Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో శ్రీ చక్రం ఆకారంలో కన్పించే స్వర్ణాలయ సందర్శనతో అష్టైశ్వర్యాలు మీవే

ప్రపంచంలో శ్రీ చక్రం ఆకారంలో కన్పించే స్వర్ణాలయ సందర్శనతో అష్టైశ్వర్యాలు మీవే

వందఎకరాల విస్తీర్ణం, 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, ఆరేళ్ల నింరత శ్రమ, దాదాపు రూ.600 కోట్ల రుపాయల సొమ్ము. ఇది క్లుప్తంగా తమిళనాడులోని శ్రీపురం లక్ష్మీ నారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం గురించి. అందువల్లే ఈ స్వర్ణదేవాలయం పంజాబ్ లోని అమత్ సర్ లోని స్వర్ణ దేవాలయం అంతటి ప్రాచూర్యాన్ని పొందింది.

తిరుపతికి వెళ్లేవారిలో దాదాపు సగం మంది ఈ లక్ష్మీ నారాయణి అమ్మవారిని తప్పక సందర్శిస్తూ ఉంటారు. చిత్తూరు నుంచి కేవలం 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా బాగుంటుంది. ఇక తిరుపతి నుంచి 134 కిలోమీటర్ల దూరంలో ఉన్నీ ఈ దేవాలయానికి దగ్గర్లో కాట్పాడి రైల్వే స్టేషన్ ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు మీ కోసం....

శక్తి అమ్మ

శక్తి అమ్మ

P.C: You Tube

ఈ ఆలయం వెనుక ఉన్న వ్యక్తి శక్తిఅమ్మ. ఈయన అసలు పేరు సతీష్ కుమార్. సొంతూరు వేలూరు. చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో నడిచిన ఆయన 16వ ఏట శక్తి అమ్మగా తన పేరును మార్చుకొన్నాడు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించాడు. శ్రీపురం వద్ద అమ్మవారు ఆయనకు కాంతి రూపంలో కనిపించారని చెబుతారు.

విదేశీ విరాళాలే

విదేశీ విరాళాలే

P.C: You Tube

అక్కడే ఆయన నారాయణి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ స్వర్ణ దేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకించినవే.

వజ్రవైడూర్యాలు

వజ్రవైడూర్యాలు

P.C: You Tube

గర్భగుడిలో వజ్రాలు, వైఢూర్యాలతో పొందిగిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామర పై ఆసీనమై మహాలక్ష్మీ దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుకొని అమ్మవారిని సందర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది. మిగిలిన దేవాలయల్లో మాదిరి దర్శన విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులూ విభాగాలూ లేవు. అందుకూ ఒకే వరుసలో వెళ్లి అమ్మవారిని సందర్శించుకోవాల్సి ఉంటుంది.

అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం కంటే పెద్దది

అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం కంటే పెద్దది

P.C: You Tube

శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణీ దేవాలయం వ్యయం పరంగా, విస్తీర్ణం పరంగా అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం కంటే పెద్దది. నిర్మాణానికి అవసరమైన బంగారం కొనుగోలులో పారదర్శకత పాటించారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొంది మినరల్స్ అండ్ మెటల్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేశారు. తిరుపతి ఆలయం వలే ఇక్కడ ఆలయానికి చుట్టూ 36 స్తంభాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న ఫాండ్లియర్ పూర్తిగా బంగారంతో చేసిందే.

ప్రత్యేకమైన లైటింగ్

ప్రత్యేకమైన లైటింగ్

P.C: You Tube

ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహంతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు. ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. ఆలయానికి ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X