Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ఏకైక ప్యాలెస్ భారతదేశంలోనే

ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయని ఏకైక ప్యాలెస్ భారతదేశంలోనే

బారా ఇమాంబారా ప్యాలెస్ కు సంబంధించిన కథనం.

రాజభవనాలు భారతీయ వాస్తుకు ప్రతిబింబాలు. జీవితంలో ఒక్కసారైనా అలనాటి రాజవైభవానికి ప్రతీకలైన ఆ భవనాలను చూడాలని మనకు అనిపించడం సహజం. విశాలమైన కారిడార్లు, సింహాసనాలు, శిల్పాలతో కూడిన స్తంభాలు, గోపురాలతో కూడిన ఆ రాజభవనాలను చూడటం ఎవరికైనా మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

ఇక కొన్ని రాజభవనాలు అత్యంత విశాలమైనవే కాకుండా అనేక వింతలు విశేషాలను కలిగి ఉంది. అటువంటిదే గురుత్వాకర్షణ శక్తికి లోనుకానటువంటి ఒకే ఒక రాజభవనం మన దేశంలో ఉంది. ఇటువంటి రాజభవనం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ నేపథ్యంలో ఆ రాజభవనం గురించిన సమస్త సమాచారం మీ కోసం...

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

గురుత్వాకర్షణ శక్తికి లోనుకానటువంటి ప్యాలెస్ మనకు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉంది. ఆ ప్యాలెస్ ను బారా ఇమామ్ బారా అని పిలుస్తారు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఈ ప్యాలెస్ లక్నోలోని పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే కేంద్రాల్లో ఒకటి. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు లక్నోని సందర్శించే సమయంలో ఈ ప్యాలెస్ ను సందర్శించకుండా ఉండలేరు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఈ బారా ఇమాంబరా ప్యాలెస్ ను క్రీస్తు శకం 1784లో నాల్గవ నవాబ్, బారాక్ ఇమాంబారా అసాఫ్ ఉద్ దౌలారిద్ నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఈ ప్యాలెస్ ఈ రాజు సమాధితో పాటు అతను వినియోగించిన కిరీటాన్ని కూడా చూడవచ్చు. ఈ విశ్వంలోనే గురుత్వాకర్షణ శక్తికి లోను కాని అత్యంత విశాలమైన కట్టడంగా దీనికి పేరుంది.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఎటువంటి లోహాన్ని ఈ భవనం నిర్మాణంలో వినియోగించకపోవడం గమనార్హం. ఈ బారా ఇమాంబారా ప్యాలెస్ లో రుమి దర్వాజ, శాహి బవాలి, తలేవాలి, క్లాక్ టవర్, చోటా ఇమాంబారా తదితర చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఈ బారా ఇమాంబారా ప్యాలెస్ వాస్తు శైలి మనోహరంగా ఉండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ ప్యాలెస్ అరబిక్, యురోపియన్ వాస్తుశైలి కలబోతగా ఈ ప్యాలెస్ ను నిర్మించారు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

సామాన్యంగా బారా అన్న పదానికి పెద్దదని అర్థం. అదేవిధంగా ఇమాంబరా అన్న పదాన్ని పవిత్ర స్థలాన్ని సూచిస్తాయి. ఈ ప్యాలెస్ 50 మీటర్ల పొడవు, 15 మీటర్ల పొడవు ఉంటుంది.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

విశాలమైన ఈ ప్యాలెస్ లో అత్యంత విలువైన, అరుదైన పెయింటిగ్స్ ను చూడవచ్చు. గురుత్వాకర్షణకు లోనుకానటువంటి ఈ ప్యాలెస్ ను నిర్మించడానికి 20 వేల మంది శ్రామికులు ప్రతి రోజూ శ్రమించేవారని చెబుతారు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

అందువల్లే ఇంతఅందమైన ప్యాలెస్ ను నిర్మించడానికి వీలయింది. ఈ విశిష్ట ప్యాలెస్ ను అప్పట్లో ప్రముఖ ఆర్కిటెక్షర్స్ కిఫాయతుల్లా, షహజహానాబాడి నిర్మించారు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఈ ప్యాలెస్ లోని స్తంభాలు ఎటువంటి ఆధారం లేకుండానే నిలబడం వల్ల ఈ భవనానికి గురుత్వాకర్షణకు లోనుకానటువంటి భవనమని పేరు వచ్చింది.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఈ భవనం మొత్తంలో దాదాపు రెండువేల మెట్లను చూడవచ్చు. అంతేకాకుండా ఈ భవనం ప్రాంగణంలో ఉన్న ఉద్యానవనాలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఈ ప్యాలెస్ లో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. ఢిల్లీ, అలహాబాద్, ఫైజాబాద్ తదితర చోట్ల ఉన్న కొన్ని ప్యాలెస్ లకు కూడా స్వరంగా మార్గాలు ఉండటం గమనార్హం.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

అయితే సొరంగమార్గాలను ప్రస్తుతం మూసివేశారు. బారా ఇమాంబారా ప్యాలెస్ ను ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయితే చాలా మంది అక్టోబర్ నుంచి మార్చ్ మధ్య ఈ ప్యాలెస్ ను సందర్శించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ఆ సమయంలో ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటమే కారణం. ఈ బారా ఇమాంబారా ప్యాలెస్ లోనికి ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎప్పుడైనా వెళ్లవచ్చు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

ప్రవేశరుసుం భారతీయులకు రూ.25 కాగా, విదేశీయులకు రూ.300. ప్రపంచంలోనే అత్యంత ఎతైన కమాన్ కలిగిన ఈ బారా ఇమాంబారా ప్రముఖ పర్యాటక స్థలమని చెప్పడం అతిశయోక్తికాదు.

బారా ఇమాంబారా

బారా ఇమాంబారా

P.C: You Tube

బారా ఇమాంబారా ప్యాలెస్ కు దగ్గరగా లక్నో విమానాశ్రయం ఉంది. ఈ రెండింటి మధ్య దూరం ఒక గంట. ఇక ఈ బారా ఇమాంబారా ప్యాలెస్ కు దగ్గరగా రైల్వేస్టేషన్ కూడా ఉంది. ఈ రెండింటి మధ్య దూరం కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X