Search
  • Follow NativePlanet
Share
» »ఏడు క్షేత్రాల దర్శనంతో కోటి పాపాలు ప్రక్షాళన అవుతాయి

ఏడు క్షేత్రాల దర్శనంతో కోటి పాపాలు ప్రక్షాళన అవుతాయి

సప్తపురి క్షేత్రాలకు సంబంధించిన కథనం.

అఖండ భారత దేశంలో అతి పురాతన, పురాణ కాలం కంటే ప్రాచీన మైన ఏడు క్షేత్రాలు ఉన్నాయి. వీటినే సప్త పురాలు అని అంటారు. హిందూ పురాణాలను అనుసరించి భారత జీవిత చరమాంకంలో ఈ ఏడు క్షేత్రాలను సందర్శిస్తే పాపాలన్నీ సమిసి పోయి స్వర్గ లోక ప్రాప్తి దొరుకుతుందని ప్రజల నమ్మకం.

పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత తమ బ్రహ్మణ, గురువు, బంధు తదితర హత్య దోష నివారణ కోసం ఈ ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించి అటు పై మాత్రమే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెబుతారు.

ఈ ఏడు క్షేత్రాల్లో అటు వైష్ణవ క్షేత్రాలతో పాటు ఇటు శైవ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందువల్లే ఈ సప్తపురి క్షేత్రాలను అటు వైష్ణవులతో పాటు శైవులు కూడా సందర్శించి తమ పాపాలను పోగొట్టుకొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ ఏడు క్షేత్రాలకు సంబంధించిన కథనం మీ కోసం...

అయోధ్య

అయోధ్య

P.C: You Tube

రామజన్మ భూమి అని ప్రసిద్ధి. మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం ఇదే. రామాయన కాలం కంటే ముందే సాకేత పురమనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. స్కంధ పురాణంలో అయోద్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

అధర్వణ వేదంలో కూడా

అధర్వణ వేదంలో కూడా

P.C: You Tube

అంతే కాకుండా అధర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు. దేవుడు నిర్మించిన నగరం కాబట్టి ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగినదని భక్తుల నమ్మకం. సరయూ నది ఒడ్డున నిర్మించిన ఈ అయోధ్యను ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకొంటూ ఉంటారు.

ఫైజాబాద్ నుంచి

ఫైజాబాద్ నుంచి

P.C: You Tube

కోసల సామ్రాజ్య రాజధాని అయిన అయోథ్య ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో ఉంది. ఫైజాబాద్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరానికి వెళ్లడానికి అనేక బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

ద్వారక

ద్వారక

P.C: You Tube

సప్తపురి క్షేత్రాల్లో ద్వారక కూడా ఒకటి. విష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీ క`ష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతంగా ద్వారకకు పేరుంది. గుజరాత్ లోని గోమతి నదీ తీరంలో ఉంది. ద్వారకాదీశ దేవాలయం, రుక్మిణి దేవాలయం, శారదాపీఠం వంటి అనేక ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి.

శారదా పీఠాల్లో ఒకటి

శారదా పీఠాల్లో ఒకటి

P.C: You Tube

ఇందులో చాలా మంది హిందువులు సందర్శించే ప్రసిద్ధ క్షేత్రం ద్వారకాధీశ దేవాలయం. ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు స్థాపించిన నాలుగు శారద పీఠాల్లో ద్వారక కూడా ఒకటి. పశ్చిమ శారదా పీఠం ద్వారకలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి అత్యంత శక్తి ఉందని నమ్ముతారు.

గోమతి నదీ తీరంలో

గోమతి నదీ తీరంలో

P.C: You Tube

సంస్క`తంలో ద్వార అంటే ప్రవేశం అని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందువల్లే పురాణ కాలం నుంచి ద్వారకా మోక్షానికి ప్రవేశ ద్వారమని పేరుగాంచింది. గోమతి నదీలో స్నానం చేసి ఇక్కడి ద్వారకాధీశుడిని సందర్శించుకొంటే మోక్షం తథ్యమని చెబుతారు.

మధురా

మధురా

P.C: You Tube

శ్రీక`ష్ణుడి జన్మస్థానమే మధురా. ద్వాపర కాలం నుంచి ఇప్పటి వరకూ ఈ మధురా ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీనిని ల్యాండ్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అని పిలుస్తారు. శ్రీ క`ష్ణ భగవానుడు తన భాల్యంలో గీపికలతో గడిపన స్థలం ఇదే కాబడ్డి దీనికి ఆ పేరు వచ్చింది.

జన్మాష్టమి వేడుకలు

జన్మాష్టమి వేడుకలు

P.C: You Tube

మధురలో ఇప్పటికీ ప్రతి వీధి ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ లో ఉన్న మధుర ఆగ్రా, డిల్లీ నుంచి వరుసగా 57 కిలోమీటర్లు, 162 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుకొంటారు.

ఉజ్జయినీ

ఉజ్జయినీ

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. క్షిప్రా నదీ తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం అటు వైష్ణవులకు, ఇటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరంగా పేరుగాంచింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

జ్యోతిర్లింగాల్లో ఒకటి

జ్యోతిర్లింగాల్లో ఒకటి

P.C: You Tube

మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేశ, గోపాల మందిర తదిర దేవాలయాలు ఉజ్జని పుణ్యక్షేత్రంలో అడుగడుగునా కనిపిస్తాయి. ముఖ్యంగా మహాకాళేశ్వర దేవాలయం దేశంలో పరమ పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.

హరిద్వార్

హరిద్వార్

P.C: You Tube

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో విశిష్టమైన పుణ్యక్షేత్రంగా చెబుతారు. ఢిల్లీ నుంచి 212 కిలోమీటర్ల దూరంలోని ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. గంగానది గంగోత్రి వద్ద జన్మించి దాదాపు 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార లోనే ఉద`తంగా ప్రవహించడం మొదలు పెడుతుంది.

గంగాద్వారం

గంగాద్వారం

P.C: You Tube

అందువల్లే హరిద్వార్ ను గంగా ద్వారమని కూడా పిలుస్తారు. అందువల్ల హరిద్వార్ ను అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణిస్తారు. ఇక్కడ విష్ణువు పాదాలను మనం చూడవచ్చు. గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరమని పిలుస్తారు. అమ`తాన్ని గరుడు తీసుకువెళ్లే సమయంలో ఇక్కడ ఒక చుక్క పడిపోయిందని చెబుతారు.

కుంభమేళ

కుంభమేళ

P.C: You Tube

అందువల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి మోక్షం తథ్యమని భక్తులు నమ్ముతారు. అందువల్లే కుంభమేళ జరిగే సమయంలో లక్షల మంది హరిద్వార్ ను చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తారు. హరిద్వార్ లో ఆ బిందువులు పడిన ప్రాంతాన్ని హరి కి పౌరి అని పిలుస్తారు.

వారణాసి

వారణాసి

P.C: You Tube

కాశీ, బనారస్ అని కూడా వారణాసికి పేరు. శివుడు ఇక్కడ నివశిస్తాడని భక్తుల విశ్వాసం. అందువల్లే ఈ పుణ్యక్షేత్రానికి హిందూ ధార్మిక పర్యటనలో విశిష్ట స్థానం కల్పించారు. ప్రజలు ఆవాసం ఏర్పరుచుకొన్న నగరాల పైకి ఆసియా ఖండంలోనే వారణాసి అతి ప్రాచీనమైనది.

పురాణాలకు పూర్వమే

పురాణాలకు పూర్వమే

P.C: You Tube

పురాణాలకు పూర్వమే ఈ నగరం ఉందని చెబుతారు. గంగానది తీరంలో వెలిసిన వారణాసిలో ప్రతి అడుగుకూ ఒక దేవాలయం ఉంటుంది. హిందూ ధర్మాలను, ఆచార వ్యవహారాలను దగ్గర నుంచి చూడాలనుకొనేవారు తమ జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా వారణాసికి ఒకసారి వెలుతారు.

జ్యోతిర్లింగాల్లో ఒకటి.

జ్యోతిర్లింగాల్లో ఒకటి.

P.C: You Tube

పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఈ వారణాసిలో ఉంది. ఇక్కడ చనిపోతే లేదా చనిపోయిన వ్యక్తి అంత్య సంస్కారాలు ఇక్కడ జరిపితే అతనికి మోక్షం లభించి నేరుగా స్వర్గానికి పోతారని భక్తుల నమ్మకం. అందువల్లే జీవిత చరమాంకంలో చాలా మంది ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతారు.

కాంచిపురం

కాంచిపురం

P.C: You Tube

సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచిపురం. ఇక్కడ ఉన్న దేవాలయాల్లో ప్రమఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం. మిగిలిన శక్తి పీఠాల కంటే ఇది భిన్నమైనది. ఇక్కడ శివుడు కూడా ఉంటాడు.

చెన్నై నుంచి

చెన్నై నుంచి

P.C: You Tube

అందవల్లే శైవులకు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని కాంచి అని కూడా పిలుస్తారు. దేవాలయాల రాష్ట్రంగా పిలిచే ఈ కాంచిపురానికి చెన్నై నుంచి కేవలం 72 కిలోమీటర్ల దూరం
ప్రయాణించి చేరుకోవచ్చు. వివిధ నగరాల నుంచి కూడా బస్సు రైలు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X