• Follow NativePlanet
Share
» »మహాబలిపురం ఆలయంలో వుండేది ఎలియెన్స్ కి సంబంధించిన బండేనా ?

మహాబలిపురం ఆలయంలో వుండేది ఎలియెన్స్ కి సంబంధించిన బండేనా ?

మహాబలిపురంలోని దేవాలయం చాలా అందమైన ఆలయం. ఆ గుడి నిర్మాణంలో అణువణువూ అనేక రహస్యాలను దాచిపెట్టుకుని వుంది. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు,షాక్ కొట్టించే నిజాలు దర్శనమిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆ గుడిలోని రాయిని కదిలించటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.

ఎవ్వరి వల్లా కాలేదు.ఇక ఆ గుడిలో శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే రాకెట్లను ప్రయోగించే టెక్నాలజీకి నాంది పలికారని అనిపిస్తుంది. అదే తమిళనాడులోని మహాబలిపురం దేవాలయం. అణువణువూ రహస్యాలను నింపుకున్న దేవాలయం.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. దేవాలయం ఎక్కడుంది?

1. దేవాలయం ఎక్కడుంది?

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో వున్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50కి.మీ ల దూరంలో వుంది. ఒకప్పుడు మామల్లపురంగా మహాబలిపురాన్ని పిలిచేవారు. ఈ దేవాలయం సముద్రపు ఒడ్డున ఉన్నది.

PC:Gopinath Sivanesan

2. బలిచక్రవర్తి

2. బలిచక్రవర్తి

7 నుండి 10వ శతాభ్దాల కాలంలో పల్లవరాజుల కాలంలో పెరెన్నికకలిగిన ఓడరేవు ఇది. పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటం వల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు.

PC:Thurika

3.యుద్ధం

3.యుద్ధం

భగవాన్ విష్ణుమూర్తితో జరిగిన యుద్ధంలో మరణించిన మహాబలి అనబడే కిరాతకుడైన రాక్షసుడి పేరు ఈ నగరానికి వచ్చిందని మరికొందరు చెబుతారు.

PC:SatishKumar

4. కృష్ణుని బండ

4. కృష్ణుని బండ

మహాబలిపురం అంటేనే సముద్రతీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి. కంచిని రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి స్వదేశీ కళాకారుల అండదండలతో సాగరతీరంలో ఈ వూళ్ళో పెద్ద రాతి కట్టడాన్ని సృష్టించారు.

PC:Thurika

5. పెద్ద బండ

5. పెద్ద బండ

ఆనాటి రాజుల ఆ కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి ఎందరో శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు.

PC:YOUTUBE

6. కృష్ణాస్ బట్టర్ బాల్

6. కృష్ణాస్ బట్టర్ బాల్

వాటిలో ప్రధానమైనవి కృష్ణుని రాయి. కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తారు. దీనికి దాదాపు 1200 ల సంవత్సరాల చరిత్ర వుంది. దాదాపు 20అడుగుల వెడల్పు,అలాగే పొడవు,ఎత్తు కలిగి కేవలం 2చదరపు గజాల స్థలంలో నిలిచివుంటుంది.

PC: Thamizhapparithi Maari

7. మిస్టరీ

7. మిస్టరీ

దాదాపు 250టన్నుల బరువున్న ఈ రాయి అక్కడ చెక్కుచెదరకుండా వుండటమే ఇప్పటికీ మిస్టరీ. ఈ రాయిని తొలిగించాలని ఎంతో మంది ప్రయత్నించారు.

PC:michael clarke stuff

8. ఆర్ధర్ ఆలీ

8. ఆర్ధర్ ఆలీ

అయితే ఎవరు ఇంచు కూడా కదిలించలేకపోయారు. 1908వ సంలో ఈ ప్రదేశాన్ని పరిశీలించిన ఆర్ధర్ ఆలీ అనే బ్రిటీష్ దొర ఈ రాయిని చూసి ఇది చాలా ప్రమాదం అని తొలిగించాలని ప్రయత్నించాడు.

PC:Thamizhpparithi Maari

9. చరిత్ర

9. చరిత్ర

ఇందుకోసం 7 ఏనుగులను తెప్పించి పెద్దపెద్ద గొలుసులతో దాన్ని ఎత్తు నుండి పల్లంలోకి కదిలించటానికి నానా ప్రయత్నాలూ చేశారు.అయితే వారు ఆ రాయిని కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగారని చరిత్ర చెబుతుంది.

PC:YOUTUBE

10. ఆకాశదేవుని బండ

10. ఆకాశదేవుని బండ

ఇంతటి ప్రఖ్యాత గాంచిన ఆ రాయిని ఆ నాటి పల్లవరాజు నరసింహవర్మ ఇది ఆకాశదేవుని రాయని,దీనిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడని ఓ కధనం చెబుతుంది. మరికొందరు ఇది గుడి కోసం తెచ్చిన రాయని అయితే మధ్యలోనే వదిలేసారని,వాదిస్తారు.

PC:Ashokarsh

11. ఎగిరే పళ్ళాలు

11. ఎగిరే పళ్ళాలు

మరికొందరు మాత్రం ఇది గ్రహాంతవాసులు ఎగిరే పళ్ళాలనీ చెబుతారు. దాదాపు 250టన్నులు బరువు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదనీ,అందుకే ఇది ఎలియన్స్ కి సంబంధించినవనీ చెబుతారు.

PC:Ashokarsh

12. ఎలియన్స్

12. ఎలియన్స్

అచ్చం ఇలాటి రాయిని పోలిన రాళ్ళు ప్రపంచంలో కొన్ని చోట్ల వున్నాయి అవి ఎలియన్స్ తిరుగుతున్నారన్న ఊహాగానాలు వెలువడే ప్రదేశాలని,మెక్సికన్ నగరం,అలాగే పెరూలో వున్నాయి.అచ్చం ఇలాంటి రాళ్ళే అక్కడ కూడా వున్నాయి.

PC:YOUTUBE

13. టెక్నాలజీ

13. టెక్నాలజీ

ఇక ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే ఇంత టెక్నాలజీని వాడారా?అనిపిస్తుంది. ఒకే చిత్రంలో ఆవుని,పాలు తాగుతున్న దూడనీ చూడొచ్చు. అలాగే అదే చిత్రంలో ఏనుగుని అలాగే పిల్ల ఏనుగునీ చూడొచ్చు.

PC:YOUTUBE

14. శిల్పాలు సాక్ష్యాలు

14. శిల్పాలు సాక్ష్యాలు

అప్పట్లోనే అంతరిక్ష పరిశోధనకు శ్రీకారం చుట్టారా?అనటానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.అప్పట్లోనే పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేసారా?అనటానికి చాలా ఆధారాలు కనపడతాయి.

PC:SatishKumar

15.

15.

ఆ ఆలయంలోని గణేశుని విగ్రహం పైన రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది.దాంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి.

PC:SatishKumar

16. బావి

16. బావి

ఇక్కడ వున్న మరో టెక్నాలజీ చిత్రం బావి. ఆ కాలంలో కొలతలు కూడా లేదు. అలాటిది ఎంతో ఖచ్చితత్వంతో ఆ బావిని తయారుచేసారు.అప్పట్లోనే టెక్నాలజీని వాడారా?అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ.

PC:YOUTUBE

17. టెక్నాలజీ

17. టెక్నాలజీ

ఆలయ గోపురం పై వున్న శూలాన్ని చూస్తే మనకు టెక్నాలజీ గుర్తుకువస్తుంది.ఈ శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడ కనిపించడు.అతని తల మీద మనకి రెండు కొమ్ములు,అలాగే హెల్మెట్ ధరించినట్లు మనకు కనిపిస్తుంది.

18. శాటిలైట్ స్థంభం

18. శాటిలైట్ స్థంభం

అంతా విదేశీయుడ్ని పోలినట్లు మనకు కనిపిస్తుంది.అచ్చం శాటిలైట్ స్థంభంలాగానే కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోని వ్యోమగాముల్లాగా కనిపిస్తుంది.

19. గర్భగుడి

19. గర్భగుడి

అంతేకాకుండా విమాన గోపురం చుట్టూ అచ్చం వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి.ఇంకా విచిత్రకరమైన అంశం ఏమిటంటే గర్భగుడిలోకి ఎక్కడ గాలి చొరబడకుండా దానిని కట్టారు.

20. రాకెట్ లాంచింగ్

20. రాకెట్ లాంచింగ్

శాటిలైట్ పంపినపుడు విడుదలయ్యే వాయువులు పోయే విధంగా ద్వారాలు కట్టారనిపిస్తుంది. ఎక్కడా కిటికీలు,తలుపులు కనపడవు.అంటే రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారని తెలుస్తుంది.

21. పర్యాటకులు

21. పర్యాటకులు

ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఈ దేవాలయం విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ వున్న లైట్ హౌస్ దాదాపు 1000ఏళ్ళు క్రితం చెందినదిగా భావిస్తారు. మహాబలిపురానికి వచ్చే ఓడలకు దారి చూపించేందుకు ఈ లైట్ ను ఏర్పాటు చేసారని ప్రసిద్ధి.

22. అణువణువూ టెక్నాలజీ

22. అణువణువూ టెక్నాలజీ

పురాతనకాలంలోనే మన టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తమైందని చెప్పటానికి ఈ దేవాలయమే ఒక చక్కటి ఉదాహరణ. అణువణువూ టెక్నాలజీని నింపుకుని ఆకట్టుకుంటున్న ఈ గుడిని ఒక్కసారైనా దర్శించాల్సిందే.

23. మహాబలిపురం ఎలా చేరుకోవాలి ?

23. మహాబలిపురం ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం : కంచి, చెన్నై ప్రాంతాల నుండి ప్రతి రోజూ మహాబలిపురానికి బస్సులు తిరుగుతుంటాయి.

రైలు మార్గం : చెంగల్పట్టు మహాబలిపురానికి సమీప రైల్వే స్టేషన్ (29 కి.మీ.)

వాయు మార్గం : చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ మహాబలిపురానికి సమీపాన కలదు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి