Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు కరగ ఉత్సవ సంబరాలు !

బెంగళూరు కరగ ఉత్సవ సంబరాలు !

By Mohammad

'కరగ' బెంగళూరు లో ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఉత్సవం. దీనినే 'బెంగళూరు కరగ' అని కూడా పిలుస్తుంటారు. ఈ ఉత్సవం కర్నాటక రాష్ట్రానికి దక్షిణం వైపున నివసించే 'తిగల' జాతి వారిది. బెంగళూరు లో ఏటా జరిగే కరగ ఉత్సవంలో పాల్గొనే ముఖ్య వ్యక్తి స్త్రీ దుస్తులను ధరించి ఊరేగింపుగా వస్తాడు. ఈ ఉత్సవానికి ఇతనే సారధ్యం వహిస్తూ ముందుండి నడిపిస్తాడు.

ఇది కూడా చదవండి : బెంగళూరు నుండి తిరుపతి రోడ్ ట్రిప్ జర్ని !

కరగ ఉత్సవంలో పాల్గొనే కళాకారులు నెత్తి మీద దేవత ('శక్తి' మాత) ను మొయ్యాలి మరియు చేతులతో తాకకుండా చుట్టూ తిరగాలి. ఈ వేడుకలు బెంగళూరు పరిసరాల్లో సుమారు 9 రోజుల నుండి 11 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు పాత బెంగళూరు లోని ప్రఖ్యాత ధర్మరాయ ఆలయంలో జరుగుతాయి.

ఎప్పటి నుంచో ..!

ఎప్పటి నుంచో ..!

సుమారు 500 సంవత్సరాల నుంచి 'తిగల' తెగ ప్రతి ఏటా కరగ ఉత్సవాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నది. ఈ తెగ పుట్టుకకు సరైన ఆధారం లేదు అయినప్పటికీ వీరకుమార్ ల వారసులని, అగ్ని వారసులని నమ్ముతుంటారు.

చిత్ర కృప : Thigala4u

పురాణాల కథనం

పురాణాల కథనం

పురాణాల కథనం ప్రకారం, ద్రౌపది ఇక్కడ ఆదర్శ మహిళ గా అవతరించిందని అంటారు. తిగల తెగ ఆమెను 'ఆదిశక్తి' దేవతగా పూజిస్తారు. అందుకే కరగ ఉత్సవాన్ని ద్రౌపది గౌరవార్థం నిర్వహిస్తుంటారని చెబుతారు.

చిత్ర కృప : LONDON TEMPLES

పురాణాల కథనం

పురాణాల కథనం

మహాభారతం చివరి పేజీల్లో, కరగ ఉత్సవం గురించి చెప్పబడింది. అదేమిటంటే మహాభారత సమయంలో డీమన్ అనబడే త్రిపురసుర ఉండేవాడట. అతన్ని వధించాలని ద్రౌపది మరియు అతని భర్తలు అనుకుంటారట. ద్రౌపది శక్తి రూపాన్ని ధరించి వీర కుమారులను(తిగల తెగ) సైన్యంగా చేసుకొని అతన్ని వధిస్తుంది.

చిత్ర కృప : bangalore karaga

పురాణాల కథనం

పురాణాల కథనం

యుద్ధానంతరం వీర కుమారులు ద్రౌపదిని ఇక్కడే ఉండి పొమ్మని కోరతారు. ద్రౌపది ఒప్పుకోదు కానీ ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసంలో చంద్రుడు పూర్తిగా కనబడే మొదటి రోజున వస్తానని నచ్చచెబ్బుతుంది.

చిత్ర కృప : Thigala shri

ఎలా జరుగుతుంది ?

ఎలా జరుగుతుంది ?

కరగ ఉత్సవం జరిగేటప్పుడు తిగల తెగ వారు ద్రౌపది వేష ధారణలో వస్తారు. నెత్తిమీద శక్తి ప్రతిరూపాన్ని పెట్టుకొని డప్పువాయిద్యాల మధ్య ఊరేగుతూ ... నాట్యాలు చేస్తూ పాత బెంగళూరులోని ధర్మారాయ ఆలయానికి వస్తారు.

చిత్ర కృప : Bengaluru Karaga

ఎలా జరుగుతుంది ?

ఎలా జరుగుతుంది ?

కరగ ఉత్సవం లో మొదటి ఘట్టం ద్వజారోహణ. పసుపు జెండా ను బొంగు కు తగిలించి ఆలయ ప్రాంగణంలో వీరకుమారులు ప్రతిష్టిస్తారు. ఎడమ భుజానికి దారాన్ని కట్టుకొని సేవలు చేస్తారు.

చిత్ర కృప : Bengaluru Karaga

ఎలా జరుగుతుంది ?

ఎలా జరుగుతుంది ?

రెండవ రోజు నుండి ఆరవ రోజు వరకు సాయంత్రం పూట కబ్బన్ పార్క్ శక్తిపీఠ లో దేవతకు పూజారులు భక్తి శ్రద్ధ ల మధ్య పూజలు చేస్తారు. ఆరవ రోజు మహిళలు ద్రౌపది దేవి కి నిష్టతో పూజలు చేసి హారతి ఆర్పిస్తారు.

చిత్ర కృప : Bengaluru Karaga

ఎలా జరుగుతుంది ?

ఎలా జరుగుతుంది ?

ఏడవ రోజు తిగల తెగలో ఒకరు స్త్రీ వస్త్రధారణలో పెళ్ళికూతురు వలె ముస్తాబై, నెత్తి మీద కుండ ను పెట్టుకొని వీర కుమారులను వెంటబెట్టుకొని ధర్మరాయ స్వామి ఆలయానికి బయలుదేరుతారు.

చిత్ర కృప : Bengaluru Karaga

ఎలా జరుగుతుంది ?

ఎలా జరుగుతుంది ?

ఎనిమిదవ రోజు పొంగల్ సేవ, పౌర్ణమి రోజు (9 వ రోజు కావచ్చు) ఉత్సవ మూర్తికి మరియు దేవత కు ఊరేగింపు సమయంలో కల్యానోత్సవం నిర్వహిస్తారు.

చిత్ర కృప : bangalore karaga

ఎలా జరుగుతుంది ?

ఎలా జరుగుతుంది ?

పదవ రోజున పాండవుల బావ మరియు రక్షకుడైన పోత రాజ కు శాంతి పూజ నిర్వహిస్తారు. దాంతో ఉత్సవం ముగుస్తుంది.

చిత్ర కృప : ananth shayan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X