Search
  • Follow NativePlanet
Share
» »ఈ కొండ కోనల్లో పర్యటకు ప్లాన్ చేసుకొందాం

ఈ కొండ కోనల్లో పర్యటకు ప్లాన్ చేసుకొందాం

తమిళనాడులోని కొన్ని ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు.

కనుచూపుమేర పచ్చదనం, పక్షుల కిలకిలరావాలు, ఏనుగుల ఘీంకారాలు, నెమళ్ల నాట్యాలు, కోయిలమ్మల పాటలు తదిర ప్రకతి అందాలన్నింటినీ ఆస్వాధించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇవన్నీ ఒకేచోట చూడాలంటే జూకు వెళ్లాల్సిందే. అయితే అక్కడ కూడా కత్రిమ వాతావరణంలో మాత్రమే మనం చూడటానికి వీలవుతుంది. అయితే సహజ వాతావరణంలో జంతువులను, పక్షులను చూడాలంటే మాత్రం అభయారణ్యాలకు వెళ్లాల్సిందే. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో అటువంటి అభయారణ్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైన అభయారణ్యాల గురించిన సమాచారం మీ కోసం...

అణ్ణామలై అభయారణ్యం

అణ్ణామలై అభయారణ్యం

P.C: You Tube

తమిళనాడులోని కొయంబత్తూరు నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంది. ఈ అణ్ణామలై అభయారణ్యాన్ని ఇందిరాగాంధీ అభయారణ్యం అని కూడా పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో సముద్రమట్టానికి దాదాపు 1,400 మీటర్ల ఎత్తులో ఉన్న అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 958 చదరపు కిలోమీటర్లు. ఈ అభయారణ్యం ఏనుగు, పులి, నల్లచిరుత వంటి జంతువులకు ఆవాసం కల్పిస్తోంది.

టాప్‌స్లిప్ అభయారణ్యం

టాప్‌స్లిప్ అభయారణ్యం

P.C: You Tube

ఈ అభయారణ్యం కొయంబత్తూరు నుంచి కేవలం 76 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అంతరించే స్థితికి చేరుకొన్న ఎన్నో రకాల పక్షిజాతులను సంరక్షిస్తున్నారు. అందువల్లే బర్డ్‌లవర్స్ ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి జీప్, ఎలిఫెంట్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ అభయారణ్యాన్ని సందర్శించవచ్చు.

అరిగ్నార్ అణ్ణా పార్క్

అరిగ్నార్ అణ్ణా పార్క్

P.C: You Tube

భారతదేశంలోని ముఖ్యమైన అభయారణ్యాల్లో అరిగ్నార్ అణ్ణా కూడా ఒకటి. ఇక్కడ జూ పార్క్ కూడా మనం చూడవచ్చు. అందువల్లే అరిగ్నార్ అణ్ణా జులాజికల్‌పార్క్ గా ప్రాచూర్యం చెందింది. దాదాపు 510 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అభయారణ్యం ఉంది. ఇక్కడ దాదాపు 170 జాతులకు చెందిన జంతు, పక్షులను మనం వీక్షించవచ్చు.

వేదాంత్కళ పక్షి సంరక్షణ కేంద్రం

వేదాంత్కళ పక్షి సంరక్షణ కేంద్రం

P.C: You Tube

భారతదేశంలోని పక్షి సంరక్షణ కేంద్రాల్లో వేదాంత్కళ పక్షి సంరక్షణ కేంద్రం అత్యంత ప్రాచీనమైనది. దీనికి దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అందువల్లే ఈ పక్షి సంరక్షణ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచూర్యం పొందింది. ఈ పక్షి సంరక్షణ కేంద్రంలో రెండు వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. ఈ పక్షి సంరక్షణకేంద్రం చెన్నై నుంచి దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తం 30 హెక్టార్ల విస్తీర్ణం.

మదుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

మదుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

P.C: You Tube

మదుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఊటి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా మైసూరు నుంచి 92 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మదుమలై వన్యప్రాణీ సంరక్షణ కేంద్రాన్ని చేరుకోవచ్చు. కర్నాటక, కేరళ సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కోసం కూడా ఎక్కువ మంది ముఖ్యంగా యువత ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ జీప్, ఎలిఫెంట్ సఫారీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ పులి, ఎలుగుబంటి, జింకలతో పాటు మరెన్నో రకాల జంతువులను చూడొచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X