Search
  • Follow NativePlanet
Share
» »నగ్నంగా ఉండాలనిపించే ప్రాంతాలు ఇవే

నగ్నంగా ఉండాలనిపించే ప్రాంతాలు ఇవే

ఇంట్లో వాళ్లు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసినప్పటి నుంచి వధూవరులు ఇద్దరూ హనీమూన్ కు ఎక్కడికి వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకొంటూ ఉంటారు. విభిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్న భారత దేశంలో హనీమూన్ కు అనుకూలమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యుత్తమమైన 10 ప్రాంతాలకు సంబంధించిన క్లుప్తమైన వివరాలు మీ కోసం...

అండమాన్

అండమాన్

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 16,999

ఎన్ని రోజులు ఉత్తమం 6 నుంచి 15 రోజులు

భారత దేశంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అండమాన్ కు హనీమూన్ కోసం వెళ్లేవారి సంఖ్య ప్రతి నెల పెరుగుతూ ఉంది. దీంతో ప్రస్తుతం హనీమూన్ కు అండమాన్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. బీచ్ లతో పాటు స్కూబా డైవింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

గోవా

గోవా

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 15,000

ఎన్ని రోజులు ఉత్తమం 5 నుంచి 10 రోజులు

భారత దేశంలో హనీమూన్ అన్న తక్షణం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చే ప్రాంతం గోవా. ముఖ్యంగా మీరు పార్టీ లవర్స్ అయితే గోవాకు మించిన ప్రాంతం మరొక్కటి లేదు. భారత దేశంలోని అన్ని ప్రముఖ నగరాల నుంచి ఇక్కడికి నేరుగా విమానయాన సర్వీసులు ఉన్నాయి.

శ్రీనగర్

శ్రీనగర్

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 15,000

ఎన్ని రోజులు ఉత్తమం 4 నుంచి 8 రోజులు

గూడు పడవల్లో ప్రయాణం చేస్తూ ఏకాంతంగా గడుపాలన్న ఆలోచనతో ఉన్నవారు ఇక్కడికి తప్పకుండా వెలుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది. మొగల్ గార్డెన్స్, సరస్సులతో పాటు ఇక్కడ ఆహార పదార్థాలు కూడా బాగా నచ్చుతాయి.

ఆగ్రా

ఆగ్రా

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 5,000

ఎన్ని రోజులు ఉత్తమం 3 నుంచి 5 రోజులు

మీ జీవితంలోకి కొత్తగా వచ్చినవారికి వెన్నల్లో ఆ తాజ్ మహల్ ను చూపించడం మీరు అందించే గొప్ప బహుమతి. మరెందుకు ఆలస్యం ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్ మహల్ చూడటానికి బయలు దేరండి. ఏడాదితో ఆగ్రా టూర్ అన్ని వేలలా అందుబాటులో ఉంటుంది.

జై సల్మీర్

జై సల్మీర్

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 7,000

ఎన్ని రోజులు ఉత్తమం 6 నుంచి 7 రోజులు

ఇసుక తెన్నుల మధ్య మీ జీవిత భాగస్వామితో గడపడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. డసర్ట్ సఫారీ, రాజభవనాల అందాలు, ప్యాలెస్ ఆన్ వీల్స్, స్థానిక పండుగలు, జాగపద సంగీత ఇవేవి మిస్ చేసుకోకండి. హనీమూన్ తో పాటు ఈ మధురాలన్నీంటిని సొంతం చేసుకొని వెనుదిరగండి

అలెప్పే

అలెప్పే

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 8,000

ఎన్ని రోజులు ఉత్తమం 5 నుంచి 6 రోజులు

దేవతలే మెచ్చిన అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రక`తిని రమణీయతను సొంతం చేసుకున్న రాష్ట్రం కేరళ. అందుకే దీనిని గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటారు. ఇక కేరళలోని అలెప్పే అందాలు చూసి తీరాల్సిందే. గూడు పడవల్లో ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పవచ్చు.

మనాలి

మనాలి

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 6,000

ఎన్ని రోజులు ఉత్తమం 3 నుంచి 4 రోజులు

సాహసక్రీడలంటే ఇష్టపడేవారికే కాదు కొత్తగా పెళ్లైనవారికి కూడా మనాలి తెల్లటి మంచుతో స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఏడాదిలో ఎప్పుడైనా ఇక్కడకు హనీమూన్ కు వెళ్లడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందుకే ఉత్తర, దక్షిణ భారత దేశీయులన్న తేడా లేకుండా చాలా మంది తమ హనీమూన్ కూడా మనాలి వెలుతూ ఉంటారు.

మున్నార్

మున్నార్

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 8,000

ఎన్ని రోజులు ఉత్తమం 5 నుంచి 6 రోజులు

కేరళలోని ప్రముఖ హిల్ స్టేషన్ ఈ మున్నార్. కనుచూపుమేరలో టీ తోటల అందాలను మీలో కోరికలను రెచ్చగొడుతాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక్క టీ తోటలే కాకుండా సుంగధ ద్రవ్యాల తోటలు, వన్యప్రాణీ సంరక్షణ కేంద్రాలు, వంటివి ఎన్నింటినో ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఎర్రాకులం నేషనల్ పార్క్ ఆనముడి, దేవికులం చూడటం మరిచిపోకండి.

కూర్గ్

కూర్గ్

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 10,000

ఎన్ని రోజులు ఉత్తమం 5 నుంచి 6 రోజులు

కర్నాటకలోని ఈ హిల్ స్టేషన్ కొత్తగా పెళ్లైన వారిని తన అందాలను చూడమంటూ ఆహానిస్తూ ఉంటుంది. చుట్టూ పచ్చదనం పరుచుకున్న ఈ కూర్గ్ ను స్కాట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ అడవి అందాలతో పాటు చరిత్రకు సంబంధించిన ఎన్నో తీపి గురుతులను కూడా చూడవచ్చు.

డార్జిలింగ్

డార్జిలింగ్

P.C: You Tube

ప్యాకేజ్ ఎంత నుంచి మొదలవుతుంది రూ. 8,000

ఎన్ని రోజులు ఉత్తమం 5 నుంచి 7 రోజులు

చాలా కాలంగా భారత దేశంలో హనీమూన్ కోసం చాలా ప్రాచూర్యం పొందిన స్థలాల్లో డార్జిలింగ్ ఒకటి. ఇక్కడ వాతావరణం మనలోని కోరికలను రెట్టింపు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే చాలా మంది ఇక్కడికి వెలుతుంటారు.

Read more about: tour travel india wild life adventure
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X