Search
  • Follow NativePlanet
Share
» »కన్యలకు సద్బుద్ధిని అనుకూలుడైన భర్తను అనుగ్రహించే భద్ర మారుతి!

కన్యలకు సద్బుద్ధిని అనుకూలుడైన భర్తను అనుగ్రహించే భద్ర మారుతి!

హనుమంతుడు అనగానే అపారమైన భక్తి, పరాక్రమం ... అసమానమైన మేథస్సు ... విశ్వమంతటి వినయం గుర్తుకు వస్తాయి. ఒక భక్తుడు ఎలా ఉండాలో ... భగవంతుడు ఎలా ఉండాలో కూడా నిరూపించిన హనుమంతుడు, అనేక ప్రాంతాల్లో వివిధ నామాలతో ఆవిర్భవించాడు. భక్తాంజనేయుడుగా ... వీరాంజనేయుడుగా, వరాలఆంజేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా, మారుతిగా అభయాన్ని ప్రసాదిస్తూ వుండే స్వామి, ఎక్కడ చూసినా నుంచునే దర్శనమిస్తూ ఉంటాడు.

అయితే అందుకు పూర్తి విభిన్నంగా స్వామి వారు పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం కూడా ఉంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఈ విశిష్టమైన క్షేత్రం మహారాష్ట్రలోని మరాట్వాడా అనిపిలువబడే ఔరంగాబాద్ జిల్లా ప్రసిద్ధ ఎల్లోరాకి సుమారు 4కి.మీ దూరంలో 'ఖుల్తాబాద్'లో భద్రమారుతి టెంపుల్ ఉంది. మీరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ చూడని శయనిస్థితిలో ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఈ భద్రమారుతి ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

‘భద్రమారుతి’ గా

‘భద్రమారుతి’ గా

‘భద్రమారుతి' గా పిలవబడే ఇక్కడి హనుమంతుడిని స్వయంభువుగా చెబుతుంటారు. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడే కాసేపు పడుకుని సేదతీరాడని ఒక కథ ఉంది.

PC: YOUTUBE

అలాగే మరో కథనం ప్రకారం

అలాగే మరో కథనం ప్రకారం

అలాగే మరో కథనం ప్రకారం, పూర్వం భద్రావతీ నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ రాజుకు రాముడిపై ఉన్న అమిత భక్తితో శ్రీరాముడిని ఎప్పుడు భజనలతో, స్త్రోత్రాలతో తనను తాను మైమరిపోయి స్తుతించేవాడట.

PC: YOUTUBE

ఒక రోజు భద్రకూట్ అనే సరోవరం

ఒక రోజు భద్రకూట్ అనే సరోవరం

ఒక రోజు భద్రకూట్ అనే సరోవరం వద్ద భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా అది వినిన హనుమంతుడు అక్కడి వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయిన పడుకున్నాడట. తన్మయుడైన ఆంజనేయ స్వామి అక్కడే నిద్రపోయాడట.

PC: YOUTUBE

 లోక కళ్యాణం కొరకు

లోక కళ్యాణం కొరకు

చాలా సేపటి తర్వాత అది గమనించిన ఆ భక్తుడు, హనుమంతుడి పాదాలపై పడ్డాడు. లోక కళ్యాణం కొరకు, భక్తులను సదా అనుగ్రహించవలసినదిగా, కన్యలకు సద్బుద్ధిని అనుకూలుడైన భర్తను అనుగ్రహిస్తూ నీ భక్తులకు సకల శ్రేయస్సులు కలిగించవలసినదిగా నా విన్నపం ‘'అని ప్రార్ధించాడు .''తధాస్తు ‘'అన్నాడు మారుతి .

PC: YOUTUBE

భద్రసేన మహారాజు రామభక్తికి మెచ్చిన హనుమంతుడు

భద్రసేన మహారాజు రామభక్తికి మెచ్చిన హనుమంతుడు

భద్రసేన మహారాజు రామభక్తికి మెచ్చిన హనుమంతుడు అతని కోరిక మేరకు భద్ర సేన మహారాజుకు ఇచ్చిన మాట ప్రకారం మారుతి ఇక్కడే ‘'భద్ర మారుతి ‘'గా భావ సమాధి భంగిమలోనే ఉండి ,భక్తులకు సర్వ శుభ మంగళాలు చేకూరుస్తూ అనుగ్రహిస్తున్నాడు .. భద్ర మారుతిగా అక్కడే కొలువయ్యాడని పురాణ కథనం .

PC: YOUTUBE

శయన హనుమంతుడిగా

శయన హనుమంతుడిగా

ఆ కారణం చేతన స్వామి ఇక్కడ శయన హనుమంతుడిగా దర్శనమిస్తుంటాడు. విశాలమైన ప్రదేశంలో అద్భుతమైన నగిషీలతో ఈ ఆలయం అలరారుతుంటుంది.

PC: YOUTUBE

ఈ పురాతనకాలం నాటి ఆలయాన్ని ఎందరో రాజులు

ఈ పురాతనకాలం నాటి ఆలయాన్ని ఎందరో రాజులు

ఈ పురాతనకాలం నాటి ఆలయాన్ని ఎందరో రాజులు దర్శించి తరించినట్టు ఆధారాలున్నాయి. మహరాజుల నుండి మామూలు భక్తుల వరకూ అందరూ ఇక్కడి స్వామి మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే.

PC: YOUTUBE

 శ్రీరామాలయానికి అనువుగా ఒక చెరువు త్రవ్వించి

శ్రీరామాలయానికి అనువుగా ఒక చెరువు త్రవ్వించి

భద్ర రాజు ఇక్కడ ఉన్న శ్రీరామాలయానికి అనువుగా ఒక చెరువు త్రవ్వించి దానికి భద్ర కుండం అని పేరు పెట్టాడు. ఈ చెరువులో నిత్యం పవిత్ర స్నానం చేసిన తర్వాత శ్రీరామ భద్రుని దర్శించి పూజిస్తారు. అంతే కాదు అందమైన తన గారాల కూతురుకు భద్ర అని పేరు కూడా పెట్టుకోవడం వల్ల ఆ నగరానికి భద్రావతి అని పేరుకూడా వచ్చింది.

PC: YOUTUBE

శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని పూజించిన

శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని పూజించిన

ఇక్కడి శయన స్థితిలో ఉన్న హనుమంతుడిని పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

PC: YOUTUBE

దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో 4 మహారాష్ట్రలోనే ఉండటం విశేషం

దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో 4 మహారాష్ట్రలోనే ఉండటం విశేషం

దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో 4 మహారాష్ట్రలోనే ఉండటం విశేషం. అవే త్రయంబకేశ్వరం, ఘ్రుష్ణేశ్వరం ,నాగనాదేశ్వరం భీమ శంకరేశ్వరం .

PC: YOUTUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X