Search
  • Follow NativePlanet
Share
» »ముంబాయ్ లో చౌపట్టి బీచ్ లో చాట్, పుల్లపుల్లగా మామిడికాయ్ తింటుంటే ఆ మజాయే వేరు

ముంబాయ్ లో చౌపట్టి బీచ్ లో చాట్, పుల్లపుల్లగా మామిడికాయ్ తింటుంటే ఆ మజాయే వేరు

ముంబై నగరం పేరు చెప్పగానే ఫ్యాషన్లు, బిజీగా వుండే జీవన విధానం గుర్తుకొస్తాయి. ఆ వెంటనే బాలీవుడ్ సినిమాలు, ప్రసిద్ధ నటీ నటులు కూడా గుర్తుకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రపంచానికి అమెరికా దేశం కల వలే ఎలా ఉంటుందో, భారత దేశానికి ముంబై అలాగుంటుంది. ముంబై నగర ప్రాధాన్యతలు వివరించాలంటే అక్కడకల వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాలు మరియు అక్కడి ప్రజల మతపర పూజలు మరియు స్ధానికంగా లభించే అనేక రకాల ఆహారాలు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి.

ముంబై నగరం దేశంలోని వివిధ ప్రాంతాలకు రోడ్డు, రైలు, సముద్రం మరియు విమాన మార్గాలద్వారా కలుపబడి ఉంది. మీరు ముంబై నగరం చేరుకోగానే ఆ నగర వేష భాషలు దేశంలోని ఇతర ప్రాంతాలకంటే విభిన్నంగా ఉండటాన్ని గమనిస్తారు. ప్రతి ఒక్కరూ ఎంతో స్నేహ పూరితంగా ఉంటారు. ఒక రకమైన క్రమశిక్షణ ప్రతి అంశంలోను అంటే జనసమ్మర్ద వీధులలో టాక్సీలు సంచరించడం దగ్గరనుండి విమానాశ్రయాలలో విమానాలు విహరించటం వరకు ఎంతో పద్ధతిగా సాగిపోతూంటుంది. ముంబైనగరం ఇంతవరకు భారత దేశంలో ఒక విశిష్ట పర్యాటక ప్రదేశంగా పర్యాటకులచే గుర్తించబడుతోంది.

ముంబై నగరంలో మీకు అన్నీ లభ్యమవుతాయి.

ముంబై నగరంలో మీకు అన్నీ లభ్యమవుతాయి.

ముంబై నగరంలో మీకు అన్నీ లభ్యమవుతాయి. తినే ఆహారాలు, షాపింగ్ నుండి సైట్ సీయింగ్ నుండి ఎంతో ఘనంగా చెప్పుకునే రాత్రి జీవిత విధానాలవరకు మీకు ఈ నగరం అందిస్తుంది. నగరం అందించే అనేక ప్రసిద్ధ బ్రాండు వస్తువులే కాక మీరు ఫ్యాషన్ స్ట్రీట్ లోను మరియు బంద్రాలోని లింకింగ్ రోడ్ లోను రోడ్ సైడ్ షాపింగులు చేసి ఆనందించవచ్చు. ఎండవేళ మధ్యాహ్నాలు బీచ్ లలో ఆనందించవచ్చు. పిక్ నిక్ లు పెట్టుకోవచ్చు.

బీచ్ లలోని ఆహారాలు సిగ్నేచర్ శాండ్ విచ్ లు

బీచ్ లలోని ఆహారాలు సిగ్నేచర్ శాండ్ విచ్ లు

బీచ్ లలోని ఆహారాలు సిగ్నేచర్ శాండ్ విచ్ లు, కుల్ఫి, ఫలూదా, పానీ పూరి లేదా మహారాష్ట్ర స్వంత వంటకం వడా పావు వంటివి వివిధ రకాలుగా తినవచ్చు. ముంబైలో మొత్తంగా 3 ప్రధాన బీచ్ లు కలవు. జుహూ బీచ్, చౌపట్టీ మరియు గొరాయ్. ప్రకృతి అంటే ఇష్టపడేవారికి అధిక జనాలు ఇష్టపడని వారికి గోరాయ్ బీచ్ మంచి ఆనందం ఇస్తుంది.మీ వద్ద కనుక ఒక స్వంత రవాణా వాహనం, కారు లేదా స్కూటర్ వంటివి ఉన్నంతవరకు ముంబై నగరాన్ని ఎంతో సౌకర్యంగా చుట్టిరావచ్చు.

ముంబైనగర నడిబొడ్డున చౌపట్టి బీచ్ స్థానికులకు అత్యంత ఇష్టమైన బీచ్

ముంబైనగర నడిబొడ్డున చౌపట్టి బీచ్ స్థానికులకు అత్యంత ఇష్టమైన బీచ్

ఇక అలాగే ముంబైనగర నడిబొడ్డున చౌపట్టి బీచ్ స్థానికులకు అత్యంత ఇష్టమైన బీచ్ ఇది. ఈ బీచ్ స్థానికి వంటకాలకు ప్రసిద్ది చెందినది. చౌపట్టి బీచ్ ను ఎక్కువ మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ సముద్ర తీరంన అద్భుతమైన సూర్యాస్థమయం చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ బీచ్ లో విశ్రాంతి పొందడానికి అనువైనది. చాలా మంది సందర్శకులు సాయంత్రంలో ఈ బీచ్ ను సందర్శిస్తుంటారు. ఈ బీచ్ ను సందర్శించడానికి అన్ని వయస్సుల వారు వస్తుంటారు.

రాత్రి సమయంలో ఈ బీచ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది

రాత్రి సమయంలో ఈ బీచ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది

రాత్రి సమయంలో ఈ బీచ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సముద్ర తీరాన బొమ్మలు మరియు కారంగా పచ్చి మామిడికాయలు , వేయించిన వేరుశెనగలు మరియు వివిధ రకాల చాట్స్ స్థానికులు విక్రయిస్తుంటారు. ముంబాయ్ ని సందర్శించే పర్యాటకులు ఈ బీచ్ ను తప్పక సందర్శించి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆశ్వాదించవచ్చు. ఈ బీచ్ ను సందర్శించడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇక్కడు వస్తుంటారు.

బీచ్ లో కోతులు నృత్యం చేయడం

బీచ్ లో కోతులు నృత్యం చేయడం

బీచ్ లో కోతులు నృత్యం చేయడం బీచ్ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాగే ఈ ప్రదేశంలో జ్యోతిష్కుడు చూడవచ్చు. ఇక్కడ ఒంటె మరియు గుర్రపు స్వారీలను ఆనందిస్తారు. ఈ బీచ్ యోగా మరియు జాగింగ్ చేసేవారికి సరైన స్థలం. పిల్లలు ఆహ్లాదకరంగా గడపడానికి మంచి ప్రదేశం . ఈ అద్భుతమైన బీచ్ లో కొన్ని సార్లు సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా కనబడుతుంది.

ఈ బీచ్ కు రోజులో ఏ సమయంలో అయినా సందర్శించవచ్చు.

ఈ బీచ్ కు రోజులో ఏ సమయంలో అయినా సందర్శించవచ్చు.

ఈ బీచ్ కు రోజులో ఏ సమయంలో అయినా సందర్శించవచ్చు. ఉదయం పర్యాటకులు ఉండరు కానీ, చాలా మంది సందర్శకులు సాయంత్రం వస్తారు. వర్షాకాలంలో అధిక తరంగాలను మరియు నీటి స్థాయిల కారణంగా వర్షాకాలంలో ఈ బీచ్ ను సందర్శించడం మంచిది కాదు. ఆ సమయంలో ఈ బీచ్ ప్రమాదకరమైనది. చౌపట్టీ బీచ్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ వరకు మంచిగా ఉంటుంది.

గణేష చతుర్థి సమయంలో

గణేష చతుర్థి సమయంలో

గణేష చతుర్థి సమయంలో ఈ బీచ్ చాలా సందడిగ ఉంటుంది. ఈ బీచ్ లో గణేష్ నిమజ్జనానికి ప్రసిద్ది చెందినది. ముంబాయ్ నగరంలో ఈ బీచ్ లో గణేష విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సమయంలో చూడటానికి ఇక్కడ చాలా విభిన్నగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

చౌపట్టీ బీచ్ వివిధ మార్గాల ద్వారా అనుసందానించబడినది. బీచ్ చేరుకోవడానికి ఆటో లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. సులభంగా అద్దెకు దొరుకుతాయి. అనేక స్థానిక బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి, చౌపట్టీ బీచ్ సమీపంలో రైల్వేస్టేషన్ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X