• Follow NativePlanet
Share
» »ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో వుందో మీకు తెలుసా?

ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో వుందో మీకు తెలుసా?

Written By: Staff

ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు తన ఆధిపత్యాన్ని చూపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడు.

వాటిలో భాగంగానే కులవ్యవస్థను ప్రవేశపెట్టి అగ్రకులాలు నీచకులాలుగా సమాజాన్ని విడదీసి ఈ సమాజాన్ని మొత్తం తన చేతులలోనికి తీసుకోడానికి అగ్రకులస్తులను మెప్పించి నీచకులాల వారిపై ఆంక్షలు విధించి పైశాచిక ఆనందాన్ని పొందేవారు. ఈ నీచకులాల వారు ఆర్థికంగా,సామాజికంగా కూడా ఎదగకుండా ఉండటానికి అనేక పన్నులు,ఆంక్షలు వారిపై విధించేవారు.

అనాగరిక, సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేసిన పన్ను.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ట్రావెన్కో సంస్థానం

1. ట్రావెన్కో సంస్థానం

పూర్వం కేరళ రాష్ట్రంలోని ట్రావెన్కో సంస్థానం చాలా పెద్ద సంస్థానంగా పేర్కొనబడింది.

PC:youtube

2. ఆంక్షలు, పన్నులు

2. ఆంక్షలు, పన్నులు

అయితే నాటి సమాజంలో దళితకులాల వారిపై ఎన్నో ఆంక్షలు, పన్నులు ఉండేవి.

PC:youtube

3. పన్నులు

3. పన్నులు

అటువంటి పన్నులలో ఒకటి రొమ్ముల పన్ను. ఆడవారిలో సహజంగా వచ్చే రొమ్ములపై కూడా అప్పటివారు పన్నులు వేయటం అనేది ఒక అమానుష చర్యగా పరిగణించాలి.

PC:youtube

4.ఆధిపత్యం

4.ఆధిపత్యం

అయితే అప్పటి సమాజంలోని అగ్రవర్ణాల ఆధిపత్యం వల్ల దళితులకు వారి ఆంక్షలను శిరసావహించటం తప్ప వేరే గత్యంతరం వుండేది కాదు.

PC:youtube

5. దళిత స్త్రీలు

5. దళిత స్త్రీలు

ఈ రొమ్ముల పన్ను ఆధారంగా అప్పటి దళిత స్త్రీలు వారి రొమ్ములను ఎటువంటి వస్త్రంతోనూ మూయకూడదు.

PC:youtube

6. బరువు

6. బరువు

ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలోకి వచ్చినప్పుడు వారి రొమ్ములు అందరికీ కనపడాలి. అప్పటి ప్రభుత్వ అధికారులు ప్రతి నెలా ప్రతి దళిత మహిళల యొక్క రొమ్ములను పరిమాణాన్ని దాని బరువును కొలిచి దానికి తగ్గ పన్ను వేసేవారు.

PC:youtube

7. దళిత మహిళలు

7. దళిత మహిళలు

ఈ పన్ను వ్యవస్థను 'ముళక్కరం' అనే వారు. ఈ అమానుష చట్టాల వల్ల అప్పటి దళిత మహిళలు మాన ప్రాణాలు గాలిలో దీపాలుగా వుండేవట.

PC:youtube

8. ప్రభుత్వ అధికారులు

8. ప్రభుత్వ అధికారులు

చాలా సార్లు పన్ను వసూలు నెపంతో స్వయంగా ప్రభుత్వ అధికారులే ఆ దళిత మహిళల మానాన్ని దోచుకునేవారట.

PC:youtube

9. ధనబలం, అంగబలం

9. ధనబలం, అంగబలం

ఈ చర్యల వల్ల అప్పటి దళిత ప్రజలలో అగ్రవర్ణాల వారిపై తీవ్ర ఆగ్రహం వున్నా వారి ధనబలం, అంగబలంతో సరితూగలేక మౌనంగా రోధించేవారట.

PC:youtube

10. పన్ను

10. పన్ను

ఒక వేళ ఎవరైనా తిరగబడితే వారిని రకరకాలుగా హింసించి చంపేసేవారట. ఈ దుర్మార్గాన్ని అప్పట్లో ఒక మహిళా ఎదురుతిరిగి పన్నుకు స్వస్తి పలికేలా చేసింది.

PC:youtube

11. నంగేలి

11. నంగేలి

అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలోని చర్యల అనే ప్రాంతానికి చెందిన నంగేలి అనే దళిత మహిళా ఈ మూఢాచారంపై తిరుగుబాటు చేసింది.

PC:youtube

12. వెనుదండ

12. వెనుదండ

ఆడవారికి సహజంగా వచ్చే రొమ్ములపై,పన్ను వేయటం ఏమిటని మీ అగ్రకులపు స్త్రీల వలె మేము కూడా రొమ్ములు కనిపించకుండా వస్త్రధారణ ఎందుకు చేయకూడదు?అని ప్రశ్నించిందట.ఆమెకు తన భర్త కూడా ఎంతో వెనుదండగా నిలిచేవాడట.

PC:youtube

13. వస్త్రధారణ

13. వస్త్రధారణ

ఆ విధంగానే అప్పటి ఈ అసాంఘిక చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రదేశాలలో పూర్తి వస్త్రధారణ తిరగటం, పన్ను కట్టకుండా మొండిగా ప్రయత్నించటం,తోటి దళితులను ఆ విధంగా ఉద్యమించేలా వంటివి చేసేది.

PC:youtube

14. నంగేలీ

14. నంగేలీ

నంగేలీని ఎలాగైనా అదుపు చేయాలనే ఉద్దేశ్యంతో అప్పటి పాలకులు నంగేలీతో ఎలాగైనా పన్ను కట్టించదలచి భారీ మందీమార్భలంతో వెళ్లి ఆమె సన్నిహితులనందరినీ బంధించి పన్ను కట్టమని తీవ్ర ఒత్తిడి కలిగించారట.

PC:youtube

15. నంగేలీ

15. నంగేలీ

దాంతో నంగేలీ తన రొమ్ములను కోసి వీటి గురించే కదా, మీ తపన. ఈ రక్తపు ముద్దను మీరే తీసుకోండి. అని ఆ అధికారుల ముఖంపైకి విసిరికొట్టిందట.

PC:youtube

16. తీవ్ర రక్త స్రావం

16. తీవ్ర రక్త స్రావం

ఆమె చర్యకు ఆశ్చర్యపోయిన ఆ అధికారులు, భయంతో అక్కడినుండి పరుగుతీయగా ఆమె తీవ్ర రక్త స్రావంతో మరణించింది.

PC:youtube

17. ఆగ్రహజ్వాలలు

17. ఆగ్రహజ్వాలలు

ఆమె భర్త తన భార్య మరణించటం జీర్ణించుకోలేక ఆమె చితిమంటలపై పడి తానూ మరణించాడట.వారి చితిమంటలు అక్కడి దళితుల గుండెలలో ఆగ్రహజ్వాలలుగా మారి ఒక ఉద్యమానికి దారితీసింది.

PC:youtube

18. అమానుష చట్టం

18. అమానుష చట్టం

ఒక్కొక్క గడ్డిపూచ కలిసి ఒక ఏనుగును సైతం బంధించగలదు అనే సామెతను నిజం చేస్తూ అప్పటి అన్ని ప్రాంతాలలోని దళిత ప్రజలు ఏక తాటి పై నిలిచి ముక్తకంఠంతో ఈ అమానుష చట్టంపై తిరుగుబాటు చేశారు.

PC:youtube

19. అగ్రవర్ణాల వారు

19. అగ్రవర్ణాల వారు

వారి అకుంఠిత దీక్ష,అలుపెరుగని పోరాటం వల్ల అప్పటి పాలకులు, అగ్రవర్ణాల వారు దిగి రాక తప్పలేదు.

PC:youtube

20. కేరళ రాజ్యం

20. కేరళ రాజ్యం

నంగేలి దళిత ప్రజలలో రేపిన వుద్యమజ్వాల ఒక నవసమాజ స్థాపనకు నాంది అయిందని ఇప్పటికీ కేరళ రాజ్యంలో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.

PC:youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి