» »నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

Written By: Venkatakarunasri

LATEST: నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి ఇదే..ఈ గుడి వెనుక రహస్యాలు మీకు తెలుసా !

ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ది చెందింది. ఒకేసారి రాకెట్ ద్వారా వందల ఉపగ్రహాలను అంతరిక్ష్యంలోకి ప్రవేశపెట్టగలరు. అయితే ఇంత అభివృద్ది సాధించిన మానవ మేధస్సుకు అంతుచిక్కని విషయాలు చాలానే వున్నాయని అంటున్నారు మేధావులు.

వాటిలో కొన్నింటిని చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతకట్టడాలను వారి ఇంజనీరింగ్ నైపుణ్యాలను చూస్తే నేటి శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో.

ఇలాంటి నిర్మాణాలు మానవులు నిర్మించారంటే అది నమ్మేలా లేదని, దేవతలు గానీ అపర శక్తి సంపన్నలుగా వున్న మానవాతీత శక్తులు గానీ వీటిని నిర్మించి వుంటారని మేధావులు అంటుంటారు.అలాంటి అద్భుతకట్టడాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి భారతీయ శిల్పకళాసంపద తిరుగులేని నిదర్శనం.

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

1. ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

అందులో ప్రముఖమైనది ఎల్లోరా గుహలు. ఎల్లోరా గుహలలోని 16వ గుహలో నిర్మించిన కైలాస దేవాలయం చాలా అద్భుతమైనది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు 29 కి.మీ ల దూరంలో వున్న ఎల్లోరా గుహలోని కైలాస దేవాలయం ప్రత్యేకత అన్నీఇన్నీ కావు.ప్రపంచంలోనే అతి పెద్ద శిల్పకళాఖండం ఇది.

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే?ఒక పర్వతాన్ని పై నుంచి క్రిందకు చెక్కుతూ ఒక అద్భుతమైన దేవాలయ సముదాయాన్ని ఆవిష్కరించారు.ఆ దేవాలయం కూడా ఆషామాషీది కాదు.అణువణువునా భారతీయ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతూవుంటుంది.

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

కళ్ళు చెదిరే శిల్పాలు అలనాటి వైభవాన్ని నేటికీ మనతో చెప్తున్నట్లే చూస్తుంటాయి.రాష్ట్రకూటుల హయాంలో నిర్మించిన ఈ అద్భుతదేవాలయాన్ని వీక్షించిన విదేశీ శిల్పులు ఇంజనీరింగ్ మేధావులు కూడా వేల సంవత్సరాల క్రితం నాటి భారతీయ శిల్పకళను చూసి నమ్మలేక నోళ్ళు వెళ్ళబెట్టేసారు.

4. ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

4. ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

8వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు.దేవాలయ ఫలకాలపై వున్న శాసనాల ఆధారంగా దీని నిర్మాణం 706లో ఆరంభమైంది.774లో పూర్తయిందని తెలుస్తుంది.అంటే 1800ల కాలంలో దీనిని నిర్మించారన్న మాట.దీని లెక్క చూసే ప్రపంచ ఇంజనీరింగ్ మేధావుల మెదళ్ళు ఒక్క సారిగా షాక్ కి గురయింది.

5. నేటి సాంకేతిక పరిజ్ఞానం లేదప్పుడు.

5. నేటి సాంకేతిక పరిజ్ఞానం లేదప్పుడు.

రాతిని కట్ చేయడానికి ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు నాడు లేవు.భారీ బరువులను మోసేందుకు క్రేన్లు లేవు.అలాంటి రోజుల్లో ఒక పర్వతాన్ని ఇంతద్భుతంగా చెక్కడమే
ఓ మాయ అనుకుంటే ఆ మాయని కేవలం 18సంవత్సరాలలో చేయటం అసాధ్యం.

6. భూగర్భం

6. భూగర్భం

ఇక్కడ దాదాపు 40 అడుగుల లోతు వున్న ఒక స్వరంగం వుంది. అక్కడ ఇది కుడివైపు మలుపు తిరిగి భూగర్భంలోకి దారితీస్తుంది.

7. ఇరుకు మార్గం

7. ఇరుకు మార్గం

అయితే ఈ మార్గం క్రమంగా దానికున్న వెడల్పు కుదించుకుపోతూ మనిషి కూడా పట్టనంత ఇరుకు మార్గంగా మారిపోవడంతో ఇందులో ఏముందన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు.

8. మానవ నిర్మితాలేనా

8. మానవ నిర్మితాలేనా

ఎల్లోరా గుహల్లో మరో రహస్య మార్గం కూడా వుంది. 10 అడుగుల లోతుకు వెళ్ళే సరికి అది మనిషి పట్టనంత ఇరుకుగా మారిపోయింది.ఇంతకీ ఈ రహస్యసొరంగ మార్గాలలో ఏముంది? ఈ ఇరుకు మార్గాల్ని ఎవరు ఉపయోగించుటారు.

9. జవాబు దొరకని ప్రశ్నలు

9. జవాబు దొరకని ప్రశ్నలు

ఈ సొరంగాలను మనిషి కూడా పట్టనంత ఎవరు తొలుచుంటారు. అసలీ మార్గాలు మానవ నిర్మితాలేనా?

10. ప్రశ్నలు

10. ప్రశ్నలు

లేక మనుషుల కన్నా చిన్నగా వుండే మరే ఇతర జీవులైనా నిర్మించివుంటాయా? అన్న ప్రశ్నలు సందర్శకులకు ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

 11. భూగర్భం

11. భూగర్భం

ఎల్లోరా గుహలలో భూగార్భంలోకి ప్రవేశించే మార్గం మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈ భూగర్భ ప్రాంతాలు సాధారణ దృష్టికి అందని రీతిలో వున్నాయి.

12. సొరంగాలు

12. సొరంగాలు

ఎల్లోరా గుహలలో భూగర్భంలో అనేక సొరంగాలు వున్నాయని అక్కడి సెక్యూరిటీ గార్డులు చెపుతూ వుంటారు. ఇవి క్రమంగా మనుషులు కూడా పట్టనంత ఇరుకుగా వుంటాయట. వీటన్నిటికీ తాళాలు వేసినట్టు గార్డులు చెపుతూ వున్నారు.

13. ప్రవేశద్వారాలు

13. ప్రవేశద్వారాలు

తాళాలు వేసివున్న ఈ ప్రవేశద్వారాలను గమనిస్తే గనక ఇవి మూడు నుండి నాలుగు దశాబ్దాల క్రితమే మూతపదివుంటాయన్న విషయం మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఎల్లోరా గుహల్లోనే మరో రహస్య మార్గం కూడా వుంది.

14. మూడు నుండి నాలుగు దశాబ్దాలు

14. మూడు నుండి నాలుగు దశాబ్దాలు

ఇది కూడా ముందుకు పోయేకొద్దీ మనిషి కూడా పట్టనంత ఇరుకుగా మారిపోతుంది. అసలీ మార్గాలన్నీ ఎక్కడకు వెళుతున్నాయి?

15. మూడు నుండి నాలుగు దశాబ్దాలు

15. మూడు నుండి నాలుగు దశాబ్దాలు

ఈ ఇరుకు మార్గాలని ఇంతకు ముందు ఎవరు ఉపయోగించి వుంటారు?ఇవన్నీ కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా?

ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

రైలు ద్వారా ఔరంగా బాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సులో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు.

Please Wait while comments are loading...