Search
  • Follow NativePlanet
Share
» »మన ఏపీలో కూడా హెలీ టూరిజం ప్రాంతం ఉంది

మన ఏపీలో కూడా హెలీ టూరిజం ప్రాంతం ఉంది

భారత దేశంలో హెలీ రైడ్స్ కు అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

సాధారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సులు, లేదా ట్యాక్సీలు, రైలులో వెలుతాం. తద్వారా చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ చూడవచ్చు. ఇక కాలినడకన కూడా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లవచ్చు. దీనికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. అదే ఒక ప్రాంతాన్ని ఆకాశం నుంచి చూస్తే ఆ ఆనందం, ఉత్సాహం వేరు. ఇందుకు హెలీక్యాప్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా హెలీక్యాప్టర్ లో తిరుగుతూ చూడటానికి అనువైన కొన్ని పర్యాటక ప్రాంతాల వివరాలు మీ కోసం

విశాఖపట్టణం

విశాఖపట్టణం

P.C: You Tube

భారతదేశంలోని అంతమైన సముద్ర తీర ప్రాంత నగరాల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణం కూడా ఒకటి. చల్లటి సముద్ర అలల తీరాలతో పాటు విశాఖ పట్టణం చుట్టు పక్కల చూడటానికి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దీంతో పర్యాటకంగా కూడా విశాఖ పట్టణానికి మంచిపేరు ఉంది. ముఖ్యంగా ఇక్కడ హెలీక్యాప్టర్ లో ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

అరకు వ్యాలీ వరకూ

అరకు వ్యాలీ వరకూ

P.C: You Tube

హెలీ టూర్ సర్వీసులను అందించే హెలీ టూర్స్ ఇండియా సంస్థ మిమ్ములను కైలాసగిరి, అరుకు వ్యాలీ వరకూ తీసుకువెలుతుంది. మీరు కొంత సొమ్మును అదనంగా చెల్లించడానికి సిద్దపడితే సింహాచలం, కంబాల కొండ, ఆర్ కే బీచ్, రుషికొండ, రామానాయుడు స్టుడియో మీదిగా కూడా ఎగరవచ్చు. ఒక్కొక్కరికి రూ.2,500 టికెట్టు. ప్రయాణ సమయం ఐదు నుంచి ఇరవై నిమిషాలు. బోర్డింగ్ పాయింట్ ఉడా పార్క్

ఉదయ్ పూర్

ఉదయ్ పూర్

P.C: You Tube

ఆరావళి పర్వత పంక్తుల్లో భాగమైన ఉదయ్ పూర్ అందమైన నగరం అన్న విషయంలో రెండో మాటకు తావులేదు. చుట్టు సరస్సులు మధ్యలో అలనాటి రాచరికానికిగుర్తుగా నిలిచిన భవంతులు, హోటల్స్ ఇవన్నీ కూడా పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక నింగి నుంచి ఈ అందాలను చూస్తే ఆ ఆనందమే వేరు.

అనేక ప్యాకేజీలు

అనేక ప్యాకేజీలు

P.C: You Tube

దీంతో హెలీ టూర్స్ ను అందించే మేవార్ హెలీక్యాప్టర్ సర్వీసెస్ పర్యటకుల కోసం అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో అరావళీ పర్వతాల టూర్, ఉదయ్ పూర్ లేక్ టూర్, ఉదయ్ పూర్ కోటల టూర్ తో పాటు ప్రీమియం రైడ్ కూడా అందుబాటులో ఉంది.

3 నుంచి 30 నిమిషాలు

3 నుంచి 30 నిమిషాలు

P.C: You Tube

వినూత్నంగా వివాహం చేసుకోవాలనుకునేవారికి కూడా హెలీ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరికి రూ.2వేలు. ప్రయాణ సమయం 3 నుంచి 30 నిమిషాలు. బోర్డింగ్ పాయింట్ హెలీప్యాడ్ బేస్, ఉదయ్ పూర్. ఉదయ్ పూర్ వెళ్లినప్పుడు ఈ హెలీ టూర్ విషయాన్ని మరిచిపోకండి.

సిక్కిం

సిక్కిం

P.C: You Tube

ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కింలో పర్యాటకం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తికాదు. చుట్టూ పచ్చని టీ తోటలతో కూడిన సిక్కిం పర్వత మయ అందాలను చూడటం ఎప్పటికీ మరిచిపోలేం.

అనేక ప్యాకేజీలు

అనేక ప్యాకేజీలు

P.C: You Tube
అయితే సిక్కింలో రోడ్డు మార్గాలు అంత సౌకర్యంగా ఉండవు. దీంతో హెలీ రైడ్ ఇక్కడ ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఎంచుకొన్ని టూర్ ప్యాకేజ్ ను అనుసరించి ప్రయాణించే సమయం, ప్రాంతాలు మారుతూ ఉంటాయి.

నిమిషానికి రూ.1, 200

నిమిషానికి రూ.1, 200

P.C: You Tube

గ్యాంగ్ టక్ ఎరియల్ వ్యూ, కాంచన్ జంగా మౌంటైన్ ఫ్లైట్ కార్ టర్డ్, సోమాంగ్ ఎరియల్ వ్యూ తదితరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒక్కారికి ఒక్కొక్క నిమిష ప్రయాణానికి రూ.1,200 వసూలు చేస్తారు. ప్రయాణ సమయం కనీసం 15 నిమిషాలు. బోర్డింగ్ పాయింట్ గ్యాంగ్ టక్ హెలీ ప్యాడ్

గోవా

గోవా

P.C: You Tube

గోవా అన్నత తక్షణం మనకు సముద్ర తీర ప్రాంతాలు, ఇసుక తిన్నెలు, ఇవన్నీ గుర్తుకు వస్తాయి. అయితే ఇక్కడ బీచ్ లతో పాటు అనేక అభయారణ్యాల అందాలు, సుగంధ ద్రవ్యాల తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ ఆకాశంలో ఎగురుతూ చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

సూర్యోదయం, సూర్యాస్తమయాలను

సూర్యోదయం, సూర్యాస్తమయాలను

P.C: You Tube

అందువల్లే పవన్ హన్స్ అనే సంస్థ ఇక్కడ హెలీ టూర్స్ ను ప్రారంభించింది. ఇక్కడ రాత్రి పూట హెలీ టూర్ ప్యాకేజీలు ఉండటం విశేషం. సూర్యోదయం, సూర్యాస్తమయాలను హెలీక్యాప్టర్ లో ఎగురుతూ చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక్కొక్కరికి రూ.2000, సమయం 5 నుంచి 30 నిమిషాలు. బోర్డింగ్ పాయింట్ పార్క్ హయాత్ హెలీపాడ్ గోవా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X