» »2500 నెమళ్ళు కలిసి ఒకేసారి ఆడే నాట్యం చూడాలని వుందా.. అయితే తప్పకుండా వెళ్ళండి మొరాచి చించోలి

2500 నెమళ్ళు కలిసి ఒకేసారి ఆడే నాట్యం చూడాలని వుందా.. అయితే తప్పకుండా వెళ్ళండి మొరాచి చించోలి

Written By: Venkatakarunasri

LATEST: అంతుచిక్కని సోన్ భండార్ గుహ రహస్యం !

ఈనాటి కాలంలో మనం అనేక జంతువులను, పక్షులను కేవలం పుస్తకాలు మరియు టీవీ లలో మాత్రమే పక్షులు చూడగలుగుతున్నాం. కానీ నిజంగా మన కళ్ళెదుట నెమలి నాట్యమాడితే ఎలా వుంటుంది. అబ్బా.. ఆ అందాలు చూడటానికి రెండు కళ్ళూ చాలవు కదూ. కానీ అరుదుగా నెమళ్ళు మనకు కనిపిస్తాయి.

నెమలికి నేర్పిన నడకలివా..మురళికి అందని పిలుపులివా..అని వూరికే అనలేదండి బాబూ.. నిజంగానే ఇక్కడ నాట్యమాడే నెమళ్ళతో అనునిత్యం కనువిందు చేస్తుంటాయి. అది ఎక్కడో తెల్సుకుని మీకు వెళ్లి చూడాలని వుంది కదూ ! మరెందుకాలస్యం వెళ్లి చోసేస్తే పోలే.. మొరాచి చించోలి చింత చెట్లకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణమంతా అనేక నాట్యమాడే నెమళ్ళతో నిండి వుంటుంది. కానీ మీరు కూడా మీ పిల్లలకు నెమలి నాట్యం చూపించాలి అనుకుంటే మీరు పూణే సమీపంలోని మొరాచి చించోలి సందర్శించండి ఉండాలి. మొరాచి చించోలి అనే మరాఠీ పదం.

Latest: ప్రకృతి చెక్కిన శిల్పాలు - మీరు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన ప్రదేశాలు !

"విమానంలో ప్రయాణం....ఒక్క రోజులోనే ఏడుకొండల వాడి దర్శనం"!

మొరాచి చించోలి - నాట్యమాడే నెమళ్ళ నిలయం

టాప్3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఇష్టపడే ప్రయాణం

1. ఇష్టపడే ప్రయాణం

పూణే నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్ నగర్-పుణె రహదారికి దగ్గరలో ఈ పట్టణం ఉంది. ఈ ప్రదేశం మహారాష్ట్రలోని పూణేకి సమీప గ్రామీణ ప్రాంతంలో అందరినీ ఆకర్షిస్తూ వుంది. పూణే నుండి అత్యంత ఇష్టపడే ప్రయాణాలలో ఇది ఒకటిగా ఉంది.

ఇండియాలోని 20 మిస్టరీ గుహలు !!

PC: Kabir

2. పేష్వా పాలన

2. పేష్వా పాలన

పేష్వా వంశ పాలనలో చాలా చింతచెట్లు ఈ గ్రామంలో నాటబడ్డాయి. ఈ వృక్షాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు 2500 మంది జనాభా ఉన్నారు.

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో గల సందర్శనీయ ప్రదేశాలు !

 3. పొలాల చుట్టూ

3. పొలాల చుట్టూ

నెమళ్ళలో ఆడనెమలి కన్నా మగనెమలే అందంగా వుంటుంది. ప్రతిరోజూ పొలాల చుట్టూ ఈ మగ నెమళ్ళను చూడవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేదా సాయంత్ర సమయాలలో వాటిని చూడటానికి అనుకూల సమయం.

రిసార్ట్స్

రిసార్ట్స్

ఈ మగనెమళ్ళను దూరం నుండి ప్రత్యేకంగా వీక్షించటానికి అనేక రిసార్ట్స్ అవకాశం కల్పిస్తోంది. మీకు దాని దగ్గరకు వెళ్లి చూడాలనిపిస్తుంది. కానీ మీరు వాటి దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నిస్తే అవి ఎగిరిపోటానికి అవకాశం వుంది.

PC: Yogendra Joshi

 సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి ఉత్తమ సమయం

మొరాచి చించోలిని ఏడాది పొడవునా ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయినప్పటికీ జూన్ నుండి ప్రారంభించి డిసెంబరు నెల వరకు చాలామంది ఇక్కడకు వస్తారు.

PC: Shirin tejani

 6. ఈ ప్రాంతాన్ని చేరుకోవటం ఎలా?

6. ఈ ప్రాంతాన్ని చేరుకోవటం ఎలా?

విమాన మార్గం:

ఇక్కడ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణే విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఢిల్లీ, బెంగుళూర్, హైదరాదు నుండి క్రమమైన విమానాలు నడుస్తాయి.

PC: Frankyboy5

7. రైలు ప్రయాణం

7. రైలు ప్రయాణం

మొరాచి చించోలికి సమీప రైల్వేస్టేషన్ పూనే జంక్షన్. ఇది ఇక్కడ నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు మరియు నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది మరియు ముంబై మరియు ఇతర నగరాలకు రైళ్ళు నడుస్తాయి.

PC:Alex Pronove (alexcooper1)

8. రోడ్డు మార్గం

8. రోడ్డు మార్గం

రోడ్డు మార్గం మొరాచి చించోలి చేరుకోవడానికి ఉత్తమమైనది. రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడినందున పూణే, ముంబై మరియు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల నుండి సాధారణ బస్సులు నడుస్తాయి. పూణే నుండి ఇక్కడికి వెళ్ళే మొత్తం దూరం 55 కిమీ మరియు ముంబై నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.

PC:Hamed Saber

9. ఇక్కడ ఇంకా చూడాలసినవి

9. ఇక్కడ ఇంకా చూడాలసినవి

మయూర్ బాగ్

మయూర్ బాగ్ ఇక్కడ ఉన్న నెమలి అభయారణ్యం, ఇది సందర్శకులకు ఉచిత ప్రవేశాన్ని అందిస్తుంది. ఈ అభయారణ్యంలో సుమారు 2500 మంది పక్షులు వున్నాయి. ఈ అభయారణ్యంలో 500 రు లతో ఒక రోజు పర్యటన చేయవచ్చును. ఎద్దుల కారు సవారీలు, బహిరంగ ఆటలు, క్యాంపింగ్ మరియు టెంట్ సౌకర్యాలను అందిస్తాయి.

నిజమైన అనుభూతి

నిజమైన అనుభూతి

ఈ అభయారణ్యంలో గ్రామం చుట్టూతా సందర్శకులను తోలుబొమ్మ ప్రదర్శనలు, మేజిక్ ప్రదర్శనలు కూడా ఏర్పాట్లు చేసాయి. ఈ టూర్ ఖచ్చితంగా మీ డైలీ రొటీన్ లైఫ్ నుంచి ఎంతో రిఫ్రెష్ మెంట్ తీసుకొస్తుంది. ఈ అభయారణ్యం, దాని పరిసరాలు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల యొక్క నిజమైన అనుభూతిని ఇస్తుంది.

PC: Yogendra Joshi

11. మొక్కలు మరియు పువ్వులు

11. మొక్కలు మరియు పువ్వులు

అభయారణ్య ప్రాంగణంలో మీరిష్టపడే విభిన్న రకాల మొక్కలు మరియు పువ్వులను తీసుకెళ్లే నర్సరీ కూడా ఉంది. నర్సరీ లోపల సేంద్రీయ ఫలదీకరణం గురించి మరియు వివిధ రకాల మొక్కల జాతుల గురించి వివరంగా తెలుసుకోవచ్చును. ఈ ప్రదేశం చూచుటకు చాలా ఆసక్తికరంగా మరియు ఆకర్షణీయంగా వుంటుంది.

PC:Kanishkrawat05

12. ఆప్యాయంగా పలకరించే గ్రామస్తులు

12. ఆప్యాయంగా పలకరించే గ్రామస్తులు

ఇక్కడ ప్రత్యేకంగా మీ దగ్గరి వాళ్ళతో మరియుమీకిష్టమైన వారితో మళ్ళీ మళ్ళీ సందర్శించడానికి మిమ్మల్ని పిలిచేలా చేస్తుంది. మొరాచి చించోలి మనం ఎప్పుడూ సతమతమయ్యే బిజీ లైఫ్ నుండి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాలి.

PC:Akshat Atolia

13. ఆప్యాయంగా పలకరించే గ్రామస్తులు వారి ఆతిథ్యం

13. ఆప్యాయంగా పలకరించే గ్రామస్తులు వారి ఆతిథ్యం

ఈ ప్రదేశంలో విలాసవంతమైన రిసార్ట్స్, పెద్ద పెద్ద షాపింగ్ ప్లేసెస్ లేకపోయినా ఆప్యాయంగా పలకరించే గ్రామస్తులు వారి ఆతిథ్యం మీకు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.

PC:Vvangapalli1992