• Follow NativePlanet
Share
» »కోరుకొన్న వాడే వరుడుగా రావాలనుకొంటున్నారా?

కోరుకొన్న వాడే వరుడుగా రావాలనుకొంటున్నారా?

Written By: Kishore

భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విశయం తెలిసిందే. ఈ సువిశాల భారత దేవంలో కొన్ని చోట్ల దేవతలతో పాటు రాక్షసులను కూడా పూజిస్తారు. ఇదే కోవకు చెందినదే హిమాచల్ ప్రదేశ్ లోని హిడంబి దేవాలయం. స్థానికంగా ఈమెను హడంబ అని కూడా పిలుస్తారు. ఈమె హిడంబాసురుడనే రాక్షసరాజు సోదరి. అయితే పంచపాండవుల్లో ఒకడైన భీమసేనుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అంతేాకాకుండా పాండవులు రాక్షసుల భారిన పడకుండా కాపాడటంలో ఈమె కూడా ఎంతో సహాయం చేసింది. అందువల్లే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలోని స్థానిక గిరిజన తెగల ప్రజలు ఈమెను తమ ఆరాధ్య దైవంగా పూజిస్తుంటారు. అందులో భాగంగా మనాలి వద్ద ఈమెకు ప్రత్యేకంగా దేవాలయం కూడా నిర్మించారు. ఇక ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కూడా మే 14 నుంచి మూడు రోజులు అంటే మే 16 వరకూ దుంగ్రీ ఉత్సవాలను హిడంబి ఆలయం వద్ద జరుపుతారు. ఈ నేపథ్యంలో ఆలయ విశిష్టతతోపాటు దుంగ్రీ ఉత్సవాల తీరుతిన్నెలు మీ కోసం...

ఇక్కడ గుడ్డుతో కొడితేనే కోరికలు తీరేది

1.ఈ ఏడాది ఎప్పుడు

1.ఈ ఏడాది ఎప్పుడు

Image Source:

దుంగ్రీ పేరుతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత ఉత్సహాంగా స్థానికులు జరుపుకొంటారు. ఈ ఏడాది కూడా మే 14 నుంచి మూడు రోజులు అంటే మే 16 వరకూ ఈ ఉత్సవాలను హిడంబి ఆలయం వద్ద జరుపుతారు. ఒకవేళ మీరు ఈ సమయంలో హిమాచల్ ప్రదేశ్ కు పర్యాటకానికి వెళ్లాలని భావిస్తుంటే ఈ దుంగ్రీ ఉత్సవం చూడటం మిస్ చేసుకోకండి

2. హిడంబికి దేవాలయం

2. హిడంబికి దేవాలయం

Image Source:

హిడంబి ఓ రాక్షసి. అయినా ఆమె జన్మదినం సందర్భంగా ఈ దుంగ్రీ ఉత్సవాన్ని జరుపుతారు. ఈ హిడంబి దేవాలయం ఉన్న చోట జరిగే ఈ ఉత్సవం చూడటానికి చుట్టు పక్కల ఉన్న దేవతలందరూ హాజరువుతారని స్థానిక గిరిజనుల నమ్మకం. అందువల్లే ఈ ఉత్సవం జరిగే మూడు రోజులూ చుట్టు పక్కల దేవాలయాల్లోని ఉత్సవ మూర్తులను హిడంబి దేవాలయం వద్దకు తీసుకొని వస్తారు.

3. ఎందుకు ఈ ఉత్సవాన్ని జరుపుతారు

3. ఎందుకు ఈ ఉత్సవాన్ని జరుపుతారు

Image Source:

పంచపాండవుల్లో మూడోవాడైన భీముడి భార్య హిడంబి దేవి. ఈమె రాక్షస సంతతికి చెందినదైనా కూడా గొప్ప దైవ భక్తి కలిగినది. భీముడిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడుతుంది. అంతే కాకుండా తమ సోదరులు పాండవులను ఎలా చంపడానికి ప్రణాళికలు రచిస్తున్నారో తెలిపి అపాయం నుంచి రక్షిస్తుంది.

4. సోదరుల చావుకు కూడా

4. సోదరుల చావుకు కూడా

Image Source:

అంతే కాకుండా భీముడి ద్వారా ఆ ప్రాంతంలో లోక కంఠకులగా మారిన తన సోదరులను చంపిస్తుంది. ఇలా మంచివారైన పాండవుల కుటుంబ సభ్యుల్లో ఒకరిగానే కాకుండా రాక్షసులను చంపడానికి సాయం చేసినమేలుకు గుర్తుగా స్థానిక గిరిజనులు హిడంబిని తమ కులదైవంగా భావిస్తారు.

5. ఇప్పటికీ అక్కడికి వస్తుంటారని నమ్మకం.

5. ఇప్పటికీ అక్కడికి వస్తుంటారని నమ్మకం.

Image Source:

ఇప్పటికీ భీముడు, హిడంబి స్థానికంగా ఉన్న దుంగ్రీ గుట్టల్లోని దుంగ్రీవనంలో ప్రతి రోజూ విహరిస్తూ ఉంటారని స్థానిక గిరిజనుల నమ్మకం. ఇదే ప్రాంతంంలో హిడంబికి ఒక దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది హిడంబి. హిడంబిని భక్తితో కొలిస్తే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని ముఖ్యంగా కోరుకొన్న వ్యక్తే వరుడుగా వస్తాడని స్థానిక గిరిజన యువతుల నమ్మకం.

6. ఎందుకు మనం వెళ్లాలి అంటే?

6. ఎందుకు మనం వెళ్లాలి అంటే?

Image Source:

దుంగ్రీ మేళ కేవలం ఒక గ్రామానికి సంబంధించిన ఉత్సవం కాదు. దేవాలయం చుట్టు పక్కల ఉన్న పదుల సంఖ్యలోని గ్రామ ప్రజలు ఒక చోట చేరి జరుపుకొనే వార్షిక ఉత్సవం. ఇక్కడికి చేరిన గిరిజనులు తమ సంప్రదాయంలో భాగమైన నృత్యం, జానపద పాటలతో ఆ దేవతను అర్చిస్తారు. అందువల్ల విభిన్న గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలను ఒకే చోట చూడటానికి వీలవుతుంది. అందువల్లే ఈ ఉత్సవం జరిగే సమయంలో స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడకు ఎంతో మంది వస్తుంటారు.

7. ఎలా వెళ్లాలి?

7. ఎలా వెళ్లాలి?

హిడంబి దేవాలయానికి దగ్గరగా కులు మనాలి విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం నుంచి ట్యాక్సీ ద్వారా నేరుగా దేవాలయం వద్దకు వెళ్లవచ్చు.

హిడంబి దేవాలయానికి దగ్గరగా జోగిందర్ నగర రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి దేవస్థానానికి సుమారు 170 కిలోమీటర్ల దూరం

రోడ్డు మార్గం ద్వారా మనాలి చేరుకోవడం బాగుంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, దూరంగా కనిపించే మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు వీటన్నింటినీ చూసుకొంటూ ముందుకు సాగడం ఆహ్లాదకరంగా ఉంటుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి