• Follow NativePlanet
Share
» » చలా ‘మని’లోని ఈ ‘కళావిపంచి’గురించి తెలుసా

చలా ‘మని’లోని ఈ ‘కళావిపంచి’గురించి తెలుసా

Written By: Kishore

కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్కెట్ లోకి నూతన రూపంలో ఉన్న నోట్లను విడుదల చేస్తోంది. నల్లధనం అరికట్టడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకువచ్చే నోట్ల పై కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు కూడా ముద్రిస్తున్నారు. తద్వారా ప్రస్తుత, రాబోయే తరానికి ఆయా ప్రాంతాల గొప్పతనం తెలియజేయాలని ప్రభుత్వ భావన. అంతేకాకుండా ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడం వల్ల భారత దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఆయా ప్రాంతాలు ఈ విధంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం వల్ల స్థానికంగా పర్యాటక రంగం పుంజుకొని అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన 200 నోటు పై సాంచి స్థూపాన్ని ముద్రించింది. ఈ స్థూపం విశేషాలు మీ కోసం....

ఇక్కడ శ్రీరంగనాథుడి పక్కన లక్ష్మీ దేవి కాక ఎవరు కొలువై ఉన్నారో తెలుసా?

రెండు రోజుల్లో అక్కడి అందాలను ఆస్వాధించి రావచ్చు.

ఐటీ నగరిలోనూ ఆధ్యాత్మిక గుభాళింపులు

1. మధ్యప్రదేశ్ లోని సాంచి

1. మధ్యప్రదేశ్ లోని సాంచి

Image Source:

ఇక్కడ కనిపిస్తున్నది మధ్య ప్రదేశ్ లోని సాంచి స్తూపం. మధ్య ప్రదేశ్ లోని రాయ్ సేన్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం సాంచి. పేరుకు చిన్నగ్రామమే అయినా ఇక్కడ అనేక బౌద్ధ స్మారకాలు ఉన్నాయి. దీనిని మౌర్యుల కాలంలో ఈ గ్రామం అత్యంత ఉచ్చస్థితిలో ఉండేదని చరిత్ర చెబుతోంది.

2. ప్రముఖ పర్యాటక కేంద్రం

2. ప్రముఖ పర్యాటక కేంద్రం

Image Source:

క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 శతాబ్దం వరకూ ఇక్కడ స్తూపాలు, మఠాలు, దేవాలయాలు నిర్మించారు. ఇక్కడ బౌద్దులకు, హిందువులకు, జైనులకు సంబంధించిన స్మారకాలు, మఠాలు ఉన్నాయి. దీంతో దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే మిగిలిన మతాలతో పోలిస్తే ఇక్కడ బౌద్ధ ధర్మం బాగా విరిసిల్లిందని ఇక్కడ ఉన్న కట్టడాల వల్ల తెలుస్తుంది. ఇక సాంచిలోని స్తూపం కేంద్ర భాగంలో అర్థగోళాకారంలో ఉంటుంది. దీనిని ఇటుకలతో నిర్మించారు. దీని మధ్యభాగంలోనే బుద్ధుడి అస్తికలను ఉంచారు.

3. అప్పట్లో వర్తక కేంద్రం

3. అప్పట్లో వర్తక కేంద్రం

Image Source:

పూర్వం సాంచిని విదిశాగిరి అని పిలిచేవారు. అప్పట్లో ఇది ప్రముఖ వర్తక కేంద్రంగా విరాజిల్లుతూ ఉండేది. కాలక్రమేణ బౌద్ధ స్మారకాలు ఇక్కడ ఏర్పడ్డాయి. ఈ స్మారకాలను అప్పటి చక్రవర్తుల కంటే స్థానిక వర్తకులు, ప్రజలే విరాళాలు సేకరించి నిర్మింపజేశారు. ముఖ్యంగా ఎవరైనా కొంత సొమ్మును ఇచ్చి బుద్ధిని జీవితంలోని ఏ ఘట్టానైనా ఈ స్మారకాల పై చెక్కించుకోవచ్చు. దీని కింద వారి పేరు కూడా చెక్కే వారు. అందువల్లే ఇక్కడ స్థూపాల్లో అప్పట్లో వాడుక భాష అయిన పాళీ భాషలో కూడా వ్యక్తుల పేర్లను చూడవచ్చు.

4. అశోక చక్రవర్తి ప్రేమ కావ్యానికి చిహ్నం

4. అశోక చక్రవర్తి ప్రేమ కావ్యానికి చిహ్నం

Image Source:

పూర్వం సాంచిలో దేవి అనే ఒక అందమైన మహిళ ఉండేది. ఈ మహిళను అశోక చక్రవర్తి ప్రేమిస్తారు. వారి వివాహం కూడా ఇక్కడే జరిగిందని చెబుతారు. వారి ప్రేమ కావ్యాన్ని కూడా ఇక్కడ ఉన్నటు వంటి కట్టడాల పై చెక్కించారని చరిత్ర తెలియజేస్తుంది.

5.ఎప్పుడు బయటి ప్రపంచానికి తెలిసింది

5.ఎప్పుడు బయటి ప్రపంచానికి తెలిసింది

Image Source:

1818లో పురాతన శాస్త్రవేత్తలు శ్రమ ఫలితంగా సాంచిలోని స్థూపం, స్మారకాలు, ఇతర కట్టడాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. సాంచిలోని ప్రవేశ ద్వారం మొదలుకొని అన్ని కట్టడాలు భారతీయ వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మించబడినవని చెబుతారు. ఇక్కడ చూడదగిన వాటిలో బౌద్ధ విహారం, సాంచి స్థూపం చుట్టూ ఉన్న నాలుగు ప్రధాన ద్వారాలు, మ్యూజియం, ది గ్రేట్ బౌల్, గుప్త దేవాలయం, అశోక స్తంభం ముఖ్యమైనవి.

6. ఇక్కడకు ఎలా చేరుకోవాలి?

6. ఇక్కడకు ఎలా చేరుకోవాలి?

Image Source:

భోపాల్ లోని రాజ భోజ్ విమానాశ్రయం సాంచికి దగ్గరగా ఉంటుంది. విమానాశ్రయం నుంచి సాంచికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా నేరుగా సాంచికి వెళ్లవచ్చు. అదే విధంగా భోపాల్ లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. సాంచిలో అప్పుడప్పుడు ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లో ఉన్న బౌద్ధ మత గురువులు ఇక్కడకు వస్తుంటారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి