Search
  • Follow NativePlanet
Share
» » బులెట్ బాబా టెంపుల్ లో పూజించబడే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ !

బులెట్ బాబా టెంపుల్ లో పూజించబడే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ !

మనం ఇప్పటి వరకూ జంతువులను, మానవులను దేవుళ్ళుగా పూజించటం వినే వున్నాం. అయితే, ఇపుడు ఒక ఆసక్తికర టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ లో రాయల్ ఎం ఫీల్డ్ బులెట్ బైక్ పూజించబడుతుంది. ఈ టెంపుల్ రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. రాజస్థాన్ లోని చోటిలా అనే చిన్న గ్రామంలో జోద్ పూర్ నగరానికి సుమారు 50 కి. మీ. ల దూరంలో కలదు. బులెట్ బాబా టెంపుల్ వెనుక గల రహస్యం ఏమిటి ?

 బులెట్ బాబా టెంపుల్ లో పూజించబడే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ !

Photo Courtesy: Sentiments777

ఈ బులెట్ దేవత రోడ్ ఆక్సిడెంట్ ల నుండి కాపాడుతుందని చెపుతారు. ఈ గ్రామస్తులు ఇంతగా ఇక్కడ గుడిలో కల బులెట్ బైక్ దేముడిని పూజిస్తారు. బైక్ లను నడిపేటపుడు ఈ బులెట్ దేవత తమను దుర్ఘటనల బారిని పడకుండా రక్షిస్తుందని నమ్ముతారు. ఇదే కారణంగా, డ్రైవర్ లు తాము జర్నీ ప్రారంభించేముందు, ఒక బాటిల్ లిక్కర్ గూడా ఈ గుడిలో నైవేద్యం పెడతారు. ఈ చర్య వారిని సేఫ్ గా గమ్య స్థానం చేరుస్తుందని నమ్ముతారు.

 బులెట్ బాబా టెంపుల్ లో పూజించబడే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ !

Photo Courtesy: Sentiments777

ఈ దేముడికి నైవేద్యం పెట్టె సమయంలో వాహాన దారులు తమ వాహనాల హార్న్ లను విపరీతంగా శబ్దం చేస్తారు. ఈ చర్య మూఢ నమ్మకం అని భావించినప్పటికీ, ఇక్కడ ఈ రకమైన పూజలు చేయకుండా గుడి ముందు నుండి ప్రయాణించిన వారికి ఆక్సిడెంట్ లు జరిగిన సంఘటనలు ఎన్నో కలవు.

ఇక్కడ పెట్టిన బైక్ కు గల చరిత్ర ఏమంటే, ఈ బైక్ చోటిలా గ్రామంలో బాగా పలుకు బడి కల కుటుంబం నుండి వచ్చిన ఓం సింగ్ రాదోర్ కు చెందినది. 1988 లో జరిగిన ఒక ఆక్సిడెంట్ లో రాదోర్ ఈ బైక్ ను ఒక చెట్టుకు డీ కొట్టాడు. ఆయన అక్కడి క్కక్కడే మరణించాడు. బైక్ ఒక గోతిలో పడగా, స్థానిక పోలీస్ లు దానిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది. పోలీస్ స్టేషన్ కు తెచ్చిన ఈ బైక్ మరుసటి రోజు చూస్తె, మరోసారి గోతిలో ప్రత్యక్షం అయ్యింది. పోలీస్ స్టేషన్ కు తెచ్చినపుడు, పోలీస్ లు ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ చేసి ఒక చైన్ వేసి లాక్ చేసినప్పటికీ అది కదలి వచ్చింది. ఆక్సిడెంట్ స్పాట్ కు చేరింది.

 బులెట్ బాబా టెంపుల్ లో పూజించబడే ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ !

Photo Courtesy: Sentiments777

దీనిని ఒక పెద్ద మిస్టరీ గా భావించిన పోలీస్ లు ఆ బైక్ ను కుటుంబ సభ్యులకు అందించారు. ఫ్యామిలీ ఆ బైక్ ను గుజరాత్ లోని ఒక వ్యక్తికి అమ్మింది. అయినప్పటికీ ఆ బైక్ గుజరాత్ నుండి ప్రయాణించి, మరోమారు ఆక్సిడెంట్ స్పాట్ కు చేరింది. ఈ రకమైన అనేక మహిమలు ఆ బైక్ కు మానవా తీత శక్తులు వున్నట్లు తెలిపాయి. ఇక చేసిది ఏమీ లేక ఆ గ్రామస్తులు ఆ బైక్ ను ఒక నిర్జన ప్రదేశంలో వుంచి టెంపుల్ కట్టి పూజలు చేయటం మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X