Search
  • Follow NativePlanet
Share
» » కర్నూలు చుట్టు ఉన్న ఈ పర్యాటక ప్రాంతాలను మిస్ చేసుకోకండి

కర్నూలు చుట్టు ఉన్న ఈ పర్యాటక ప్రాంతాలను మిస్ చేసుకోకండి

రాయల సీమ భారతీయ పురాణ, ఇతిహాసాల్లోనే కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుర రాజకీయ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. రాయలసీమ లోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు ప్రామూఖ్యం కొంత ఎక్కువే. చారిత్రాత్మకంగానే కాకుండా భౌగోళికంగా కూడా ఈ జిల్లా విభిన్నమైనదే. ఈ కర్నూలు చుట్టు పక్కల మనకు అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్ సమయంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేపర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు వీకెండ్ తో పాటు సాధారణ పర్యాటకానికి కూడా అనువైన ఐదు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం

కర్నూలు కోట

కర్నూలు కోట

P.C: You Tube

కర్నూలు కోటను 16వ శతాబ్దంలో నిర్మించారని స్థానికంగా దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. కొండారెడ్డి బురుజు పేరుతో పిలువబడే ఈ కోట ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారత దేశం మొత్తం ప్రాచూర్యం చెందిన పర్యాటక ప్రాంతం. విజయనరగ రాజ్యానికి చెందిన అచ్యుత దేవరాయులు ఈ కోటను నిర్మించాడు. ఒకప్పుడు దీనిని ఖైదీలను బంధించడానికి కూడా వినియోగించేవారు.

బెలూం గుహలు

బెలూం గుహలు

P.C: You Tube

భారత దేశంలో అత్యంత పొడవైన గుహల్లో బెలూం గుహలు రెండో స్థానంలో నిలబడుతాయి. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. జాలువారే శిలా స్పటికాలు, రక రకాల శిలాక`తులు అడుగడుగునా అబ్బురపరిచే విషయాలు. క్రీస్తు పూర్వం 4,500 ప్రాంతంలో ఈ గుహలో ఆది మానవుడు నివశించినట్లు అక్కడ దొరికిన రాతిపాత్రల వల్ల తెలుస్తోంది. కర్నూలు నుంచి బెలూం గుహలకు 110 కిలోమీటర్ల దూరం.

నల్లమలా అడవులు

నల్లమలా అడవులు

P.C: You Tube

కర్నూలుకు దగ్గరగా ప్రక`తి సంపదలకు నిలయంగా నల్లమలా అడవులు ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఇక్కడకు ఎక్కువగా యువత ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. పులలు, ఏనుగులకు నిలయమైన ఈ నల్లమలా అడువుల్లో ఎన్నో జలపాతాలు వర్షాకాలంలో మనకు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. ఈనల్లమల అడవుల్లో అత్యంత ఎతైన పర్వత శిఖరం శ్రీకఠేశ్వరం ఎత్తు 2835 అడుగులు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టమైతే వీకెండ్ లో మీకు నల్లమలా అడవులకు మించిన ప్రదేశం మరొకటి లేదు.

రొల్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం

రొల్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం

P.C: You Tube

దాదాపు 614 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రొల్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం కర్నూలు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. బర్డ్ వాచర్స్ కు ఈ పక్షి సంరక్షణ కేంద్రం స్వర్గధామం వంటిది. వివిధ రాకాల పక్షులతో పాటు జంతువులు, సరీస`పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పర్యావరణ ప్రేమికులు ఎక్కువగా ఈ రొల్లపాడు పక్షి సంరక్షణ కేంద్రానికి వస్తుంటారు.

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం

P.C: You Tube

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం కర్నూలు పట్టణం నుంచి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా రాళ్లతో ఏర్పడిన కొన్ని నిర్మాణాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటగల వరకూ ఈ ఓర్వకల్లు రాతి ఉద్యానవనాన్ని వీక్షించడానికి అనుకూలం. ఈ ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో జయంమనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి వంటి ఎన్నో చిత్రాలను చిత్రీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X