Search
  • Follow NativePlanet
Share
» »ఈ వి‘చిత్ర’మైన మ్యూజియం చూసావా గురు

ఈ వి‘చిత్ర’మైన మ్యూజియం చూసావా గురు

చెన్నైలోని క్లిక్ ఆర్ట్ మ్యూజియం గురించి కథనం

By Kishore

ప్రస్తుతం 3డీ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా చలన చిత్ర రంగంలో ఈ విధానం వినియోగించి సినిమా నిర్మించేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. సాధారణంగా 2డీ విధానంలో సినిమాను నిర్మిస్తారు. అయితే 3డీ విధానంలో నిర్మించిన సినిమా చూడటానికి 2డీ విధానంలో నిర్మించిన సినిమా చూడటానికి చాలా తేడా ఉంటుంది. 3డీ అనుభూతి మనలను మైమరిపించేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ 3డీ సినిమా నిర్మాణానికి బాటలు పరిచినది 3డీ చిత్రకళ. దీనినే 3డీ పెయింటింగ్ అని కూడా అంటారు. ఈ 3డీ పెయింటింగ్ కు ప్రత్యేక మ్యూజియం కూడా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా మీ కోసం...

మీతో పాటు అటు పై 21 తరాలకు ముక్తిని ప్రసాదించే ప్రాంతం...అందుకే ఇప్పటికీమీతో పాటు అటు పై 21 తరాలకు ముక్తిని ప్రసాదించే ప్రాంతం...అందుకే ఇప్పటికీ

ఖురాన్ చదివితేనే ముందుకు కదిలే భూ వరహాస్వామిఖురాన్ చదివితేనే ముందుకు కదిలే భూ వరహాస్వామి

ఆంగ్లేయుడికి కూడా శ్రీరాముడు దర్శనమిచ్చిన ప్రాంతం...ఈ క్షేత్రంలో కాలుపెడితే...ఆంగ్లేయుడికి కూడా శ్రీరాముడు దర్శనమిచ్చిన ప్రాంతం...ఈ క్షేత్రంలో కాలుపెడితే...

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

P.C: YouTube

చెన్నై నగరంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో దేశంలోని అతి విశాలమైన 3డీ పెయింటింగ్ మ్యూజియం ఉంది. ప్రతి రోజూ వేల మంది సందర్శకులు ఈ మ్యూజియంను సందర్శిస్తూ ఉంటారు.

2. ట్రిక్ ఆర్ట్

2. ట్రిక్ ఆర్ట్

P.C: YouTube

ట్రిక్ ఆర్ట్ జాబితాలో 3డీ పెయింటింగ్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ 3డీ పెయింటింగ్ చిత్ర కళకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ చిత్రకళ నేర్చుకోవడం కొంత కఠినమే అని చెప్పవచ్చు.

3. సాంకేతికంగా

3. సాంకేతికంగా

P.C: YouTube

ఈ 3డీ చిత్రకళను సాంకేతికంగా టెంప్ లో ఓయ్ల్ అని అంటారు. అంటే కంటిని మోసగించేదని ఫ్రెంచ్ భాషలో అర్థం. ఈ కళ ముఖ్య ఉద్దేశం బ్రమను కలిగించి లేనిది ఉన్నట్లు చూపించడం

4. అప్పట్లో

4. అప్పట్లో

P.C: YouTube

ఈ కళను వేల సంవత్సరాల క్రితం శత్రు సైనికులను బోల్తా కొట్టించడానికి వినియోగించేవారు. ముఖ్యంగా గ్రీకులు ఈ చిత్రకళను వినియోగించి చిన్నవిగా ఉన్న కోటలను పెద్దవిగా చూపించి శత్రు సైనికులను బోల్తా కొట్టించేవారని చరిత్ర చెబుతోంది.

5. ఆ మ్యూజియం అడ్రస్

5. ఆ మ్యూజియం అడ్రస్

P.C: YouTube

క్లిక్ ఆర్ట్ మ్యూజియం, ఈస్ట్ కోస్ట్ రోడ్డు, అక్కరై, ఇంజంబక్కం, చెన్నై 600115. మరెందుకు ఆలస్యం ఈ మ్యూజియంకు వెళ్లి అక్కడ ఉన్న చిత్రవిచిత్రమైన పెయింటింగ్స్ ను చూసి ఆనందించండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X