధ్యతలు, బరువులు పెరుగుతాయి. వాటిని ఖచ్చితంగా మనం ఆహ్వనించాల్సిందే. ఇందు కోసం అప్పటి వరకూ మనం అనుభవించిన కొంత స్వతంత్రాన్ని వదులుకోక తప్పదు. అంటే లేట్ నైట్ పార్టీలు. తరుచూ వీకెండ్ టూర్లు తదితరాలు అన్న మాట. ఆ స్వతంత్రాన్ని కోల్పోతేనే వివాహ బందం మరింత గట్టిపడి జీవితం సాఫీగా సాగిపోతుంది. యువత కూడా ఆ స్వేచ్చను కోల్పోవడానికి సిద్ధపడుతున్నారు. దీన్ని ఓ పండుగలా జరుపుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. అంటే పెళ్లికి ముందు సదరు స్వతంత్రాన్ని కోల్పోయే విషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికే బ్యాచిలర్స్ పార్టీ అని పేరు. ఇందుకు సుదూర ప్రాంతాలకు తమ స్నేహితులను కూడా తీసుకువెళుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో సదరు బ్యాచిలర్స్ పార్టీ జరుపుకోవడానికి ఎన్నో ఉత్తమమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. గోవా

1. గోవా

P C

గోవాకు పార్టీ రారాజుగా పేరు. ఇక్కడ సముద్ర తీరం ఉండటమే కాకుండా పంపంచంలో అతి ఖరీదైన మద్యం మొదలుకుని స్థానికంగా అతి తక్కువ ధరకు దొరికే మద్యం, వైన్ ఇక్కడ లభిస్తుంది. యువతీ, యువకులకు దక్షిణ భారత దేశంలో పార్టీ చేసుకోవడానికి దీనికంటే మంచి టూరిస్ట్ ప్రాంతం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇక నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో గోవాకు వెళ్లడానికి ఉత్తమమైన సమయం. ఆ సమయంలో ఎక్కువ ఉక్కపోత ఉండదు. ఇక ఇక్కడ అలలతో సయ్యాటలు ఆడుతూ మన స్నేహితులతో గడపడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగుల్చుతుందనడంలో సందేహం లేదు.

2. ముంబై

2. ముంబై

Image source

భారత దేశంలో బ్యాచిలర్స్ ఎక్కువగా సందర్శించే నగరంలో ముంబైకు పేరుంది. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకూ పబ్స్ తెరిచే ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో లైవ్ బాండ్ మ్యూజిక్ కు ముంబై నగరం పెట్టింది పేరు. రాత్రి నిద్రపోని నగరంలో ముంబైకు పేరున్న విషయం తెలిసిందే. కొద్ది కొద్దిగా నిషా ఎక్కుతుంటే స్నేహితులతో హోరు మ్యూజిక్ కు అనుగుణంగా చిందులు వేస్తుంటే సమయమే తెలియదు. ఏడాది మొత్తంలో ఏ సమయంలోనైనా ముంబైను మనం పర్యాటకం కోసం ఎంచుకోవచ్చు.

3. లేహ్...లడక్

3. లేహ్...లడక్

Image source

బ్యాచిలర్ పార్టీలంటే కేవలం మందు, మ్యూజిక్, డ్యాన్సులే కాదు. ప్రకృతిని ఆస్వాధిస్తూ సమయాన్ని మరిచిపోయి స్నేహితులతో ఊసులు చెప్పుకోవడం కూడా. ఇలాంటి పార్టీలను ఇష్టపడే వారి కోసం లేహ్ లడక్ ఉత్తమమైన ప్రాంతం. త్రి ఇడియట్ సినిమా తర్వాత ఈ ప్రాంతం బ్యాచిలర్స్ కు మంచి పర్యాటక ప్రాంతంగా మారింది. చాలా మంది తమ బైక్ లో ఈ ప్రాంతానికి వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ ద్వారా ప్రక`తి అందాలను తనివి తీరా చూస్తూ గడుపుతుంటారు. అన్నట్టు ఇక్కడ మందు కూడా లభిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ ప్రాంతం చూడటానికి చాలా బాగుంటుంది.

4. కసోల్

4. కసోల్

Image source

నదీ జలాల అందాలను చూస్తూ స్నేహితులతో పార్టీ చేయాలనుకునే వారికి ఢిల్లీకి దగ్గరగా ఉన్న కసోల్ ఉత్తమమైనది. ఇక్కడ ప్రకృతి ముఖ్యంగా పర్వత శ్రేణి అందాలను చూస్తూ కాలాన్ని మరిచిపోవచ్చు. అక్టోబర్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని విజిట్ చేయవచ్చు. ట్రెక్కింగ్ కు కూడా కసోల్ మంచి పర్యాటక ప్రాంతం.

5. జైసల్మీర్

5. జైసల్మీర్

Image source

విభిన్న ప్రాంతాల్లో పార్టీ చేసుకోవాలనుకునే వారికి జైసల్మీర్ ఉత్తమమైన ప్రాంతం. ఇసుక తిన్నెల్లో ఏసీ టెంట్లలో పార్టీ చేసుకోవడం ఒక వినూత్న అనుభూతి. కొంత ఎక్కువ ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి రాజస్థాన్ సంప్రదాయా నృత్యాలు కూడా ఎనలేని సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో పర్యటించానికి నవంబర్ నుంచి మార్ఛ్ మధ్య కాలం సరైనది.

6. జీరో వ్యాలీ

6. జీరో వ్యాలీ

Image source

లోయల్లో పర్యటిస్తూ బ్యాచిలర్ పార్టీని జరుపుకోవాలనుకునే వారికి అరుణాచల్ ప్రదేశ్ లోని జీరీ వ్యాలీ ఉత్తమమైన ప్రాంతం. ఇక్కడకు ఎక్కువగా మ్యూజిక్ ను ఇష్టపాడు వస్తుంటారు. ప్రకృతి సోయగాల నడుమ ప్రాణమిత్రులు పక్కన ఉండటం, ఆ సమయంలో పార్టీ చేసుకోవడం ఎవరికైనా మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ లో జీరో వ్యాలీ లో మ్యూజిక్ ఫెస్ట్ జరుగుతుంది. ఆ సమయంలోనే ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.

7.రుషికేష్

7.రుషికేష్

Image source

బ్రాచిలర్ పార్టీతో పాటు థ్రిల్లింగ్ ఉండాలను కునే వారికి రుషికేష్ ను మించిన పర్యాటక ప్రాంతం మరొకటి లేదు. ఈ ప్రాంతం రివర్ రాఫ్టింగ్ కు పెట్టింది పేరు. ఎగిసి పడే అలలతో పోటీ పడుతూ స్నేహితులతో రబ్బరు బోట్లలో కేరింతలు కొడుతూ దూసుకువెళ్లడం ఎరికైనా మరపురాని విషయమే. మార్చ్, ఏప్రిల్ నెలలతో పాటు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది.

8. పుదుచ్చేరి

8. పుదుచ్చేరి

Image source

చలికాలం అంటే నవంబర్ నుంచి మొదలుకొని జనవరి వరకూ పుదుచ్చేరిని సందర్శించడానికి ఎక్కవు అనుకూలమైన ప్రాంతం. మద్యం, మ్యూజిక్ లేకుండా బ్యాచిలర్ లైఫ్ కు ఇక్కడ వీడ్కోలు పలకవచ్చు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత అందాలను చూస్తూ స్నేహితులతో ఊసులు చెప్పుకోవడం ఎంత మరుపురాని విషయం మీరే చెప్పండి. లేదు మాకు మద్యం కావాల్సిందే అంటారా. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉంటాయి.

9.బెంగళూరు

9.బెంగళూరు

Image source

బెంగళూరుకు ఎంగ్ సిటీగా పేరు. ఇక్కడ బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి అనేక రెస్టోరెంట్లు ఆహ్వానం పలుకుతుంటాయి. ఇందులో స్ట్రీట్ ఫుడ్ నుంచి మొదలుకుని ప్రంపచ అగ్రస్థాయి ఛెఫ్ లు తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలు ఎన్నో లభిస్తాయి. ఇక వివిధ దేశాల్లో తయారయ్యే మద్యం ఇక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి అనేక మంది ఇక్కడకు వస్తూ ఉంటారు. సంవత్సరంలో ఎప్పుడైనా ఇక్కడ బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

10. అండమాన్

10. అండమాన్

Image source

విభిన్న ప్రాంతలకు వెళ్లి బ్యాచిలర్ టైంకు వీడ్కోలు పలకాలనుకునే వారికి అండమాన్ ఆహ్వానం పలుకుతోంది. సముద్రగర్భ అందాల నడుమ స్నేహితులకు పార్టీ ఇవ్వడం మీకే కాదు వారికి కూడా జీవితంలో మరుపురాని అనుభూతిని మిగులుస్తుందడంలో ఎటువంటి సందేహం లేదు. నవంబర్ నుంచి మే మధ్య కాలంలో అండమాన్ కు వెళ్లడానికి సరైన సమయం. సముద్ర గర్భంలో మీతో పాటు మీ ఫ్రెండ్స్ ను సరక్షితంగా తీసుకువెళ్లడానికి స్థానికంగా ఎన్నో ప్రైవేటు సంస్థలు అవసరమైన నిపుణులను సమకూర్చుతాయి. అంతేకాకుండా పార్టీకి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తాయి.

Read more about: tour travel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X