Search
  • Follow NativePlanet
Share
» »జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!

జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!

జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!

భారతదేశం భిన్నత్వానికి ప్రసిద్ధి చెందిన నేల‌. జీవ‌న‌శైలి, సంస్కృతి, భాష మరియు మతాలకు సంబంధించిన‌ అన్ని అంశాలలో మన దేశం అత్యంత వైవిధ్యమైన వాతావరణాలను క‌లిగి ఉంది. దేశంలో అనేక ప్రపంచ మతాలకు ప్రముఖ స్థానం క‌ల్పించ‌బ‌డింది. వాటిలో ఒకటి బౌద్ధమతం. ఒడిశా బౌద్ధమతానికి జన్మస్థలం కావడంతో, దాని సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ మత ప్రభావం యొక్క అవశేషాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు.

బౌద్ధమతం దక్షిణ భారతదేశంలోని ఈ భాగంలో రెండు వేల‌ సంవత్సరాలకు పైగా ఉందని చెప్పబడింది. అనేక బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఈనాటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఇవి ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా ప్ర‌సిద్ధిగాంచాయి. అలాంటి క్ష‌ణాల‌ను అనుభవించడానికి ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన నాలుగు బౌద్ధ వారసత్వ ప్రదేశాలను ప‌ల‌క‌రిద్దాం.

సాలిహుండం

సాలిహుండం

జ్ఞానోదయ యాత్ర కోసం ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించడానికి శ్రీ‌కాకుళం జిల్లా వంశధార నదికి దక్షిణ ఒడ్డుకు కుడివైపున ఉన్న సాలిహుండం ప్ర‌ధాన‌మైన‌ది. ఎత్త‌యిన‌ కొండపైన కొలువైన సాలిహుండం వద్ద కనిపించే అవశేషాలు రెండ‌వ శతాబ్దం నాటివి కావచ్చని అంచ‌నా. ఈ స్థలాన్ని 1919లో గిగుడు వెంకట రామ మూర్తి కనుగొన్నారు. సాలిహుండం అనేక శతాబ్దాలుగా ఉనికిలో ఉంది. బౌద్ధమతంలో కాలక్రమేణా జ‌రిగిన వివిధ దశలను ఈ ప్రాంతం చూపుతుంది. ప్రవేశ ద్వారం వద్ద ఒక మ్యూజియం ఉంది. ఇందులో అనేక కళాఖండాలను భ‌ద్ర‌ప‌ర‌చారు. సాలిహుండానికి సమీపంగా ఉన్న‌ ప్రధాన నగరం వైజాగ్. ఇది 139 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గుంటుపల్లి

గుంటుపల్లి

కృష్ణా జిల్లాల‌కు చెందిన గుంటుపల్లి వద్ద ఉన్న గుహలోని స్మారక చిహ్నాలు మహారాష్ట్రలోని అజంతా మరియు ఎల్లోరా గుహల కంటే పూర్వపు నిర్మాణాలుగా చ‌రిత్ర‌కారులు భావిస్తున్నారు. ఇక్క‌డి రాక్-కట్ ఆలయం రెండ‌వ లేదా మూడ‌వ శతాబ్దం నాటిది. ప్రసిద్ధ భారతీయ తత్వవేత్తలు ఈ గుహలలో ధ్యానం చేయడానికి గణనీయమైన సమయం గడిపినట్లు చెబుతారు. ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల గుర్తించాల్సిన బౌద్ధ అవ‌శేషాలు చాలా ఉన్నాయని స్థానికుల విశ్వాసం. గుంటుపల్లికి సమీప పెద్ద నగరం విజయవాడ. ఇది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కొత్తూరు

కొత్తూరు

విశాఖలోని య‌ల‌మంచిలి స‌మీపంలోని కొత్తూరులో స్థూపాలు మరియు రాతి గుహ రెండూ ఉన్నాయి. ఇవి శారదా నది ఒడ్డున ఉన్నాయి. నేటికీ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నందున ఈ స్థలం గురించి ఇంకా చాలా విష‌యాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న రాతి గుహలను బౌద్ధ సన్యాసులు ఒక‌ట‌వ శతాబ్దం నాటికే ఉపయోగించారని నమ్ముతారు. కొత్తూరుకు అతి సమీపంలో ఉన్న ప్రధాన నగరం వైజాగ్. ఇది 179 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అమరావతి

అమరావతి

ఈ ప్రదేశంలో ఉన్న స్థూపం మరియు మఠం నిజానికి అశోకుని పాలనలో నిర్మించబడ్డాయి. బౌద్ధుల తీర్థయాత్ర మరియు పవిత్ర అభ్యాసం కోసం ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనదిగా ప‌రిగ‌ణించ‌బ‌డిన‌ట్ల చారిత్ర‌క ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రదేశం నుండి చాలా కళాఖండాలు భారతదేశం నుంచి బ్రిటన్‌లోని మ్యూజియంలకు తరలించబడ్డాయి. అమరావతికి అతి సమీపంలో ఉన్న పెద్ద నగరం విజయవాడ. ఇది ఇక్క‌డ‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Read more about: salihundam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X