Search
  • Follow NativePlanet
Share
» »రోజుకి 77కిలోల బంగారాన్నిచ్చే శమంతకమణి ఎక్కడుందో తెలుసా?

రోజుకి 77కిలోల బంగారాన్నిచ్చే శమంతకమణి ఎక్కడుందో తెలుసా?

By Venkatakarunasri

ప్రతి సంవత్సరం జరిగే వినాయనకచవితి పూజలో శమంతకమణి కధ చాలా ముఖ్యమైనది.ద్వాపరయుగంలో ఈ శమంతకమణి వల్ల కృష్ణుడు పడ్డ నిందలు, ఆ మణియొక్క మహత్యం గురించి మనందరికీ తెలిసిందే.అయితే మనలో చాలామందికి ఆ శమంతకమణి ఎలా వచ్చింది? అది ఆఖరికి ఏమైంది?దాని వల్ల ఎంత లాభం జరిగింది?ఎంత నష్టం జరిగింది? శ్రీకృష్ణుడు ఎన్ని బాధలు పడ్డాడు?లాంటి విషయాలు తెలియదనే చెప్పాలి.మీకు తెలియని ఆ విషయాలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి మిస్టరీ తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి ద్వాపరయుగంనాటి చరిత్రను తరచి చూడాల్సిందే.యదువంశపు రాజైన సత్రాజిత్తు సూర్యభగవానుని ప్రార్థించగా,ఆ ప్రార్థనకు సంతోషించిన సూర్యభగవానుడు సత్రాజిత్తు ముందు ప్రత్యక్షమై,ఏ వరం కావాలో కోరుకోమనగా,సూర్యుడివద్ద నుంచి వచ్చే మహత్తరమైన కాంతికి సత్రాజిత్తు కళ్ళు బయర్లుకమ్మాయి.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

దాంతో ఆ యదురాజు నేను మీ మహత్త కాంతివల్ల సరిగ్గా చూడలేకపోతున్నానని కావున మీరు మీ కాంతిని తగ్గించుకోవాలని కోరగా దాంతో సూర్యభగవానుడు తన మెడలోవున్న శమంతకమణినితీసి పక్కన బెట్టాడు.ఆ మణి ధగధగలను చూసి ఆశ్చర్యపోయిన సత్రాజిత్తు అది తనకు వరంగా కావాలని కోరగా దానికి సూర్యభగవానుడు తగు జాగ్రత్తలు చెప్పి మణిని వరంగా ఇచ్చాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

దాన్ని కంఠానికి అలంకరించుకుని ద్వారకానగరంలోకి అతివేగంగా వస్తున్న సత్రాజిత్తును చూసి పురజనులందరూ ఆ మణికాంతివల్ల సూర్యభగవానుడే వస్తున్నాడేమోనని భ్రాంతిచెందారు.కొద్దిదూరం తర్వాత వచ్చినది సత్రాజిత్తని అతని మెడలో దివ్యమైన కాంతిని వెదజల్లుతూ ఎర్రని మాంసపుముద్దవలె వున్నది శమంతకమణని అది రోజుకి 77కిలోల బంగారాన్ని ఇస్తుందని తెలుసుకున్నారు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఈ సంఘటన తర్వాత కృష్ణుడు శమంతకమణిని అడగటం దానికి సత్రాజిత్తు నిరాకరించటం,ఆ హారాన్ని ధరించి వేటకు వెళ్లి,ప్రసేనుడు చనిపోవటం ఆ నిందకృష్ణుడిపై మోపటం వల్ల శ్రీకృష్ణుడేస్వయంగా అరణ్యానికి వెళ్లి జాంబవంతునితో యుద్ధం చేసి శమంతక మణితో పాటు జాంబవతిని తీసుకుని ద్వారకకు రావటం తాను చేసిన తప్పుకు సత్రాజిత్తు,శ్రీక్రిష్ణున్నిక్షమాపణ కోరి సత్యభామను ఇచ్చి

పెళ్లిచేయటంవంటి వృత్తాంతం మనందరికీ పూర్తిగా తెలుసు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఆ తరువాత శమంతకమణి ఏమైందనే విషయం చాలామందికి తెలియదనేచెప్పాలి.శ్రీకృష్ణుడు శమంతకమణిని తీసుకువచ్చి సత్రాజిత్తుకి ఇచ్చినతర్వాట పశ్చ్యాతాపంతో సత్రాజిత్తు ఆ మణిని శ్రీకృష్ణుడికిఇవ్వగా ఆయన దానిని స్వీకరించలేదు.ఇది ఎవరిదగ్గరున్నా దాని వలన కలిగే సంపదవల్ల మన రాజ్యప్రజలకు మేలు కలిగితే చాలని చెప్పి తిరిగి ఆ మణిని సత్రాజిత్తుకే ఇచ్చేసాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఈ శమంతకమణికి వున్న అద్వితీయమైన శక్తులవల్ల రోజూ 77కిలోల బంగారంతోపాటు అక్కడ ఎటువంటి ప్రకృతివిపత్తులు కలగకుండా ఆ రాజ్యమంతా సుభిక్షంగా వుండేది. ఇదిలా వుండగా లక్కఇంట్లో పాండవులందరూ చనిపోయారని వారి మరణం వల్ల భీష్మపితామహులు, మిగతా కురువంశంపెద్దలు తీవ్రమైన ఆవేదనలో వున్నారన్నవిషయాన్ని తెలుసుకున్న,శ్రీకృష్ణబలరామలు కురుపెద్దలనుకలవటానికి హస్తినాపురికి పయనమయ్యారు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

కన్నయ్యద్వారకలో లేకపోవటంతో సత్యభామ తన తండ్రివద్దకు వెళ్లి ఆయన భవనంలో విశ్రాంతి తీసుకుందట. అయితే శమంతకమణిపై ఎప్పటినుంచో మక్కువ పెంచుకున్న కృతవర్మ, అక్రూరుడుకి ఒక దురాలోచన వచ్చింది.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

కృష్ణబలరాములిద్దరూ రాజ్యంలో లేనందువలన వీలుచూసుకుని శమంతకమణిని అపహరిద్దామని అనుకున్నారు. అయితే శతధన్వుడు కొంచెం తొందరపడి ఆ నాటి రాత్రి నిద్రిస్తున్న సత్రాజిత్తును చంపి ఆయన మెడలోని మణిని తీసుకుని పారిపోయాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఈ ఘోరాన్ని కళ్ళారా చూసిన సత్యభామ తన తండ్రి దారుణ హత్యవిషయం వేగులద్వారా కృష్ణ భగవానుడికి చేరవేసింది. తన మామగారి దారుణహత్యకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు బలరాముడిని వెంటపెట్టుకుని వాయువేగంతో హస్తినాపురినుంచి ద్వారకకు బయలుదేరాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఇంతలో శతధన్వుడు శమంతకమణిని పట్టుకుని కృతధర్మవద్దకు వెళ్లి జరిగినవృత్తాంతం చెప్పగా దానికి కృతవర్మ నువ్వు చేసినది చాలా పెద్ద తప్పని ఆ కృష్ణభగవానుడిచేతి నుంచి నిన్ను కాపాడటం ఆ బ్రహ్మాదిదేవతలకైనా సాధ్యంకాని పనని,నీకు అటువంటి సహాయం చెయ్యలేనని చెప్పి శతధన్వుడిని అక్కడినుండి పంపి వేసాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఏం చేయాలో పాలుపోని శతధన్వుడు అక్రూరుడివద్దకువెళ్లి ఆ మణిని అతనికి అప్పగించి దానిని తీసుకుని ఎటేనా వెళ్ళిపోమనిబ్రతికుంటేతాను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పి అక్కడినుంచి పారిపోయాడు.ఇంతలో కృష్ణ భగవానుడు వాయువేగంతో ద్వారకసమీపంలోని అరణ్యప్రాంతాన్ని చేరుకోగా గుర్రంపై పారిపోతున్న శతధన్వుడు కనిపించాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

దాంతో కృష్ణుడు బలరాముడిని అక్కడే వుండమని చెప్పి ఉగ్రనరసింహుడి వలే వెంటాడి తలనరికి చంపేసి తలతో బలరాముని వద్దకు రాగా అప్పుడు బలరాముడు ఓ కృష్ణా నీవు శతధన్వుడ్ని చంపి తలనైతే తెచ్చావు కానీ,అతని వద్దనున్న శమంతకమణిని ఎందుకు తీసుకురాలేదుఅని అడిగాడు.దానికి సమాధానంగా అన్నా ఇతని వద్ద శమంతకమణి లేదు బహుశా ఆ మణిని మరెక్కడైనా దాచివుంచవచ్చని అన్నాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

కృష్ణుడు చెప్పినది అబద్ధమని అపోహపడి బలరాముడు కోపంతో తన మిత్ర రాజ్యానికి వెళ్ళిపోయాడు. దాంతో కృష్ణుడు బలరాముడి యొక్క కోపానికి చింతించి ద్వారకకు వెళ్ళిపోయాడుఇదిలా వుండగా శమంతకమణితో పారిపోయిన అక్రూరుడు తన తల్లిగారి రాజ్యమైన కాశీకి చేరాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఆ మణి ప్రభావంచేత బంగారం అక్రూరుడి వద్ద కుప్పలుతెప్పలుగా పోగావటంతో శమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇవ్వకుండా తాను తెచ్చుకుని పెద్దపొరపాటు చేసానని కనీసం దానధర్మాలు,యజ్ఞయాగాదులు చేస్తే కొంతవరకైనా తాను చేసిన పాపంతగ్గుతుందని భావించి ఆ విధంగా గొప్పధానధర్మాలు యజ్ఞయాగాదులు చెయ్యగా ఈ విషయం కృష్ణుడికి తెలిసి అక్రూరుడి వద్ద అంతటి సంపద లేదని అయినా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంటే ఖచ్చితంగా శమంతకమణి అతనివద్దేవుందని గ్రహించి అక్రూరుడిని ద్వారకరమ్మని సందేశం పంపారు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

ఆ సందేశానికి సంతోషించిన అక్రూరుడు ద్వారకలో వున్న కృష్ణుడివద్దకు వెళ్ళాడు.తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోటానికి తన అన్న గారైన బలరాముడిని కూడా పిలిపించి యాదవపెద్దల మధ్య సభ ఏర్పాటుచేసి అక్రూరుడిని సభలో ప్రవేశపెట్టించి శమంతకమణిగురించి చెప్పమని కోరగా పశ్చ్యాత్తాపంతో వృత్తాంతం మొత్తం చెప్పాడు.దాంతో బలరాముడు అనవసరంగా తన తమ్ముణ్ణి అనుమానించాడని బాధపడ్డాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

చేసిన తప్పుఒప్పుకున్నందున కృష్ణుడు అక్రూరుడ్ని క్షమించి ఆ మణిని అతని వద్దే వుంచుకొమ్మని,కాని ద్వారకదాటి వెళ్ళవద్దని ఆ మణి వల్ల కలిగిన సంపాదనను మన రాజ్యప్రజలకు ఇవ్వమని ఆజ్ఞాపించాడు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

అలా మళ్ళీ ద్వారకకు చేరుకున్న శమంతకమణి కృష్ణుడు అవతారం చాలించగానే ద్వారకతో పాటు శమంతకమణికూడా సముద్రంలో కలిసిపోయిందని అప్పటినుంచి శమంతకమణి సముద్రగర్భంలో అంతర్ధానం అయిపోయిందని అది ఇప్పటికీ మునిగిపోయిన ద్వారకలోనే ఎక్కడోఒకచోట వుండిపోయిందని,చాలా మంది చరిత్రకారులు చెబుతున్నారు.

PC:youtube

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

శమంతకమణి జాడ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం !

అయితే ఈ మధ్యకాలంలో కోహినూర్ వజ్రమే శమంతకమణిఅయ్యి వుండవచ్చని చాలా పుకార్లువచ్చాయి. కాని చాలామంది చరిత్రకారులు అది వట్టి పుకార్లు మాత్రమేనని మన పురాణాలలో శమంతకమణి వర్ణనకు దీనికి ఎటువంటి పొంతనా లేదని ఖచ్చితంగా చెబుతున్నారు. అందువల్ల చరిత్రలో తన మహాత్తమైన శక్తితో ఎంతో కీర్తి ఘటించిన ఒక మహామణి వైభోగం సముద్రగర్భంలో కలిసిపోయి దాని వునికి ఇప్పుడు ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more