• Follow NativePlanet
Share
» »పుణ్యాత్ముల పై మాత్రమే నీళ్లు చిలకరించే జలపాతం...‘లక్ష్మీ’నారాయణుడు రేగు చెట్టు రూపంలో ఉన్న క్షేత్ర

పుణ్యాత్ముల పై మాత్రమే నీళ్లు చిలకరించే జలపాతం...‘లక్ష్మీ’నారాయణుడు రేగు చెట్టు రూపంలో ఉన్న క్షేత్ర

Written By: Kishore

శివుడి కాలిబొటన వేలును పూజించే ఏకైక దేవాలయం సందర్శిస్తే సర్వ పాపాలు...

యుగాంతాన్ని ఈ క్షేత్రంలో చీమలు, ఈగలు ముందుగా చెబుతాయి

బద్రీనాథ్...హిందువులు ఎంతో పవిత్రంగా జరుపే చార్ ధామ్ యాత్రలో మొదటిగా దర్శించే క్షేత్రం ఇదే. బద్రీనాథ్ ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ఉంది. ఇక్కడ ఉన్నటు వంటి తీర్థాల్లో సమస్త దేవతలూ ఉన్నట్లు పురాణాలు చెబుతాయి. అందువల్లే హిందువులకు బద్రీనాథ్ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ముందు వరుసలో ఉంటుంది. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రంలో విష్ణువు రేగుచెట్టు రూపంలో ఉన్నట్లు చెబుతారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటు వంటి ఒక జలపాతం నుంచి అందరి పై నీళ్లు పడవని కేవలం పుణ్యాత్ముల పై మాత్రమే నీరు పడుతుందని చెబుతారు. అంతే కాకుండా చాలా మంది దీనిని ప్రత్యక్షంగా చూశారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

1. దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి

1. దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి

Image Source:

భారత హిందూ పురాణాల ప్రకారం భారత దేశంలో 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో బ్రదీనాథ్ కూడా ఒకటి. ఈ మసస్త స`ష్టిలోని జీవులకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలన్న విషయం విష్ణువే చూస్తుంటాడు.

2. విసుగు చెంది

2. విసుగు చెంది

Image Source:

అందువల్లే ఆయనను స్థితి కారుడు అని అంటారని చెబుతారు. అలా పనిచేసే సమయంలో నారాయణుడికి లక్ష్మీ దేవి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో ఈ పని పై విసుగు చెందుతుంది.

3. అలకనందా నదీ తీరంలో

3. అలకనందా నదీ తీరంలో

Image Source:

దీంతోలక్ష్మీ దేవి నారాయణుడితో సహా అలకనందా నదీ తీరంలో రేగు చెట్టు రూపంలో నిలిచిపోయిందని స్కంధపురాణం వివరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంకు వస్తాడు.

4. ఒక సాలిగ్రమం లభిస్తుంది

4. ఒక సాలిగ్రమం లభిస్తుంది

Image Source:

తపో దీక్షలో ఉన్న ఆయనకు ఒక సాలిగ్రమం లభిస్తుంది. దీనిని స్థానికంగా ఉన్న తప్తకుండ్ వేడినీటి చలమలో శుద్ధి చేసి అక్కడే ప్రతిష్టించారు.ఆ సాలిగ్రమాన్ని ప్రతిష్టించిన ప్రాంతంలోనే 16వ శతాబ్దంలో గర్హ్వాలా రాజు బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రతిష్టించారని చరిత్ర తెలియజేస్తుంది.

5. మరో కథనం ప్రకారం

5. మరో కథనం ప్రకారం

Image Source:

మరో కథనం సంస్క`తంలో బద్రి ఫలము అంటే రేగు పండు. ఈ ప్రాంతంలో విపరీతంగా రేగుపళ్లు పండటం వల్ల ఇక్కడ ఉన్న లక్ష్మీ నారాయణుడికి బద్రీనాథుడని పేరు వచ్చిందదనే కథనం కూడా ఉంది.

6. ఉత్తరాఖండ్ లో

6. ఉత్తరాఖండ్ లో

Image Source:

ఈ బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఇది ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఉంది. గర్హ్వాల్ కొండ పై అలకనందా నదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో నర నారాయణ కొండల మధ్య ఉన్న నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది.

7. 50 అడుగుల ఎత్తు

7. 50 అడుగుల ఎత్తు

Image Source:

బద్రీనాథ్ దేవాలయం ఎత్తు 50 అడుగులు. ముఖ ద్వారం భారతీయ అద్భుత శిల్ప కళకు నిదర్శనం. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయడం వల్ల ఎంతో మనోహరంగా కనిపిస్తూ ఉంటుంది.

8. భారత పురాణాల్లో

8. భారత పురాణాల్లో

Image Source:

ఈ బద్రీనాథ్ క్షేత్రానికి భారత పురాణాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రీ క`ష్ణుడు నారాయణుడిగా, అర్జునుడు నరుడిగా ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం ఇదే అని చెబుతారు.

9. 12 పాయలుగా

9. 12 పాయలుగా

Image Source:

ఇక గంగానది భూలోక వాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే సమయంలో తన శక్తి వంతమైన ప్రవాహాన్ని భూమి భరించడం కష్టమని భావించి 12 పాయలుగా చీలి పోయింది. అందులో అలకనాదా నది ఒకటి. ఆ అలక నందా నది ఇక్కడ ఉంది.

10. అప్పటి గుహలు ఇప్పటికీ

10. అప్పటి గుహలు ఇప్పటికీ

Image Source:

కురుక్షేత్రం తర్వాత పాండవులు తమ జీవితాన్ని చాలించాలని స్వర్గారోహణ చేసే సమయంలో ఇక్కడికి వచ్చినట్లు వ్యాస భారతంతో చెప్పబడింది. అందులో వర్ణించిన గుహలను మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు.

11. ఇలాంటి క్షేత్రం

11. ఇలాంటి క్షేత్రం

Image Source:

ఇక స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ‘స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు' అని వర్ణించబడింది.

12. కుమారస్వామికి

12. కుమారస్వామికి

Image Source:

అదే విధంగా పరమశివుడు ఈ క్షేత్రం గురించి తన కుమారుడైన కుమారస్వామికి స్వయంగా వివరించారు. ‘బద్రినాథ్ క్షేత్రంతో సమానమైన పుణ్యక్షేత్రం ముల్లోకాల్లో ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్న తీర్థాల్లో ముక్కోటి దేవతలు నివశిస్తున్నారు.'అన్నది దాని సారాంశం.

13. వసుదార

13. వసుదార

Image Source:

ప్రధాన దేవాలయానికి 1 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మకపాలం అనే ప్రాంతం ఉంది. ఇక్కడకు 8 కిలోమీటర్ల దూరంలో వసుదార అనే చిన్న జలపాతం ఉంది. ఈ జలపాతం దగ్గరకు వెళితే అందరి పైనా నీళ్లు పడవు. కేవలం పుణ్యాత్ముల పై మాత్రమే నీరు పడుతుందని చెబుతారు.

14. ప్రతి ఏడాది పెరుగుతోంది

14. ప్రతి ఏడాది పెరుగుతోంది

Image Source:

వారణాశిలో అరవై వేల ఏళ్లు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయ దర్శనం చేసుకున్నంత మాత్రానే కలుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ప్రతి ఏడాది ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంది.

15. బ్రదీనాథ్ మొదటిది

15. బ్రదీనాథ్ మొదటిది

Image Source:

హిందువుల ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటకమైన చార్ ధామ్ యాత్రలో బద్రీనాథ్ మొదటిది. ఇది కేదరీనాథ్ కు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ వాతావరణం మానవుల సంచారానికి అనువుగా ఉండదు. అందువల్లే ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేసవి కలంలో అనుమతిస్తారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి