» »ఆంధ్ర ప్రదేశ్ - అందమైన కడలి తీరాలు !

ఆంధ్ర ప్రదేశ్ - అందమైన కడలి తీరాలు !

Written By:

సముద్రతీరాలు ... ఈ మాట చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేవి బీచ్లు. ఏ సీజన్ అయినా సరే పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. సెలవువు వస్తే ఏ గోవా కో, అండమాన్ కో, కేరళ కో వెళుతుంటారు. అలా కాకుండా ఈసారి మన రాష్ట్రంలోనే సాగర తీరాలను సందర్శించండి.

సహజ ఆనందాలను అందించే సముద్ర తీరాలు !

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ టూరిజం శాఖను బలోపేతం చేసేందుకు ఇప్పటికే టూరిజం మిషన్ , టూరిజం పాలసీలను రూపొందించి పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 974 కి. మీ ల పొడవైన సముద్ర తీరం కలిగిన ఉన్న ఎపిలో కేరళను మించిన సుందర ప్రదేశాలు పుష్కలంగా ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించే మొదటి ఐదు రాష్ట్రాలలో ఏపీ ఒకటి.

ఇండియా లో ప్రసిద్ధి చెందిన బీచ్ రోడ్లు !

ఆంధ్ర ప్రదేశ్ బీచ్ లకు ఎప్పుడెప్పుడు వెల్దామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్నది. దీనికి కారణం బీచ్ లవ్ ఫెస్టివల్. వచ్చే ఏడాదిలో వాలెంటెన్స్ డే రోజున దేశ, విదేశాల నుంచి 9 వేల జంటలను రప్పించి, వారికోసం టెంట్లు వేసి బాలీవూడ్, హాలివూడ్ తార నృత్యాలు, అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో పాప్ సింగర్ షకీరా తన అందాలతో కనువిందు చేయబోతుంది. మూడు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనకు వేదికగా వైజాగ్ సాగర తీరం ముస్తాబవుతున్నది.

కర్నాటక కోస్తా తీరంలో ఆహ్లాదకర బీచ్ లు !

బీచ్ ఫెస్టివల్ గనక సక్సెస్ అయితే ఇటువంటి ప్రదర్శనలు ఇంకా చేపట్టవచ్చని సమాచారం. అప్పుడు వేదిక విశాఖ కాకుండా మరొకటి ఉండవచ్చు. మరి అలాంటప్పుడు మన రాష్ట్రంలో వైజాగ్ కాకుండా ఏ బీచ్ లను సెలెక్ట్ చేసుకుంటారు. మరి అక్కడ వసతులు ఎలా ఉంటాయి ? వాటి ప్రత్యేకతలు ఏంటి ? అనేవే ప్రస్తుత వ్యాసం !!

ముందుగా శ్రీకాకుళం జిల్లా నుండి వద్దాం !!

కళింగ

కళింగ

కళింగపట్నం శ్రీకాకుళానికి 25 కి. మీ. దూరంలో ఉన్నది. వంశధార నది ఇక్కడే బంగాళా ఖాతము లో కలుస్తుంది. సువిశాలమయిన బీచ్ తోటలు, బౌద్ద కట్టడాలు, దీప స్తంభం లతో అందంగా కనిపిస్తుంటుంది. పిల్లలతో, పెద్దలతో కళింగపట్నం మంచి పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది.

వసతులు : కళింగపట్నం బీచ్ రిసార్ట్, ఏపీ హరిత రిసార్ట్ లు కలవు.

చిత్రకృప : Adityamadhav83

బారువా

బారువా

శ్రీకాకుశం జిల్లాలో సువిశాలమైన ఇసుకతిన్నెలు కలిగిన బారువ తీరం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. బారువా, శ్రీకాకుళం మధ్య దూరం 106 కి.మీ. కనుచూపుమేర ఇసుక తిన్నెలు, కొబ్బరితోటలు బీచ్ కు అందాన్ని ఇస్తుంటాయి. సముద్ర స్నానానికి ఇది అనువైన ప్రాంతం.

వసతి : హరిత బీచ్ రిసార్ట్ కలదు.

చిత్రకృప : Rajib Ghosh

కవిటి

కవిటి

కవిటి శ్రీకాకుళం కు 129 కి. మీ ల దూరంలో, సముద్ర మట్టం నుండి 41 మీటర్ల ఎత్తున ఉన్నది. తీరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం కొబ్బరితోటలు, జీడిమామిడి తోటలు, పనస తోటలతో కనులకింపుగా ఉంటుంది.

వసతి : ఇచ్ఛాపురం వసతికి సూచించదగినది.

చిత్రకృప : Priyadarshi Ranjan

రిషికొండ

రిషికొండ

వైజాగ్ బీచ్ ల నగరం అని చెప్పవచ్చు. ఈ విశాఖ తీరానే 'బీచ్ లవ్ ఫెస్టివల్' ను నిర్వహిస్తున్నారు.

రిషికొండ బీచ్


ఈ బీచ్ వైజాగ్ కు 8 కి.మీ ల దూరంలో ఉన్నది. బంగారు రంగు ఇసుక, కెరటాలు, ఆటుపోట్లు పెద్దవిగా ఉండటంతో పర్యాటకులు ఇష్టంగా వస్తుంటారు. వాటర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ కు అనువైనది ఈ బీచ్.

వసతి : బీచ్ సమీపంలో రిసార్టులు, హోటళ్ళు కలవు.

చిత్రకృప : Amit Chattopadhyay

భీమిలి

భీమిలి

భీమిలి బీచ్ విశాఖ కు 47 కి. మీ ల దూరంలో కలదు. భీమిలి బీచ్ పర్యాటకులకు ప్రశాంతత, నిర్మలమైన మరియు విశ్రాంతినిచ్చే వాతావరణం కలిగి ఉంటుంది. బీచ్ లో ప్రశాంతత మరియు ఈత కోసం సురక్షితం. అనేక దేవదారు చెట్లు మరియు బీచ్ సమీపంలో చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.

వసతి : భీమునిపట్నం వసతికి సూచించదగినది.

చిత్రకృప : Raj

గంగవరం

గంగవరం

వైజాగ్ నుండి దూరం : 10 కి. మీ.

ఈ బీచ్ ప్రాంతంలో అతిపెద్ద తాటి చెట్లు వరసగా ఉండి బీచ్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.ఈ అందమైన సముద్ర తీరం మీద సినిమా నిర్మాతల దృష్టి పడి ఇక్కడ సినిమా షూటింగ్ లు చేస్తున్నారు.ఆహ్లాదకరము మరియు నిర్మలమైన వాతావరణం ఉండుట వల్ల బాగా ప్రాచుర్యం పొందింది.

వసతి : వైజాగ్ సూచించదగినది.

చిత్రకృప : Nathaniel ayer

రామకృష్ణ బీచ్

రామకృష్ణ బీచ్

రామకృష్ణ బీచ్ తూర్పు తీరంలో ఉంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం కాషాయరంగులో ఉండి మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్, బోట్ రైడ్, సముద్ర స్నానాలు చేయటానికి అనుమతి ఉంది.

వసతి : వైజాగ్ హోటళ్ళు, రిసార్ట్ లు సూచించదగినవి.

చిత్రకృప : Adityamadhav83

యారాడ

యారాడ

యారాడ బీచ్ వైజాగ్ నగరానికి చాలా దగ్గరగా ఉండుట వలన పర్యాటకులను, స్థానికులకు బాగా ఆకర్షిస్తుంది.బీచ్ కి మూడు వైపులా పచ్చని కొండలు మరియు నాలుగో వైపున బంగాళాఖాతం ఉండి ఓక అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. ఈ సముద్ర తీరంలో ఒక అందమైన సూర్యాస్తమయం ను చూడవచ్చు.

వసతి : వైజాగ్ హోటళ్ళు, రిసార్ట్ లు సూచించదగినవి.

చిత్రకృప : Rajib Ghosh

తొట్లకొండ

తొట్లకొండ

వైజాగ్ నుండి దూరం : 15 కి. మీ.

తొట్లకొండ బౌద్ధ ఆరామాలు, చైతన్యాలకు ప్రసిద్ధి. రాళ్ళతో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఆకృతులు పర్యాటకులను కనువిందు చేస్తాయి. ప్రశాంతత కోరుకునేవారు వారాంతంలో ఇక్కడికి వస్తుంటారు.

వసతి : వైజాగ్ హోటళ్ళు, రిసార్ట్ లు సూచించదగినవి.

చిత్రకృప : Adityamadhav83

కాకినాడ

కాకినాడ

కాకినాడ లో బీచ్ కలదు. కాకినాడ సాగర తీరం వీక్షించే పర్యాటకులు కోరంగి అభయారణ్యం - మడ అడవుల అందాలు, హోప్ ఐలాండ్ ద్వీపాన్ని వీక్షించవచ్చు. హాప్ ఐలాండ్ చేరుకోవటానికి బోట్ సౌకర్యం కలదు.

వసతి : కాకినాడ నగరం వసతికై సూచించదగినది.
ఆహారపు అలవాట్లు : ఆంధ్రా భోజనంతోపాటు పూతరేకులు, కాజా తప్పక రుచి చూడండి.

చిత్రకృప : Adityamadhav83

అమలాపురం

అమలాపురం

అమలాపురం పూర్వ నామం అమృతపురి. కోనసీమ లో ఇది ముఖ్యమైనది. అమలాపురం బీచ్ ను ఓడలరేవు బీచ్ అని కూడా పిలుస్తారు. దీనికి సమీపరైల్వే స్టేషన్ కోటిపల్లి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రంలో నీటి క్రీడలు ఆడవచ్చు.

వసతి : దగ్గరలోని అమలాపురం వసతికి సౌకర్యవంతంగా ఉంటుంది.

చిత్రకృప : Rajib Ghosh

ఉప్పాడ

ఉప్పాడ

ఉప్పాడ బీచ్ ఒక అందమైన సముద్ర తీరం. ఇది చేపల వేటకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ రొయ్యలవేట ప్రధానంగా సాగుతుంది. పర్యాటకులు రొయ్యల వేపుడు, పులుసు, కూర రుచి చూడవచ్చు. ఇది కాకినాడ కు 5 కి. మీ ల దూరంలో కలదు. హరిత రిసార్ట్ లో బస చేయవచ్చు.

చిత్రకృప : Hari.med19

పేరుపాలెం

పేరుపాలెం

పేరుపాలెం బీచ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందినది. ఇక్కడ మనోహరమైన, విశాలమైన సాగర తీరం కలదు. మొగల్తూరు కు చేరువలో ఉన్నది ఈ బీచ్. వేలాంగణి మాత దేవాలయం, శ్రీ వెంకటేశ్వర దేవాలయాలు ఇక్కడ చూడవచ్చు. భీమవరంలో బస ఉండవచ్చు.

చిత్రకృప : Maheedharg

మంగినపూడి

మంగినపూడి

ఈ బీచ్ మచిలీపట్టణం కేంద్రానికి 11 కి. మీ ల దూరం లో కలదు. బీచ్ లో ఇసుకకు బదులు నల్ల మన్ను ఉంటుంది. బీచ్ కు దగ్గరలో ఉన్న నృతకళాశాలలో కూచిపూడి నేర్పిస్తుంటారు. బీచ్ లోతు తక్కువగా ఉంటుంది కనుక స్నానాలు చేయవచ్చు.

వసతి : వసతి కి మచిలీపట్టణం సూచించదగినది.

చిత్రకృప : Adityamadhav83

సూర్యలంక

సూర్యలంక

సూర్యలంక బీచ్ బాపట్లకు 9 లి. మీ ల దూరంలో కలదు. అందుకనే దీనిని బాపట్ల బీచ్ అని కూడా పిలుస్తారు. ఈ బీచ్ పరిసరాల్లో బ్రిటీష్ కట్టడాలు, భావ నారాయణ స్వామి దేవాలయం చూడదగ్గవి. వీకెండ్ లలో బీచ్ ను 50 వేల వరకు పర్యాటకులు సందర్శిస్తారని అంచనా. బీచ్ వద్ద కాటేజీలు, రిసార్టులు, స్టాల్స్ ఉన్నాయి.

చిత్రకృప : RC SRIKANTH

చీరాల

చీరాల

చీరాలలో కూడా బీచ్ ఉన్నది. ఇక్కడ సముద్రం తెల్లగా కనపడుతుంది. అందుకే దీనిని చీరాల ను పూర్వం క్షీరపురి అని పిలిచేవారట. చీరాలకు, సూర్యలంక కు మధ్య దూరంలో 32 కి. మీ. ఇక్కడ రిసార్టులు, స్పా కేంద్రాలు ఉన్నాయి.

చిత్రకృప : Kakanisantosh

ఓడరేవు

ఓడరేవు

చీరాలకు 6 కి. మీ, గుంటూరు కు 35 కి. మీ ల దూరంలో ఉన్నది ఓడరేవు బీచ్. ఇక్కడ స్థానికులు, పర్యాటకులు వచ్చి వారాంతపు సెలవును ప్రశాంతంగా గడుపుతారు. బస చేయాలనుకునేవారు చీరాలలో బస చేయవచ్చు.

చిత్రకృప : Vivek rachuri

కొత్తపట్నం

కొత్తపట్నం

ఇక్కడికి ఒంగోలు నుండి బస్సు సౌకర్యం కలదు. వారాంతంలో జిల్లా ప్రజలు, చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ఆహ్లాదంగా గడిపి వెళ్తుంటారు. ఇది ఒంగోలుకు 18 కి. మీ ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : Rdkreddy430

మోటుపల్లి

మోటుపల్లి

మోటుపల్లి బీచ్ వారాంతపు విహారానికి సూచించదగినది. ఇక్కడ బౌద్ధ ఆరామాలు, విహారాలు, శ్రీరామచంద్రుని ఆలయం చూడవచ్చు.

చిత్రకృప : Ritesh DeathRider

మైపాడు

మైపాడు

మైపాడు బీచ్ నెల్లూరు కు 25 కిలోమీటర్ల దూరంలో, బంగాళాఖాతం తీరంలో ఉన్నది. బీచ్ ప్రాంతం అంతా హోటళ్లు, రిసార్టులతో నిండి ఉంటుంది. సూర్యాస్తమయం తిలకించేందుకు పర్యాటకులు వస్తుంటారు.

చిత్రకృప : ManojKRacherla

కోడూరు

కోడూరు

వారాంతం వచ్చిందంటే చాలు కోడూరు బీచ్ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. కోడూరు - మైపాడు మధ్య దూరం 28 కి.మీ. యువతీ, యువకులు బీచ్ వద్ద స్నానాలు చేసి ఉల్లసంగా గడుపుతారు.

చిత్రకృప : Palagiri

Please Wait while comments are loading...