Search
  • Follow NativePlanet
Share
» »ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొద‌వే లేదు

ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొద‌వే లేదు

ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొద‌వే లేదు

ఉజ్జయిని చుట్టుపక్కల చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించిన తర్వాత మళ్లీ మళ్లీ సందర్శించడానికి ఇష్టపడనివారు ఉండ‌రు. ప‌ర్యాట‌కం విషయానికి వస్తే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడంతోపాటు కొంత సాహసాన్ని కూడా ఆస్వాదించవచ్చు.

మహాకాల్ నగరంగా ఉజ్జయిని పిలుస్తారు. షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లోని అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటిగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ నగరం యొక్క అందాలు భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందాయి. అందుకే, నగరం చుట్టూ ఉన్న సంద‌ర్శించేందుకు ఉత్త‌మ‌మైన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

దేవాస్

దేవాస్

ఉజ్జ‌యిని నగరం చుట్టూ చూడదగ్గ అందమైన ప్రదేశం ఏదైనా ఉంటే, వాటిలో దేవాస్ కూడా ఒకటి. ప్రకృతి రమణీయతతో నిండిన ఈ నగరాన్ని సందర్శించేందుకు ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు వస్తుంటారు. దేవాస్‌లో, కవాడియా హిల్స్, మితా తలాబ్ దేవాస్, షిప్రా డ్యామ్, పుష్పగిరి తీర్థం మరియు శంకర్‌గఢ్ హిల్స్ వంటి అనేక ఇతర ప్రదేశాలను కుటుంబ‌స‌మేతంగా సందర్శించేందుకు అనువుగా ఉంటాయి. ఈ సుంద‌ర ప్ర‌దేశం ఉజ్జయిని నుండి సుమారు 36 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

రత్లాం..

రత్లాం..

మధ్యప్రదేశ్‌లోని అందమైన జిల్లా రత్లాం. ప్ర‌కృతి అందాలు మ‌ల‌చిన ఈ జిల్లాను ఒకప్పుడు మహారాజ్ రతన్ సింగ్ పరిపాలించాడని చెబుతారు. ఈ నగరంలో అందమైన సెలానా ప్యాలెస్ ఉంది మరియు ఈ ప్యాలెస్ మధ్యలో సుమారు రెండు వంద‌ల‌ సంవత్సరాల పురాతన‌ తోట ఉంది. రత్లాం జిల్లాలో, మీరు బాంధవ్‌ఘర్ నేషనల్ పార్క్, కాక్టస్ గార్డెన్, ధోలావాడ్ డ్యామ్ మరియు హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న ఖర్మౌర్ అభయారణ్యం కూడా సందర్శించవచ్చు. ఈ ప్ర‌దేశం ఉజ్జయిని నుండి సుమారు 103 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

జనపవ్ కుటీ

జనపవ్ కుటీ

ఎత్త‌యిన‌ పర్వతాలు మరియు పచ్చదనంతో నిండిన‌ జనపవ్ కుటీ ప్రదేశం పర్యాటకులతో నిత్యం క‌ళ‌క‌ళ‌లాడుతుంది. జనపవ్ కుటి పాశురం జన్మస్థలంగా నమ్ముతారు. ఈ కుటి (పర్వతం) అనేక అరుదైన ఔషధ మూలికలకు ప్రసిద్ధి చెందింది. జనపవ్ కుటి కొండలు చంబల్ నదీ ప‌రివాహ‌క ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందాయి. జనపవ్ కుటి అనేక ఉత్కంఠభరితమైన ప్ర‌దేశాల‌కు చిరునామాగా నిలుస్తుంది. ఇక్క‌డ ట్రెక్కింగ్‌కు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇది ఉజ్జయిని నుండి సుమారు 98 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

రాలమండల్ వన్యప్రాణుల అభయారణ్యం

రాలమండల్ వన్యప్రాణుల అభయారణ్యం

రాలమండల్ వన్యప్రాణుల అభయారణ్యం ఉజ్జయిని వాసులను మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్‌లోని ఇతర నగరాల నుండి వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది. సముద్ర మట్టానికి 700 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ అభయారణ్యం అనేక వలస పక్షుల విడిది కేంద్రంగా పేరుగాంచింది. పచ్చదనం మరియు చల్లని గాలి మధ్య తిరగాలనుకుంటే, ఖచ్చితంగా ఇక్కడికి వెళ్లాలి. ఈ అభయారణ్యం సందర్శనతో పాటు, జీప్ సఫారీలను కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్‌ కూడా చేయవచ్చు. అభయారణ్యం ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. రాల‌మండ్ ఉజ్జయిని నుండి సుమారు 69 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

Read more about: ujjain dewas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X