» »హంపిలో గల భూగర్భ శివ ఆలయం గురించి మీకు తెలుసా?

హంపిలో గల భూగర్భ శివ ఆలయం గురించి మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

హంపి:
హంపిలో గల ప్రతి రాయి, స్థూపం యొక్క నిర్మాణం హంపి గురించి ఎంతో కొంత తెలియజేస్తుంది. ఈ వ్యాసంలో మనం హంపిలో గల "అద్భుతమైన భూగర్భ శివాలయం" గురించి తెలుసుకోబోతున్నాం.

underground shiva temple in hampi

PC: Dineshkannambadi

ఇది ఎక్కడ ఉంది?

హంపిలో గల భూగర్భ శివాలయం ప్రధాన బస్ స్టాండ్ (ప్రధాన రహదారి) కు చాలా దగ్గరలో కలదు. అంతేకాకుండా నోబల్మెన్స్ క్వార్టర్స్ సమీపంలో కూడా వుంది. ఈ దేవాలయంకు వెళ్ళే మార్గంలో "హజారా రామ ఆలయం" కూడా చూడవచ్చు.

భూగర్భ శివాలయం గురించిన ఆసక్తికరమైన వాస్తవాలు :

  • పేరులో సూచించినట్లుగానే ఈ ఆలయం నేలమట్టమునకు నిర్మించారు. అందుకే ఇది భూగర్భ శివాలయంగా ప్రసిద్ధి చెందినది.
     
  • ఇక్కడ శివుడిని "ప్రసన్న విరూపాక్షుడు" అని పిలుస్తారు. అందువలన దీనిని "హంపి ప్రసన్న విరూపాక్షుడు ఆలయం" అంటారు. 
     
  • ఇది కేవలం ఒక భూగర్భ ఆలయం కాదు, నీటి కింద ఉంది ! అవును, మందిరం లోపలి భాగాలు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఒక సిద్ధాంతం ప్రకారం అది ఒక కాలువ ద్వారా లోపల ప్రవహించే తుంగభద్ర నది నీరు.
underground shiva temple in hampi

PC: Ssenthilkumaran

ఇది నోబల్మెన్స్ క్వార్టర్స్ సమీపంలో వుంది కనుక ఈ ఆలయం విజయనగర రాయల్ కుటుంబం సభ్యులకు మాత్రమే దర్శించదగిన క్షేత్రంగా చెప్పేవారు. ఒకానొక సమయంలో గర్భగుడినే శివలింగము అని అనేవారు. నేడు ఈ గర్భగుడి ఖాళీగా ఎల్లప్పుడూ నీటిలో మునిగి వుంటుంది. ఇవి భూగర్భ శివాలయం గురించిన అత్యంత ఆసక్తికరమైన కొన్ని నిజాలు.

underground shiva temple in hampi

PC: Mathanki Kodavasal

భూగర్భ శివాలయం యొక్క నిర్మాణం:

ప్రసన్న విరూపాక్ష ఆలయం ఒక సాధారణ సొగసైన రూపకల్పన. ఇక్కడ ప్రధాన హాలు (మహా మంటపం) ఉంది. అర్ధ మంటపం (ప్రాంగణంలో), గర్భగ్రిహ (గర్భగుడిని), అంతరాలముతో పాటు గర్భగుడి దగ్గర ఒక చిన్న హాలు కూడా వుంది.

ఆలయం లోపల అనేక శిల్పాలే కాదు అనేక అంశాలు కూడా చూడవచ్చు. అయితే ఈ పుణ్యక్షేత్రంలో కొన్ని ప్రైవేట్ ఉత్సవాలు కూడా జరుపుతారు.

ప్రసన్న విరూపాక్ష ఆలయంనకు గోపురం కానీ ఒక ఫ్లాట్ పైకప్పు కానీ లేదు. విజిటర్స్ ద్వారం నుండి మెట్లు దిగి ఆలయం చేరుకోవాలి.

ఆలయం చుట్టూ గల పచ్చని పచ్చికలో సందర్శకులు విశ్రాంతి తీసుకోవచ్చును అలాగే కొద్దిసేపు ప్రశాంతంగా గడపవచ్చు.

underground shiva temple in hampi

PC: Voyou Desoeuvre

ప్రసన్న విరూపాక్ష ఆలయానికి ఎలా చేరాలి?

విగ్రహం హంపి ప్రధాన రహదారికి చాలా సమీపంలో ఉంది. మీరు హజారా రామ ఆలయం మార్గంలో ఈ దేవాలయం సులభంగా కనుగొనవచ్చును.

హంపికి ఎలా చేరాలి?

భూగర్భ శివాలయం ఖచ్చితంగా హంపి యొక్క ఏకైక పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ అద్భుతమైన అందమైన నిర్మాణంను దయచేసి మిస్ చేసుకోకండి.