Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకులకు స్వర్గం వంటిది ఔరంగాబాద్

పర్యాటకులకు స్వర్గం వంటిది ఔరంగాబాద్

మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరుపైగల ఈ పట్టణం మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఔరంగాబాద్ అంటే 'సింహాసనం చే కట్టబడింది' అని అర్ధం చెబుతారు. ఔరంగాబాద్ నగరం మహారాష్ట్రలో ఉత్తర భాగంలో ఉంది. భారదేశానికి పడమటి ప్రాంతంలో ఉంది. 1681 సంవత్సరంలో ఔరంగజేబ్ ఔరంగాబాద్ పట్టణాన్ని తన కార్యక్రమాలకు ఉపయోగించాడు. ముఖ్యంగా మెగలాయిలు ఈ ప్రదేశానని ఛత్రపతి శివాజీని యుద్ధంలో గెలిచేందుకు కేంద్రంగా వాడుకున్నారు. మొఘల్ చక్రరవర్తి ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని పాలనా కేంద్రంగా చేసుకుని దక్షిణాది వ్యవహారాలు చూసుకునే వారు. అప్పటి నుండి ఈ పట్టణం ఔరంగాబాద్ గా పేరొందింది.

షిరిడీ నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉండే ఔరంగాబాద్ పట్టణం మహారాష్ట్ర పర్యటనకు అధికార రాజధానిగా చెప్పవచ్చు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. గత చరిత్ర వైభవం ఈ ప్రాంతంలో అధికంగా కనపడుతుంది. మొగలాయీల పాలనకు ముందు ఔరంగాబాద్ చరిత్ర వాస్తవానికి బౌధ్ధ మతానికి చెందినది. అజంతా, ఎల్లోరా గుహలు ఆనాడు మన దేశం బౌధ్ధమత ప్రభావానికి ఎంత లోనయిందనే దానికి నిదర్శనంగా కనపడతాయి. చారిత్రక ప్రసిద్ధి కల ఈ రెండు చిహ్నాలు యునెస్కో సంస్ధచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడా ప్రకటించబడ్డాయి. ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి

బీబీ కా మక్బరా

బీబీ కా మక్బరా

దక్నన్ తాజ్ మహాల్ గా గుర్తింపు పొందిన ఈ కట్టడం ఔరంగబేబు భార్య రబియా దురానీ సమాధి.

దౌలతాబాద్ కోట: శత్రుదుర్భేద్యమైన దౌలతాబాద్ కోట శతాబ్దాల నుండి పట్టువస్త్రాల తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్న ఔరంగాబాద్ లో అందమైన పట్టు చీరలు, నాణ్యమైన శాలువాలు కూడా లభిస్తాయి.

Photo Courtesy: Danial Chitnis

అజంతా గుహలు:

అజంతా గుహలు:

మహారాష్ట్రలోని అజంతా గుహలు రాతి శిల్ప కళను కలిగిన గుహ నిర్మాణాలు. అజంతా 95కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఔరంగాబాద్‌ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. క్రీ.పూ 2వశతాబ్దానికి చెందిన ఈ గుహల్లోని అపురూప శిల్పాలు బౌద్దమతానికి ప్రతీకలుగా కనిపిస్తాయి, గుర్రపునాడా ఆకారంలో ఉన్న గుట్టల్లో ఏకంగా 29 గుహలుండటం విశేషం.

ఎల్లోర:

ఎల్లోర:

ఔరంగాబాద్ నుండి ఎల్లోరా 32కి.మీ దూరంలో ఉంటుంది. . క్రీ.శ 5-10శతాబ్దాల మద్య నిర్మించిన ఈ గుహల్లో హిందు, బౌద్ద, జైన మతాల ఆనవాళ్లు ఉన్నాయి. విభిన్న మతాల వైభవం ఇక్కడ దర్శించవచ్చు. గుట్టల్లోని కైలాస దేవాలయం ఆనాటి కళాకారుల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కొండను తొలచి ఆనాటి కళాకారుల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించిన తీరు అబ్బురపరుస్తుంది. వీటి నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. మొదట పై అంతస్తు, అందులోని శిల్పా లను చెక్కి ఆ తర్వాత కింది అంతస్తు, అక్కడి శిల్పాలు చెక్కారు. ఇక్కడ మొత్తం 34 గుహలున్నాయి. ఆశ్చర్యానికి గురిచేసే ఈ గుహల అందాలు దృష్టిని మరల్చ నీయవు. మొదట బౌద్ధులకు సంబంధించిన 12 గుహలు ఉంటాయి. వీటిని 5-8 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. 6-9 శతాబ్ద కాలంలో చెక్కినవి హిందువుల గుహలు. ఇవి 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి. వీటిని యునెస్కో వారు 'ప్రపంచ వారసత్వ సంపదహోదా' పొందిన కేంద్రాలుగా గుర్తించారు.

Photo Courtesy: Y.Shishido

ఘృష్ణేశ్వర్‌:

ఘృష్ణేశ్వర్‌:

ఔరంగాబాద్ కు దగ్గర్లో ఉన్న శైవక్షేత్రం ఘృష్ణేశ్వర్‌. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఘృష్ణేశ్వరుడిని దర్శించేందుకు ఏడాది పొడవునా భక్తులు తరలి వెళుతుంటారు. ఢిల్లీ సుల్తానుల దాడిలో ద్వంసమైన ఆ ఆలయాన్ని 18వ శతాబద్దంలో పునరుద్ధరించారు. గ్రేప్ సిటీగా పేరొందిన నాసిక్ లో ఒకవైపు గోదావరి గలగలలు, మరోవైపు ద్రాక్షతోటలు విస్తారంగా కనబడుతాయి. ప్రకృతి సంపదకు లోటులేదిక్కడ.

Image Courtesy:Ankur P

గుల్షనాబాద్:

గుల్షనాబాద్:

మొఘల్ చక్రవర్తుల పాలనలో గుల్షనాబాద్ గా పేరొందిన ఈ నగరం చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక ప్రాశస్త్యం ఆధ్యాత్మిక వైభవం కలిగి ఉంది. నాసిక్ చుట్టు పక్కల ప్రాంతాలు రామాయణ గాధతో ముడిపడి ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు, శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడనీ, అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరు వచ్చిందని అంటారు.

దౌలతాబాద్

దౌలతాబాద్

దౌలతాబాద్ పట్టణం, ఔరంగాబాద్ కు 16 కి. మీ. ల దూరంలో వుంటుంది. దీనిని ఐశ్వర్యం కల నగరంగా అర్ధం చెపుతారు. దౌలతాబాద్ ఒకప్పుడు తుగ్లక్ వంశ పాలకులకు రాజధానిగా వుండేది. ఇపుడు ఈ నగరం శిధిలమై ఒక విలేజ్ సమీపంలో మనుష్య నివాసం లేక, అపుడు అపుడు వచ్చే, దౌలతాబాద్ కోటను దర్శించే పర్యాటకులకు ఒక పర్యాటక స్థలంగా మాత్రమే కలదు.

పంచవటి :

పంచవటి :

పట్టణంలోని పంచవటి ప్రముఖ పర్యాటక ప్రదేశం. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఇక్కడే ఉన్నారని స్థల పురాణం. గోదావరి నదిపై రామ, లక్ష్మణ గుండాలున్నాయి. ఒడ్డున ఉన్న సీతా గుఫా (గుహ)ప్రాంతంలోనే రావణుడు సీతమ్మను అపహరించాడని చెబుతారు. ఈ ప్రదేశాలకు నిత్యం యాత్రికులు వస్తూనే ఉంటారు. పదిహేడో శతాబ్దంలో నిర్మించిన కాలారామ్ ఆలయంలో అణువణువునా అద్భుతమైన శిల్పకళ అలరిస్తుంది. పట్టణంలోని ముక్తిధామ్ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించారు. ఆలయం గోడలపై భగవద్గీతలోని శ్లోకాలన్నీ చెక్కడం విశేషం.

Photo Courtesy: Arun Sagar

పాండవ గుహలు:

పాండవ గుహలు:

పట్టనానికి 10 కిలోమీటర్ల దూరంలో పాండవ గుహలుంటాయి. వీటిలో బౌద్ధం, జై

Photo Courtesy: Chtototakoe

పుర్వార్ మ్యూజియం

పుర్వార్ మ్యూజియం

ఔరంగాబాద్ లో ప్రసిద్ధి చెందినది. ఇది సరాఫా రోడ్డులోని ఒక చిన్న మ్యూజియం. దీనిలో డాక్టర్ పూర్వార్ వ్యక్తిగత అంశాలు ఎన్నో ప్రదర్శిస్తారు. ఇక్కడి వస్తువులు ఆయనచే సేకరించబడినవి. 500 సంవత్సరాల నాటి గొలుసుకల ఒక సూటు, ఔరంగజేబు రచించిన ఖురాన్ గ్రంధ కాపీ, 800 వందల సంవత్సరాలనాటి పురాతన పైఠాని చీర వంటి అపురూప వస్తువులు ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియం పర్యాటకులకు మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం 10.30 గం.లనుండి మ.1.30గం మరియు మ.3 గం. నుండి సా.6 గంటల వరకు తెరచి ఉంటుంది. ప్రవేశ రుసుము రూ.5 మాత్రమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X