Search
  • Follow NativePlanet
Share
» »పాలక్కాడ్ - అత్యుత్తమ ఆకర్షణ ప్రదేశాలు !!

పాలక్కాడ్ - అత్యుత్తమ ఆకర్షణ ప్రదేశాలు !!

By Mohammad

పాలక్కాడ్ కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పట్టణం మరియు జిల్లా కేంద్రం. పశ్చిమ కనుమల్లో ప్రవహించే పొన్నా నదికి సమీపంలో పాలక్కాడ్ పట్టణం ఉన్నది. తాటి చెట్లు, ఆకుపచ్చని తీగలతో ప్రకృతి దృశ్యాలు, అన్నింటినీ మించి ఎత్తుపల్లాల కొండలతో, పచ్చని వరి పంట పొలాలతో గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువగా వరి పంటను పండిస్తారు కనుకనే పాలక్కాడ్ ను "కేరళ రైస్ బౌల్ " లేదా "కేరళ ధాన్యాగరం" అని అంటారు.

పాలక్కాడ్ మరియు పాలక్కాడ్ కు 7 కి. మీ. దూరంలో ఉన్న మలం పూజ లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అభయారణ్యాలు, కోటలు, జలపాతాలు, ఆనకట్టలు మరియు పార్కులు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. శీతాకాలం లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి బయటి ప్రదేశాలను చూడటానికి ఇదే అనువైన సమయం.

పాలక్కాడ్ ఏ ఏ ప్రదేశాలను చూడాలి ??

తీరిక లేని వారికి కాసింత విశ్రాంతి పొందటానికి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం పొందాలనుకొనే వారికి పాలక్కాడ్, మలం పూజా ప్రదేశాలు అనుకూలమైనవి. మరి ఇక్కడికి వెళితే ఏ ఏ ప్రదేశాలను చూడాలి ?? ఎక్కడ బస చేయాలి ?? అనే విషయానికి వస్తే ....

కలపతి ఆలయం, పాలక్కాడ్

కలపతి ఆలయం, పాలక్కాడ్

కేరళ ప్రఖ్యాత ఉత్సవాలలో కలపతి రథోత్సవం ఒకటి. నవంబర్ - డిసెంబర్ మాసాల మధ్యలో జరిగే ఈ రథోత్సవానికి దేశ, విదేశాల నుండి భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు.

చిత్ర కృప : www.keralapilgrimcenters.com

జైన దేవాలయం, పాలక్కాడ్

జైన దేవాలయం, పాలక్కాడ్

పాలక్కాడ్ సమీపంలోని జైన్మేడు అనే సుందర ప్రదేశంలో జైన దేవాలయం ఉన్నది. దేశంలో ఉన్న అన్ని జైన దేవాలయాలలో కెల్లా పురాతనమైనదిగా, జైన సంస్కృతిని, సంప్రదాయాలను మరియు ప్రాముఖ్యతను తెలియజేసేదిగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : telugu native planet

జైన దేవాలయం, పాలక్కాడ్

జైన దేవాలయం, పాలక్కాడ్

జైన దేవాలయాన్ని 500 సంవత్సరాల క్రితం గ్రానైట్ రాళ్లతో నిర్మించినారు. 32 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు కలిగిన ఈ ఆలయం జైన సంస్కృతి కి నిదర్శనం. చంద్రనాథన్, పద్మావతి , విజయలక్ష్మినాథన్, రిషభ విగ్రహాలతో పాటుగా జైన తీర్థాంకుల విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : telugu native planet

పాలక్కాడ్ కోట, పాలక్కాడ్

పాలక్కాడ్ కోట, పాలక్కాడ్

పాలక్కాడ్ లో ప్రసిద్ధ వారసత్వ భవనంగా ఉన్న పాలక్కాడ్ కోట ని టిప్పూసుల్తాన్ కోట అని కూడా పిలుస్తారు. దీనిని అప్పటి మైసూర్ రాజు హైదర్ అలీ పట్టణం నది మధ్యలో కట్టించినాడు. పాలక్కాడ్ కోట ని పట్టణంలోని ఏ ప్రదేశం నుండైనా సులభంగా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Prashanth dotcompals

పాలక్కాడ్ కోట, పాలక్కాడ్

పాలక్కాడ్ కోట, పాలక్కాడ్

పాలక్కాడ్ కోట చుట్టుప్రక్కల పరిసరాలను పరిశీలిస్తే టిప్పూసుల్తాన్ సైన్యం యొక్క జంతువుల పెంపకం కోసం వాడే కోట మైదానం, ఓపెన్ ఆడిటోరియం, ఆలయం లు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండే ఈ కోట కు ఎటువంటి ప్రవేశ రుసుం లేదు కానీ స్టిల్ కెమరాకి రూ. 20 గా, వీడియో కెమరాకి రూ.50 గా ఛార్జీలను వసూలు చేస్తారు.

చిత్ర కృప : Edukeralam

కన్జిరపుజ్హ, పాలక్కాడ్

కన్జిరపుజ్హ, పాలక్కాడ్

పాలక్కాడ్ లో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ కన్జిరపుజ్హ ఆనకట్ట. ఇది వేట్టిలచోల అనే గ్రీన్ ఫారెస్ట్ కి దగ్గరలో ఉన్నది. అన్నట్టు ఈ రిజర్వాయర్ లో అనేక రకాల చేప జాతులు ఉన్నాయి. కన్జిరపుజ్హ ఆనకట్ట పరిసరాలు ఒకరోజు పిక్నిక్ కు, పర్యటన కు అనుకూలమైనవి.

చిత్ర కృప : telugu native planet

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం, పాలక్కాడ్

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం, పాలక్కాడ్

వన్య ప్రాణుల ఔత్సాహికులకు, ప్రకృతి ప్రేమికులకి ఒక సైట్ సీయింగ్ ప్రదేశం గా పాలక్కాడ్ పరంబిక్కులమ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది. ఇక్కడ రకరకాల వన్య ప్రాణులు చూడవచ్చు. సందర్శకులు క్రూర మృగాలతో పాటుగా సలీమ్ అలీ గ్యాలరీ సందర్శించవచ్చు.

చిత్ర కృప : Prashanth dotcompals

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం, పాలక్కాడ్

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం, పాలక్కాడ్

పరంబిక్కులమ్ వన్య ప్రాణుల అభయారణ్యం లో సాహసాలకు కొదువలేదు. అధికారుల అనుమతితో యాత్రికులు కాలినడకన ట్రెక్కింగ్ చేయవచ్చు. అభయారణ్యంలో బస కోరుకునే పర్యాటకులకు అడవి శిబిరాలు, నైట్ ప్యాకేజీలు, పడవ క్రూయిసెస్ మరియు ట్రీ ఇళ్ళులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : telugu native planet

ధోనీ జలపాతాలు, పాలక్కాడ్

ధోనీ జలపాతాలు, పాలక్కాడ్

ప్రకృతి అద్భుతాలను అనుభవించాలనుకొనే వారికి ధోనీ జలపాతాలు చాల బాగుంటాయి. ధోనీ జలపాతాలు పాలక్కాడ్ పట్టణానికి 15 కి. మీ. దూరంలో దట్టమైన అభయారణ్యం లో ఉండి చాలా అందంగా ఉన్నాయి. దూరంగా ఉన్న కొండలపైకి ట్రెక్కింగ్ చేసి, జలపాతాలను తాడు మార్గం ద్వారా దాటవచ్చు.

చిత్ర కృప : CM

ధోనీ జలపాతాలు, పాలక్కాడ్

ధోనీ జలపాతాలు, పాలక్కాడ్

ధోనీ జలపాతాలను మరియు దాని పరిసరాలను సందర్శించడానికి రుతుపవనాలు తర్వాత వచ్చే వర్షకాలం, శీతాకాలం అనువైన సమయాలు.ఇక్కడ ఆహరం దొరకటం కష్టం కనుక ప్రయాణీకులకు కావలసిన ఆహారం, నీరు మరియు స్నాక్స్ వెంట తీసుకువెళ్ళటం మంచిది.

చిత్ర కృప : Nirmal Kumar

ఫాంటసీ పార్క్, మలం పూజ

ఫాంటసీ పార్క్, మలం పూజ

పాలక్కాడ్ పట్టణానికి 10 కి .మీ. దూరంలో, 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఫాంటసీ పార్క్ స్కూల్ పిల్లలకి, ఒకరోజు పిక్నిక్ కి బాగుంటుంది. ఈ పార్క్ లో అన్ని వయసుల వారికి ఆకర్షిస్తున్నది. అందమైన ఫౌంటెన్ లు , ఆహార దుకాణాలు, ఐస్ క్రీం పార్లర్లు , విశ్రాంతి ప్రదేశాలు కూడా కలవు. బాటరీ కార్ రైడ్ , వాటర్ కిడ్డి రైడ్, బేబీ ట్రైన్ రైడ్ మరియు మినీ టెలి కాంపాక్ట్ వంటివి పిల్లలను ఆనందపరుస్తాయి.

చిత్ర కృప : Asokants

మలంపూజ డాం, మలంపూజ

మలంపూజ డాం, మలంపూజ

పాలక్కాడ్ పట్టణానికి 10 కి. మీ. దూరంలో ఉండి, రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకొనే మరో ప్రదేశం మలం పూజ డాం. డాం సైట్ వద్ద అందమైన గార్డెన్ మరియు ఆమ్యూజ్ మెంట్ పార్క్ లు ఉన్నాయి. ఈ డాం లో విహరించాలనుకొనేవారికి బోటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.

చిత్ర కృప : Ranjithsiji

మలం పూజ తోటలు, మలంపూజ

మలం పూజ తోటలు, మలంపూజ

మలంపూజ తోటలని "కేరళ బృందావనం" గా పిలుస్తారు. ఇవి రిజర్వాయర్ ప్రాంత సమీపం లో కలవు. గార్డెన్ లో ఆక్వెరీయం, ఏరియల్ రోప్ వే, యక్షి విగ్రహం, రాక్ గార్డెన్, రోజ్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ మరియు కొన్ని ఫౌంటెన్ లు కూడా కలవు. ఇక్కడ కల కెనాల్ లో బోటింగ్ కూడా చేయవచ్చు.

చిత్ర కృప : Shanmugamp7

యక్షి విగ్రహం, మలంపూజ

యక్షి విగ్రహం, మలంపూజ

యక్షి విగ్రహం కేరళ రాష్ట్ర పనితనానికి ఒక మంచి ఉదాహరణగా చెబుతారు. ఈ విగ్రహం మలం పూజ గార్డెన్ లో ఉండి వచ్చి పోయే యాత్రికులను ఆకర్షిస్తున్నది. దీనిని 1969 వ సంవత్సరంలో కనాయి కుంహి రామన్ అనే కేరళ శిల్పి నిర్మించాడు.

చిత్ర కృప : Pritish Soundararaajan

రాక్ గార్డెన్, మలంపూజ

రాక్ గార్డెన్, మలంపూజ

మలం పూజ తోటల లోని రాక్ గార్డెన్, భారత దేశంలో ఉన్న ప్రముఖ రాక్ గార్డెన్ లలో రెండవది. దీనిని నెక్ చాంద్ సాయాని నిర్మించారు. ఈయనే చండీఘడ్ లోని మొదటి రాక్ గార్డెన్ ను కూడా నిర్మించారు. దీనికోసం పగిలిన టైల్స్, ప్లాస్టిక్ బాటిల్లు, చేతి గాజు ముక్కలు ... ఎన్నో పనికిరాని వస్తువులను ఉపయోగించినారు.

చిత్ర కృప : Ranjithsiji

థ్రెడ్ గార్డెన్, మలంపూజ

థ్రెడ్ గార్డెన్, మలంపూజ

మలంపూజ లోని థ్రెడ్ గార్డెన్ కు లక్షలాది పర్యాటకులు వస్తారు. దీనిలో ఇతర తోటలవలేనే పూవులు మొక్కలు వుంటాయి. కాని అవన్నీ కూడా దారం తో తయారు చేయబడి వుంటాయి. ఇవన్నీ ఎంతో కష్టంతో చేతితో అల్లబడినవి. గ్లాస్ గదులలో అనేక రకాలపూవులు, మొక్కలు ప్రదర్శించబడతాయి.

చిత్ర కృప : telugu native planet

ఉడాన్ ఖటోల, మలంపూజ

ఉడాన్ ఖటోల, మలంపూజ

ఉడాన్ ఖటోల దక్షిణ భారత దేశంలో మొదటి రోప్ వే ప్రదేశం. ఈ రోప్ వే ని మలం పూజ గార్డెన్ లో 60 అడుగుల ఎత్తులో నిర్మించినారు. 600 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళ్ళి పర్వతాలను, అందమైన తోటలను చూసి ఆనందించవచ్చు. ఇలా సుమారు ఇరవై నిమిషాల పాటు ఆకాశం లో హాయిగా విహరించవచ్చు.

చిత్ర కృప : Ranjithsiji

తేన్ కురుస్సి , మలంపూజ

తేన్ కురుస్సి , మలంపూజ

తెన్ కురుస్సి గ్రామం దాని సహజ అందాలకు మరియు వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి గాంచింది. ఇది పాలక్కాడ్ కు సుమారు 10 కి.మీ. దూరంలో కలదు. తెన్ కురిస్సి నుండి ఒక గంట ప్రయాణించి నారింజ తోటలు, అనేక దేవాలయాలు కల నేల్లియంపతి ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. ఈ గ్రామం ప్రసిద్ధి గాంచిన తాయంకావు , ఎలామన్నం సంకరనరాయనన్ మరియు శివ దేవాయలాలు కలిగి ఉంది.

చిత్ర కృప : VS Ramachandran

స్నేక్ పార్క్, మలం పూజ

స్నేక్ పార్క్, మలం పూజ

మలంపూజ డాం కి, గార్డెన్ కి సమీపంలో వివిధ రకాల పాములు కలిగిన స్నేక్ పార్క్ ఉన్నది. అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నడుపబడే ఈ పార్క్ లో విషపాములు, విషం లేని పాములు చూడవచ్చు.

చిత్ర కృప : Ranjithsiji

పాలక్కాడ్ ఎలా చేరుకోవాలి ??

పాలక్కాడ్ ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

పాలక్కాడ్ లో ఎటువంటి విమానాశ్రయం లేదు కానీ, 68 కి. మీ. దూరంలో కిమ్బితోరె విమానాశ్రయం ఉన్నది. ఇక్కడి నుండి టాక్సీలు పట్టుకొని పాలక్కాడ్ చేరుకోవచ్చు. సమీపంలో కొచ్చి, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఉన్నాయి.

రైలు మార్గం

పాలక్కాడ్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. దీనిని ఒలవక్కొదె జంక్షన్ అని పిలుస్తారు. కేరళ యొక్క ఆన్ని నగరాలతో పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు కలకత్తా వంటి ప్రధాన నగరాలతో పాలక్కాడ్ రైల్వే లైన్ కలుపబడి ఉన్నది. ప్రయాణీకులు రైల్వే స్టేషన్ లో దిగి, 3 కి. మీ. దూరంలో ఉన్న పాలక్కాడ్ పట్టణానికి చేరుకోవడానికి ఆటోలు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పాలక్కాడ్ చక్కని రోడ్డు మార్గాన్ని కలిగి ఉన్నది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు ప్రేయివేట్ సంస్థలు కిమ్బితోరె, కొచ్చి, కాలికట్ మరియు త్రిస్సూర్ వంటి పట్టణాల నుండి బస్సులను ప్రతి రోజు నడుపుతుంది. తిరువనంతాపురం, చెన్నై మరియు బెంగళూరు నగరాల నుండి లగ్జరీ మరియు వోల్వా బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : VS Ramachandran

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more