Search
  • Follow NativePlanet
Share
» » భక్తుడి పెళ్లి సాక్షం చెప్పడానికి కాశీ నుంచి వచ్చి ఇక్కడే కొలువైన నారాయణుడు

భక్తుడి పెళ్లి సాక్షం చెప్పడానికి కాశీ నుంచి వచ్చి ఇక్కడే కొలువైన నారాయణుడు

పొన్నూరులోని సాక్షి భావనారాయణ స్వామి దేవాలయం గురించి కథనం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో పొన్నూరు ఉంది. పొన్నూరు అనే పదం పొన్, ఊరు అనే రెండు పదాల కలయిక వల్ల వచ్చింది. పొన్ అంటే బంగారం అని ఊరు అంటే గ్రామం అని అర్థం. అందుకే ఈ గ్రామాన్ని బంగారు గ్రామం, స్వర్ణపురి పేర్లతో కూడా పిలుస్తారు.

ఓ సాధారణ భక్తుడి కోసం ఆ శ్రీమన్నారాయణుడు, కాశీ విశ్వేశ్వరుడితో సహా ఇక్కడికి వచ్చాడని చెబుతారు. అలా వచ్చిన నారాయణుడు సాక్షం చెప్పి ఆ భక్తుడి వివాహం జరిగేలా చూస్తాడు.

అందువల్లే ఇక్కడ ఉన్న భావనారాయణుడిని సాక్షి భావనారాయణుడు అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఆ పొన్నూరు సాక్షి భావనారాయణుడి దేవాలయానికి సంబంధించిన క్లుప్త కథనం మీ కోసం...

సాక్షి భావనారాయణ స్వామి

సాక్షి భావనారాయణ స్వామి

P.C: You Tube

పూర్వం పొన్నూరులో కేశవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. దీంతో సంతానం కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించేవాడు. ఈ యాత్రల్లో తన కుటుంబ సభ్యలతో పాటు మేనల్లుడైన గోవిందుడిని కూడా వెంటబెట్టుకొని వెళ్లేవాడు. ఈ క్రమంలోనే కేశవయ్య కాశీని సందర్శిచి అక్కడ నారాయణుడి దేవాలయంలో తనకు సంతాన ప్రాప్తి కలిగించాలని వేడుకొన్నాడు.

సాక్షి భావనారాయణ స్వామి

సాక్షి భావనారాయణ స్వామి

P.C: You Tube

అదే సమయంలో అక్కడే ఉన్న గోవిందుడు ఈసారి నీకు ఆడపిల్ల ఖచ్చితంగా కలుగుతుంది. అలా జరిగితే తనకు ఇచ్చి వివాహం చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు కేశవయ్య సరేనన్నాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు కేశమయ్య దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెకు అక్క లక్ష్మి అని పేరుపెట్టాడు. ఆమెకు యుక్త వయస్సు కూడా వచ్చింది.

సాక్షి భావనారాయణ స్వామి

సాక్షి భావనారాయణ స్వామి

P.C: You Tube

అయితే గూనివాడైన గోవిందుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాడనికి కేశవయ్య నిరాకరించాడు. దీంతో గోవిందుడు కాశీలోని నారాయణుడిని దేవాలయం వద్దకు వెళ్లి స్వామి ముందు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. నీ సమక్షంలోనే కేశవయ్య తనకు కూతురును ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు కదా? ఇప్పుడు నీవే వచ్చి ఈ విషయం చెప్పి తనకు తన మామ కూతురుతో పెళ్లి అయ్యేలా చూడాలని ప్రార్థించాడు.

సాక్షి భావనారాయణ స్వామి

సాక్షి భావనారాయణ స్వామి

P.C: You Tube

దీంతో నారాయణుడు అతనితో పాటు పొన్నూరు వచ్చి తన ఆలయంలో జరిగిన విషయం మొత్తం అక్కడివారికి తెలిపి గోవిందుడి వివాహం జరిపించాడని పురాణ కథనం. అటు పై ఇక్కడే నారాయణుడు సాక్షి భావనారాయణుడిగా కొలువై ఉండిపోతాడు. ఇదిలా ఉండగా వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బందులు పడేవారు ఈ స్వామివారిని సందర్శించుకొంటే ఆ సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం.

సాక్షి భావనారాయణ స్వామి

సాక్షి భావనారాయణ స్వామి

P.C: You Tube

అందువల్లే చలా దూరం నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో విశాలాక్షీ సమేత విశ్వేశ్వరుడు, చెన్నకేశవ స్వామి, లక్ష్మీ నరసింహుడు, వినాయకుడు, దాసాంజనేయ స్వామి ఆలయాలు దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X