Search
  • Follow NativePlanet
Share
» »అంతరించే స్థితికి చేరుకొన్న ఈ జంతువులను ఇప్పుడే చూద్దాం

అంతరించే స్థితికి చేరుకొన్న ఈ జంతువులను ఇప్పుడే చూద్దాం

By Gayatri Devupalli

భారతదేశంవైపుగా ఉన్న హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు స్వేచ్ఛయుతంగా తిరుగాడే, అరుదైన వన్యప్రాణులకు ఆవాసాలు. వన్యప్రాణి మన గ్రహం యొక్క అందంకు దోహదం చేయదు, కానీ పర్యావరణ సమతుల్యతను కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వన్యప్రాణులు భూమికి వన్నెలద్దటమే కాక , పర్యావరణ సమతుల్యతను కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ, అనేక మానవ తప్పిదాల కారణంగా, ప్రతి సంవత్సరం, వన్యప్రాణుల సంఖ్య వేగంగా క్షీణిస్తుంది.

అయితే భారతదేశం అంతటా అనేక వన్యప్రాణి అభయారణ్యాలు, జీవావరణ రిజర్వులు, జాతీయ ఉద్యానవనాలు, పరిరక్షణ ప్రాంతాలు, రిజర్వ్డ్ మరియు రక్షిత ప్రాంతాలు మరియు అడవులు ఉన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకంగా, తమకే సొంతమైన ప్రకృతి శోభ మరియు పర్యావరణంతో, అరుదైన వృక్ష మరియు జంతు జాతులకు ఆలవాలంగా ఉంటూ, మన దేశ సహజ సౌందర్యానికి మరియు జీవజంతు వైవిధ్యానికి గొప్పతనాన్ని వన్నె తెస్తున్నాయి.

వీటిలో కొన్ని ప్రదేశాలలో, చాలా వరకూ ప్రపంచంలో అంతరించిపోతున్న వృక్ష జంతు జాతులు మనకు దర్శనమిస్తాయి. అంతరించిపోయే ప్రమాదమున్న, కొన్ని అరుదైన జంతువులు మరియు అవి భారతదేశంలోని ఏ ప్రదేశంలో కనుగొనవచ్చో తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

లడఖ్ లోని మంచు చిరుత

లడఖ్ లోని మంచు చిరుత

P.C: You Tube

లడఖ్ అనగా ‘ఎత్తైన పర్వత రహదారి ప్రాంతాల భూమి' అని అర్ధం. పేరుకు తగ్గట్టు, హిమాలయాల యొక్క ఈ అద్భుతమైన భూభాగం, మంచు చిరుతలకు సరిగ్గా సరిపోతుంది, ఇవి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత త్వరగా అంతరించిపోయే ప్రమాదమున్న జీవజాతులలో ఒకటి. లడఖ్ ఇంకా మరెన్నో అనూహ్యమైన మరియు అస్పృశ్య రాతి మరియు పర్వతాలతో కూడిన భూభాగ ప్రాంతాలను కలిగి ఉంది. ఇక్కడి గడ్డకట్టించే చలి, మంచు చిరుత మనుగడకు అనుకూలమైన పరిస్థితులను కలుగజేస్తుంది. ఈ అపురూపమైన జంతువును చూడలనుకునేవారికి, లడఖ్ లోని హేమిస్ నేషనల్ పార్కు ఆ అవకాశం కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ లు, భారతదేశంలో మంచు చిరుతలు కలిగి ఉన్న ఇతర ప్రాంతాలు.

అరుణాచల్ ప్రదేశ్ లోని రెడ్ పాండా

అరుణాచల్ ప్రదేశ్ లోని రెడ్ పాండా

P.C: You Tube

భారతదేశంలో ప్రకృతి రమణీయతకు, జీవ వైవిధ్యానికి పేరుగాంచిన అరుణాచల్ ప్రదేశ్ ( అంటే 'సూర్యుడి యొక్క భూమి') తక్కువగా సందర్శించబడే రాష్ట్రం. అందమైన 'ఏడు తోబుట్టు రాష్టాలలో' అతిపెద్దదైన అరుణాచల్ ప్రదేశ్ ను 'భారతదేశం యొక్క ఆర్కిడ్ రాష్ట్రం' అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమూల్య వృక్ష మరియు జంతు సంపద ఉన్నందున, ఇది జీవశాస్త్రవేత్తలు మరియు వృక్షశాస్త్రజ్ఞులకు ఒక స్వర్గధామం.అనేక ఆదిమ జాతులకు, అత్యుత్తమ వన్యప్రాణులకు, మానవ జోక్యం లేని భూములకు నెలవైన అరుణాచల్ ప్రదేశ్ ఒక భూతల స్వర్గం. కొట్టొచ్చే జీవవైవిధ్యత, సమతల ఉష్ణోగ్రత, ఎత్తైన దేవదారు మరియు వెదురు అరణ్యాలు ఉండటం వలన, అరుణాచల్ ప్రదేశ్ లోయలు ఇంకొక ప్రపంచంలోనే అరుదైన జంతుజాతి అయిన ఎర్ర పాండా అవాసానికి అనుకూలంగా మారాయి. పాండాకు దగ్గరి బంధువైన ఈ చిన్ని జంతువు, ఎర్రటి గోధుమ రంగు బొచ్చుతో, పెద్ద తోకతో చూపుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

కేరళలోని లయన్-టైల్డ్ మాకాక్

కేరళలోని లయన్-టైల్డ్ మాకాక్

P.C: You Tube

భారతదేశ పశ్చిమ కనుమలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశం మరియు ప్రపంచంలోనే ఖ్యాతి గాంచిన ఎనిమిది ప్రఖ్యాత జీవవైవిధ్య ప్రదేశాల్లో ఒకటి. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో జోగ్ జలపాతాలు, షోలా అడవులు, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, పెరియార్ టైగర్ రిజర్వ్ మరియు అనేక అస్పృశ్య భూములు, బయటపడని జలపాతాలు, దట్టమైన అరణ్యాలు మొదలైన వాటిలో అరుదైన వృక్షజాలం మరియు జంతుజాలం ​​కలిగిన ప్రదేశాలుగా కీర్తి గడించాయి. నీలగిరి కొండలలో ఉన్న సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, వన్యప్రాణి సంపదకు పేరుగాంచిన ప్రాచీనమైన ప్రాంతం. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న సైలెంట్ వ్యాలీలో లయన్-టైల్డ్ మాకాక్ లేదా వండరూ యొక్క అతి పెద్ద జనాభా ఉంది. ఇవి అరుదైన మరియు అంతరించిపోయే ప్రమాదమున్న జీవ జాతుల జాబితాలోని ప్రాణులు. కేరళ కాకుండా, ఈ అరుదైన జంతువులు కర్ణాటక మరియు తమిళనాడు యొక్క పశ్చిమ కనుమలలో మాత్రమే కనిపిస్తాయి.

గుజరాత్లోని ఆసియా సింహం

గుజరాత్లోని ఆసియా సింహం

P.C: You Tube

భారత జాతిపిత, మహాత్మాగాంధీ యొక్క జన్మభూమి అయిన గుజరాత్ ను ముద్దుగా ‘పురాణములు మరియు సింహాల భూమి' అని పిలుచుకుంటారు. చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలలో ప్రసిద్ధికెక్కిన గుజరాత్లో, సింధు నాగరికత వెలసిల్లిన ప్రదేశాలతో పాటు అనేక అద్భుతమైన పురాతన మరియు చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం రుచికరమైన వంటకాలు, వైభవోపేతంగా జరిగే పండుగలు మరియు స్నేహపూర్వక ప్రజలకు ప్రసిద్ధి చెందింది. గుజరాత్ లోని గిర్ అడవులు, సాసన్-గిర్ అని కూడా పిలువబడతాయి. ఆసియా సింహాలు కనపడే ఏకైక ప్రదేశం ఇదే.

మధ్యప్రదేశ్ లోని రాయల్ బెంగాల్ టైగర్

మధ్యప్రదేశ్ లోని రాయల్ బెంగాల్ టైగర్

P.C: You Tube

‘భారతదేశపు హృదయం'గా పేరుగాంచిన మధ్యప్రదేశ్, దేశం యొక్క ఘనమైన గతచరిత్రకు మైలురాయి. మధ్యప్రదేశ్ భూభాగంలో 30% కంటే ఎక్కువ భాగం దట్టమైన అడవులతో నిండి ఉన్నాయి కనుక ఇది వన్యప్రాణుల ఆవాసానికి మరియు సంరక్షణకు చాలా అనువైనది. సహజ ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న మధ్యప్రదేశ్ లోనే, అతిపెద్ద వజ్రాల నిల్వలు పన్నా వద్ద ఉన్నాయి. ఖజురహో, సాంచి స్థూపం, భీంబెట్కా రాక్ షెల్టర్స్ వంటి పలు ప్రముఖ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మరియు ప్రసిద్ధ దేవాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more