Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ ఎక్కడుందో మీకు తెలుసా ?

ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ ఎక్కడుందో మీకు తెలుసా ?

By Venkatakarunasri

మదర్స్ మార్కెట్ ( మదర్స్ బజార్) అమ్మల బజార్. మదర్స్ బజార్ వినటానికే వింతగా వుంది కదూ. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆడవాళ్ళ బజార్. ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది ఈ మహిళా బజార్.

దాదాపు 500ల సంవత్సరాలుగా ఒకే పద్ధతిలో నడుస్తున్న మార్కెట్. తరతరాలుగా సంప్రదాయం ఈ ఆడవాళ్ళ మార్కెట్. మార్కెట్ నిర్వహించేవారు కాకుండా కేవలం విక్రయదారులే దాదాపు 4000ల మంది వుంటారు. 4000ల మంది మహిళా వర్తకులు, వేలాది మంది కొనుగోలుదారులతో నిత్యం కిటకిటలాడుతూ వుంటుంది ఈ మార్కెట్.

<strong>పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు ఏంటో మీకు తెలుసా ?</strong>పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు ఏంటో మీకు తెలుసా ?

యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండలు !యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండలు !

ఇక పండుగలు, సంబరాల సందర్భంగానైతే ఇసకేస్తే రాలనంత జనాలతో ఉక్కిరిబిక్కిరావుతుంది ఈ మదర్స్ మార్కెట్. ఇందులో అమ్మకాలే కాదు. మార్కెట్ నిర్వహణాభాద్యతలన్నీ కూడా ఆడవాళ్లే నిర్వహిస్తారు. ఆడవాళ్ళ మార్కెట్ కదా ఇదేదో చిన్న కూరగాయల మార్కెట్ అని తేలికగా తీసుకోకండి సుమా!

ప్రపంచంలోనే అతి పెద్దదైన మదర్స్ బజార్ ఎక్కడుందో మీకు తెలుసా ?

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. దొరకని వస్తువు లేదు

1. దొరకని వస్తువు లేదు

ఇక్కడ దొరకని వస్తువు లేదు. గుండుసూది నుంచి డిజైనర్ దుస్తుల వరకు, మసాలా దినుసుల నుంచి మాంసం వరకు, కూరగాయల దగ్గర్నుంచి కూలర్ల వరకు, ఇంటికి కావలసిన అలంకరణ సామాగ్రి నుంచి ప్రత్యేకమైన పెన్నులు, పుస్తకాలు వంటి విద్యాసంబంధమైన వస్తువుల వరకు, అలంకరణ సామాగ్రి నుంచి ఆభరణాల వరకు మతపరమైన ఆరాధనా వస్తువుల నుంచి మట్టి కుండల వరకు, బాతుగుడ్డు నుంచి బంగారం వరకు ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ పరిసరప్రాంతాలలో ఇంకెక్కడా దొరకని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయట.

ఇది కూడా చదవండి: చురచంద్ పూర్ - మణిపూర్ మాణిక్యం !!

pc:youtube

2. మణిపూర్ సంస్కృతి

2. మణిపూర్ సంస్కృతి

మణిపూర్ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వస్తువులు, స్థానిక ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువగా కనపడతాయి. సరే గొప్పగా చెపుతున్న మార్కెట్ ఎక్కడుంది. అత్యంత సుందర రాష్ట్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో వుందీ మదర్స్ మార్కెట్.

pc:youtube

3. ఇమాకీతాల్

3. ఇమాకీతాల్

ఈ మార్కెట్ ను స్థానికులు వారి భాషలో ఇమాకీతాల్ అని పిలుచుకుంటారట. మణిపురి భాషలో ఇమా అంటే అమ్మ అని, కీతాల్ అంటే బజార్ అని అర్థమట. అందుకనే దీనిని మదర్స్ బజార్, అమ్మల బజార్ అని కూడా పిలుచుకుంటారు.

pc:youtube

4. 4000 మంది స్త్రీలు

4. 4000 మంది స్త్రీలు

ప్రతిరోజూ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి సుమారు 4000 మంది స్త్రీలు తెల్లవారకముందే తమతమ వస్తువులతో ఇక్కడకు చేరుకుంటారు. రాత్రి 6 గంటల వరకు ఆ అమ్మకాలు అలా కొనసాగుతూనే వుంటాయి. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ ఇప్పుడేర్పడింది మాత్రం కాదు.

pc:youtube

5. మదర్స్ బజార్

5. మదర్స్ బజార్

తరతరాలుగా వస్తున్న సంప్రదాయపు మార్కెట్ ఈ మార్కెట్. ఈ మదర్స్ బజార్ ఎప్పటినుండి ప్రారంభమైంది అన్నది మాత్రం మనకు భిన్నాభిప్రాయాలు వినపడుతూ వుంటాయి. అయితే శతాబ్దాల క్రితం నుంచి అంటే 16 వ శతాబ్దం నుంచి ఇది ఆ ప్రాంత సంప్రదాయంలో భాగంగా నిర్వహించబడుతున్న మార్కెట్ గా చెప్తారు.

ఇది కూడా చదవండి:భారతదేశంలో భగవద్గీత మహాభారతం జరిగిన ప్రదేశాలు !

pc:youtube

6. సంప్రదాయబద్ధమైన మార్కెట్

6. సంప్రదాయబద్ధమైన మార్కెట్

అయితే ఇటువంటి సంప్రదాయబద్ధమైన మార్కెట్ ఏర్పడటానికి కూడా ఒక కారణం వుంది. అప్పట్లో ఆంగ్లేయులు తరచుగా చైనా, బర్మాలతో జరిగే యుద్దాలతో పాల్గొనటానికి వెళుతూవుండేవారట. దాంతో కుటుంబాల నిర్వహణా బాద్యత క్రమంగా స్త్రీల పైన పడింది.

pc:youtube

 7. వ్యాపారబాధ్యతలు

7. వ్యాపారబాధ్యతలు

అప్పుడే అక్కడి స్త్రీలు ఇలా ప్రత్యేకంగా ఒక కూటమిగా ఏర్పడి వ్యాపారబాధ్యతలను తీసుకోవటమే ఈ మార్కెట్ ఏర్పడటానికి కారణం అని ఒక కథనం. అప్పటినుండి ఈ సంప్రదాయం చెడకుండా మార్కెట్ ఇలా కొనసాగుతూనే వుందట.

pc:youtube

8.అభాగ్యులకు ఆసరా

8.అభాగ్యులకు ఆసరా

ఈ మార్కెట్ ను కేవలం మార్కెట్ గా చూస్తే పొరపాటే. ఇది అభాగ్యులకు ఆసరాగా కూడా నిలబడింది. ఎంతోమంది స్త్రీలు తమ కాళ్ళ మీద నిలబడి స్వతంత్ర్యంగా జీవించటానికి అవకాశం కలిపిస్తున్న మార్కెట్. ఈ మదర్స్ మార్కెట్.

యుద్ధ భూమి...ఇంఫాల్ పట్టణం !!

pc:youtube

9. తల్లి నుంచి పిల్లలకు వారసత్వం

9. తల్లి నుంచి పిల్లలకు వారసత్వం

ఇక్కడ దుకాణాలను నిర్వహించటానికి లైసెన్సులు పొందవలసి వుంటుంది. తరతరాలుగా తల్లి నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తున్న ఇక్కడ దుకాణాలు పెట్టుకోవటానికి ఎక్కువగా కుటుంబ బాధ్యతలు మోస్తున్న స్త్రీలకు, ఏ ఇతర ఆసరా లేని స్త్రీలకూ ప్రాధాన్యత వుంటుంది.

pc:youtube

10. ఆడవారి బజార్

10. ఆడవారి బజార్

భూటకపు ఎంకౌటర్లలో భర్తలను కోల్పోయిన వారు, ఇతరత్రా అన్యాయాలకు గురైనవారు కూడా ఇక్కడ లైసెన్స్ లేకుండానే బజార్ నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కేవలం ఆడవారికే పరిమితమైన ఈ ఆడవారి బజార్ లో వస్తువులు కొనుక్కోడానికైతే సరే కానీ, అమ్మడానికి మాత్రం మగవారికి అవకాశం లేదు.

pc:youtube

11. మహిళావర్తకులు

11. మహిళావర్తకులు

ఎవరైనా మగవారు దుకాణాలు నిర్వహించటానికి ప్రయత్నిస్తే మాత్రం అస్సాలూరుకోరంట. వారిని అక్కడి నుండి తరిమికొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తారట ఇక్కడి మహిళావర్తకులు. వీరు కేవలం వర్తకంలోనే కాదు సామాజిక కార్యక్రమాలలో కూడా ముందుంటారట. స్త్రీల పట్ల జరిగే అన్యాయాలను ఎదిరించటానికి, పోరాడటానికి నిరంతరం కృషి చేస్తారంట.

pc:youtube

12. నిలువెత్తు నిదర్శనం

12. నిలువెత్తు నిదర్శనం

నిరంతరం తమ మార్కెట్ ను అభివృద్ది చేసుకొనుటకు పాటుపడతారు. మహిళా సాధికారతకు ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ మార్కెట్. ఆడవాళ్ళ బజారు ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా కూడా పెరుపొందింది. మణిపూర్ లోని అందమైన లోయలను ప్రదేశాలను చూడటానికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఈ మార్కెట్ ను కూడా చూసే వెళతారు.

pc:youtube

13. అమ్మలబజార్

13. అమ్మలబజార్

సాధారణంగా పర్యాటక ప్రాంతాలలో వ్యాపారులు పర్యాటకులతో కాస్త మోసపూరితంగాను, దురుసుగా వ్యవహరించటం మనం చూస్తాం. కానీ ఇక్కడ దుకాణాదారులు పర్యాటకులతో చాలా మర్యాదగా, ఆదరంగా, న్యాయపూరితంగా వ్యవహరిస్తారట. ఇన్ని ప్రత్యేకతలు కలిగింది కాబట్టే తరాలుగా తన ప్రత్యేకతను కాపాడుకుంటూ వస్తోంది ఈ అమ్మలబజార్.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X