Search
  • Follow NativePlanet
Share
» »హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ

హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ

కేరళ పేరు వినగాని పర్యాటకానికి మారు పేరు అని గుర్తు వస్తుంది. పచ్చటి ప్రక్రుతి కొబ్బరి తోటలు, తాటి చెట్లతో నిండుగా కనిపించే బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, మంచి నీటి సరస్సులు, నదులు, కాలవలు మొదలగు ఆకర్షణల మద్య అద్భుతంగా ఉండే ఈ ప్రదేశానికి టూర్ వెళ్ళడం అంటే అత్యంత ఆహ్లాదకరమైనది ప్రదేశాన్ని సందర్శించడమే.

కేరళలో బీచ్ లు, బ్యాక్ వాటర్స్ పర్వత ప్రదేశాలు సెలవుల్లో విశ్రాంతి పొందాలనుకునే వారికి ఇది ఒక స్వర్గ దామం వంటింది. ట్రెక్కింగ్ , బోటింగ్, ఆధ్యాత్మిక జీవనం గడపాలనుకునే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అలాగే కొత్తగా పెళ్లైన జంటలకు , రసమయ జీవితంలో ఓలలాడాలనుకే జంటలకు కేరళ ఒక మజిలీ అని చెప్పవచ్చు.

ముఖ్యంగా కేరళలో ప్రతి సంవత్సరం సాంప్రదాయ స్నేక్ బోట్ రేస్ జరగడం విశేషం. ఇది చూడటానికి కేరళ రాష్ట్రుయులు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకలు ఈ సమయంలో సందర్శిస్తుంటారు. ముఖ్యంగా కేరళ ప్రక్రుతి ఒడిలో తుళుతూళుతు ఉండే సరస్సులు కేరళను మరింత అందంగా చూపించి పర్యాటకులను ఆకర్షిస్తాయి. కేరళలో ఉండే వెంబనాడు సరస్సు ఇండియాలో ఉండే సరస్సులలో కంటే అతి పెద్ద సరస్సుగా చెబుతారు. అంతే కాదు కేరళ హిల్ స్టేషన్స్ కు ప్రసిద్ది.

భారత దేశంలో కేరళ సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది. కేరళీయుల దుస్తులు, కళలు, ఆహారాలు మొదలైనవి పర్యాటకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కేరళకు చెందిన కథాకళి, మోహిని అట్టం ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. ఇంతటి ప్రసిద్ది చెందిన కేరళ పర్యటనకు తప్పక వెళ్లాల్సిందే. అయితే వెళ్ళే ముందు కేరళలో చూడదగ్గ ఇతర అద్భుత ప్రదేశాలను కూడా ఒక పట్టిక తయారుచేసుకుని మీకున్నంత సమయంలో తప్పనిసరిగా ఈ క్రింది ప్రదేశాలను కూడా చూసి రండి..మరి ఆ అద్భుతమైన ప్రదేశాలేంటో తెలుసుకుందాం..

అలెప్పె:

అలెప్పె:

కేరళ రాష్ట్రంలో 6వ అతి పెద్ద పట్టణం, లైట్ హౌస్ కు ప్రసిద్ది. అలెప్పిలో ఉప్పునీటి సరస్సులు, బీచ్ లకు ప్రసిద్ది. ఇవి ఒక రమణీయ అనుభూతిని కలిగిస్తాయి. బీచ్ లతో పాటు హౌస్ బోటింగ్ లు ముఖ్య ఆకర్షణలు. అందుకే కేరళలో రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటిగా ప్రసిద్ది చెందినది

కొచ్చి:

కొచ్చి:

ఎర్నాకులం జిల్లాలో అతి పెద్ద నగరం. రేవుపట్టణం కూడా. ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం. అరేబియన్ సముద్రాన్ని తన శరీరంలో భాగంగా చేసుకున్న అద్భుతమైన నగరం. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకుల మదిని దోచే మజిలి కొచ్చి. ఎంతో మంది పోర్చుగీసు వారు కొచ్చిలో స్థిరపడ్డారు. ప్రపంచపు మహోన్నత సంస్కృతుల మేళవింపు కొచ్చి. ఆహార పదార్ధాల వ్యాపారానికి, ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు మరియు మూలికల వ్యాపారంలో ఈ పట్టణం పేరొందింది. కొచ్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, మ్యూజియం ఆఫ్ కేరళ హిస్టర్, సెయింట్ మేరీ కేథడ్రాల్ బసిలికా, మట్టన్చేరి పాలస్, సుభాష్ పార్క్ ప్రసిద్ది.

మున్నార్:

మున్నార్:

కేరళలో ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్ హిల్ స్టేషన్ కు ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. మున్నార్ మూడు నదులు కలిసే ప్రేదేశంలో కలదు. ఇది ప్రసిద్ద పర్యాటక ప్రదేశం కావటం వల్ల ఈ హిల్ స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మన దేశం నుండే కాదు, ఇతర విదేశాల నుండి కూడా లక్షలాది పర్యాటకులు పిక్న్ లు , వీకెండ్ డెస్టినేషన్, సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి తనివితీరా విశ్రాంతి పొందడానికి ఇక్కడికి వస్తుంటారు.

తెక్కాడి:

తెక్కాడి:

PC: Jonathanawhite

ఆధ్యాత్మిక చింతననీ, ప్రకృతి సోయగాన్ని ఏకకాలంలో ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రదేశం ఒక అద్భుతమైన ప్రదేశం. వెకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఉత్తమమైనది. తెక్కడిని భూలోక స్వర్గమనే చెప్పాలి. కేరళలోని కొచ్చికి 180కిమీ దూరంలో కొట్టాయం రైల్వే స్టేషన్ కు 114కిలోమీటర్ల దూరంలో ఉన్న తెక్కడి ప్రాంతం వన్యప్రాణులకు ప్రసిద్ది. ఆనందం ఆహ్లాదం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా తెక్కడి అందచందాలను వీక్షించాల్సిందే

కోవలం:

కోవలం:

కేరళ రాష్ట్ర రాజధానికి తిరువనంతపురం దగ్గరలో ప్రసిద్ద సముద్ర తీరాన ఉన్న పట్టణం కోవలం. కొబ్బరి చెట్ల తోపు అనే అర్థంతో ఈ కోవలం అనే మలయాళ పదం నుండి ఈ పేరు వచ్చింది. కొబ్బరి చెట్ల తోటలకు ఈ నగరం ప్రసిద్దిగాంచినది. ‘భూమి మీద స్వర్గంగా ' పిలవబడే కాశ్మీర్ లాగా కోవలం దక్షిణాది స్వర్గం గా పిలువబడుతున్నది. కోవలం లో బీచ్ లు, చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం మీ హృదయానికి హత్తుకొనేంత అందంగా ఉంటుంది.

వయనాడ్:

వయనాడ్:

వయనాడు కోజికోడ్ మరియు కన్నూర్ జిల్లాల ప్రదేశాలతో ఉంది. ప్రాచీన ప్రతులలో ఈ ప్రాంతాన్ని మాయక్షత్ర(మాయా భూమి) అని పిలువబడినది. మాయక్షేత్ర మయనాడ్ గా మరియు చివరికి వయనాడ్ గా పిలవబడుతోంది. మద్య సముద్ర మట్టం నుండి ఉన్న దూరం మరియు అలుముకున్న అరణ్య ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.

త్రివేండ్రం:

త్రివేండ్రం:

గాడ్స్ ఓన్ కంట్రీగా పేర్కొనే కేరళ రాజధానికి తిరువనంతపురం. బ్రిటీష్ వారు ఈ నగరాన్ని త్రివేండ్రం అని పిలిచేవారు. ఇలా బ్రిటీష్ వారిచే పేరు పొందిన ఈ నగరం ఈ మధ్య నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ అనే సంస్థ తప్పక సందర్శించవలసిన ప్రాచీన ప్రదేశాల జాబితాలో ఈ నగరాన్ని కూడా చేర్చింది. వేయి తలల అనంత శేషునిపై పవళించిన పద్మనాభస్వామి ఈ నగర నడిబొడ్డున పద్మనాభస్వామి ఆలయంలో కొలువై ఉన్నాడు. ప్రఖ్యాతి గాంచిన పద్మనాభస్వామి ఆలయాన్ని ప్రతిరోజూ అనేకమంది భక్తులు సందర్శిస్తారు. నవరాత్రి మండపం వద్ద ప్రతి సంవత్సరం ఒక సంగీత ఉత్సవం నిర్వహిస్తారు, ఈ ఉత్సవం సరస్వతీ దేవికి అంకితమిస్తారు

వర్కాల:

వర్కాల:

వర్కాల కోస్తా తీర ప్రాంతం. సముద్రానికి సమీపంగా కొండలు . ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండే కొండలు అరేబియన్ సముద్రంతో కలుస్తాయి. వర్కాల సీజనల్ బీచ్ లలో ఇది ప్రతేకమైనదిగా చెప్పుకోవచ్చు . నారద ముని తనను చూడటానికి వచ్చిన పాపులను చూసి తన వద్ద ఉన్న వల్కాలంను విసిరి పారవేసాడని అది ఈ ప్రదేశంలో పడటం వల్ల వర్కాలం అనే పేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం అన్ని మతస్తులకు కూడా యాత్రా స్థలమే. శివ పార్వతి దేవాలయం , జనార్దన స్వామి ఆలయం, శివగిరి మటం, కాడువయిల్, యాన్కేలో కూతా, వర్కాల బీచ్ , పాపనాశం బీచ్ , కప్పిల్ సరస్సు , వర్కాల టన్నెల్, పవర్ హౌస్, మొదలైనవి వర్కాల పర్యటనలో ప్రధాన ఆకర్షణలు. పాపస్నానం బీచ్ ఇక్కడ అత్యంత ముఖ్యమైనది. దీని సమీపంలోనే జనార్ధన దేవాలయం కూడా కలదు. ఈ దేవాలయం ప్రాచీన కాలం నాటిది ఇది రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగినది.

కొమర్కోం:

కొమర్కోం:

మనోహరమైన బ్యాక్ వాటర్స్ పైన వెకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఒక మధురానుభూతి. చిన్న చిన్న అందమైన ద్వీపాల పొందికే కుమరకొం. కుటుంబం మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం కుమరకొం. కొట్టాయం నుండి 12కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం బ్యాక్ వాటర్ టూరిజం వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది.

కొల్లం:

కొల్లం:

PC: Rajeev Nair
జీడిపప్పు, కొబ్బరి తోటలకు ప్రసిద్ది కొల్లాం. సంస్కృతికి, వర్తకానికీ పేరున్న నగరం ఇది. ప్రతి సంవత్సరం జూన్ లో జరిగే ఓచిరకల్ (కంచె పోరాటం) పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. దీనితో పాటు మరమడి మల్సరం(ఎద్దుల పోటి ఉత్సవం)కొల్లాంపురం, పారిప్పల్లి గజమేళ, అనయడి ఏనుగు సంబంరాలు యావత్ భారత దేశ దృష్టిని ఆకర్షిస్తాయి.

కొట్టాయం:

కొట్టాయం:

Source:
కేరళలోని అతి పురాతన నగరం. కొట్టాయం జిల్లాలో ఉండే కొట్టాయం దేవుని స్వంత భూమి యొక్క జిల్లాలో ఒకటిగా చెప్పుకుంటారు. కొట్టాయం పశ్చిమ మరియు తూర్పు కనుమల సరిహద్దులు గల వెంబనాడ్ సరస్సు మంత్రముగ్దులను చేస్తుంది. ఇది ప్రకృతిలో ఒక అద్భుతమైన ప్రదేశం. అద్భుతమైన పర్వత శ్రేనులు, ప్రాచీనమైన కొండలు, పచ్చని లోయలు, కళ్ళు తిప్పుకోలేని సౌందర్యంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కొట్టాయం సహజ సౌందర్యం,గొప్ప సాంస్కృతికి వారసత్వ కారణంగా ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు విశ్రాంతి కోసం మరియు కేరళ సంపన్నమైన సాంస్కృతిక విలువలు కోసం వస్తుంటారు.

పలక్కాడ్:

పలక్కాడ్:

PC: Ashwin Kumar
ఇది మద్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక అందమైన పట్టణం. దీనిని పూర్వం పాలఘాట్ అని పిలిచేవారు. కేరళలోని మిగిలిన ప్రదేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వరి ఎక్కువగా పడిస్తారు. తాటి చెట్లు, ఆకుపచ్చ ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు మరియు ఎత్తుపల్లాల కొండలు వీటి అన్నింటితో గ్రామీణ వాతావరణం కలిగి ఉంటుంది. పాలక్కాడ్ లో ఆలయాలు, కోటలు, ఆనకట్టలు, జలపాతాలు, పార్కులు మరియు అభయారణ్యాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకుల సందర్శన కోసం ఇంకా చాలా ఉన్నాయి.పాలక్కాడ్ జైన దేవాలయం ప్రముఖ చారిత్రక ఆసక్తి ఉన్నవారు మరియు సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తారు. ఇక్కడ అద్భుతమైన పిక్ నిక్ స్థలాలున్నాయి.

బేకల్:

బేకల్:

PC: Vinayaraj
బేకల్ బీచ్ అద్భుతమైన ఆకర్షణలు మరియు ఆకర్షణీయమైన అందం కారణంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. కేరళలోని అతి పెద్ద కోటలలో ఇది ఒకటిగా ఉంది. ఇది కేరళలోని ఉత్తర దిశగా 16కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 130 అడుగుల ఎత్తున కలదు. బెకాల్ చుట్టూ మరొక ప్రసిద్ధ ఆకర్షణ ఖచ్చితంగా బెకాల్ ఫోర్ట్ బీచ్. ఇది మీరు ప్రశాంతతకు ఆహ్లాదరమైన వాతావరణంకు ప్రసిద్ది. ఈ కోటను ఎత్తైన కొండలపైన నిర్మించిన అద్భుతమైన భవనం మరియు బహుభుజి ఆకారంలో ఉన్న పొటెన్షియల్ స్లాబ్ లలో చెక్కబడింది. ఈ కోట వద్ద అద్భుతమైన టవర్ ప్రత్యేక నిర్మాణ శైలి కలిగి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.

దేవికులమ్:

దేవికులమ్:

PC: Jaseem Hamza
కేరళ రాష్ట్రంలో అతి పెద్ద హిల్ స్టేషన్ ఇది. దీని గురించి చాలా తక్కువ మంది పర్యాటకులకు మాత్రమే తెలిసుంటుంది. ఇక్కడికి చాలా తక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు కాబట్టి, ఈ ప్రదేశం ఇప్పటికీ పచ్చని ప్రకృతి అందాలతో, కాఫీ తోటల పరిమళాలతో, సుగంధ ద్రవ్యాల సువాసన లతో అలరారుతుంది. అనేక సుందర దృశ్యాలు, కొండ చరియల నుండి పారే జలపాతాలు మరియు అందమైన పరిసరాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి.

సుల్తాన్ బాతెరీ:

సుల్తాన్ బాతెరీ:

PC: Nijusby
సుల్తాన్ బతేరి గ్రామీణ వాతావరణం కలిగిన ఒక చిన్న గ్రామం. ఈ ప్రదేశం సుగంధ తోటలకు ప్రసిద్ది. ఆ ప్రదేశంలో అడుగుపెడితే చాలు అద్భుతమైన సుగంధ వాసనలతో పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. ఈ ప్రదేశంలోని ప్రకృతి దృశ్యాలు మరియు అనుకూల వాతావరణం ఈ ప్రదేశాన్ని ఒక విశ్రాంతి సెలవుల ప్రదేశంగా మార్చి వేసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X