Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ మీరు స్నానం చేయలేరు...ఒకవేళ చేస్తే నిత్య యవ్వనం

ఇక్కడ మీరు స్నానం చేయలేరు...ఒకవేళ చేస్తే నిత్య యవ్వనం

కడపలో ఉన్న పుష్పగిరి క్షేత్రానికి సంబంధించిన కథనం.

పుష్పగిరి... శివ కేశవుల మధ్య అభేద్యానికి ప్రతీక. ఈ క్షేత్రంలో శివుడు క్షేత్రాధిపతి కాగా, విష్ణువు క్షేత్ర పాలకుడు. ఇక పుష్పగిరికి ఆనుకొని ఉన్న పినాకినిలో అక్షయ తతియ రోజున సూర్య గ్రహణ సమయంలో స్నానం చేసి ఈ శివ కేశవులను దర్శిస్తే వంద అశ్యమేథయాగాలు చేసిన ఫలితం లభిస్తుందని పురాణోక్తి. జగద్గురువు ఆది శంకరాచార్య చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపించబడిన ఏకైక అద్వైత పీఠం ఈ పుష్ఫగిరి. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో పుష్ఫగిరి ఉంది. ఈ పుష్పగిరికి ఇక్కడి సరస్సుకు, అందులో స్నానం చేస్తే యవ్వనం రావడానికి ఉన్న సంబంధం విషయం పై పూర్తి వివరాలు మీ కోసం...

అందువల్లే దక్షిణ కాశి

అందువల్లే దక్షిణ కాశి

P.C: You Tube

పుష్పగిరి గ్రామానికి కొండకు మధ్య ప్రవహిస్తున్న పెన్నానది కాశీలోని గంగానది లాగా దక్షిణ దిశగా ప్రవహిస్తూ తూర్పు దిశగా అర్థచంద్రాకారంలో సాగిపోతుంది. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని పేరు. కాశీలో అద్వైత మత అవలంబకులు, గయలో విశిష్టాద్వైత మత అవలంబకులు పిండ ప్రదానం చేయడం పరిపాటి. కానీ ఆ రెండు మతాలను అవలంభించేవారు పుష్పగిరిలో పిండ ప్రదానం చేయడం విశేషం.

తల్లి దాస్యాన్ని వదిలించడానికి

తల్లి దాస్యాన్ని వదిలించడానికి

P.C: You Tube

కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత భార్యలు. భాప కారణంగా కద్రువకు వినత దాస్యం చేయాల్సి వచ్చింది. తల్లి పడుతున్న బాధలను చూసిన గరుక్మంతుడు ఆమె దాస్య విముక్తికి అమతాన్ని తీసుకు వస్తుంటాడు. ఆ సమయంలో ఒక అమత బిందువు తొణికి భూలోకంలోని కాంపెల్లె వద్ద ఉన్న సరస్సులో పడింది.

ముసలి దంపతులు

ముసలి దంపతులు

P.C: You Tube

ఒక రోజు ముసలి దంపతులు ఇందులో నీళ్లను తాగడానికి దిగుతారు. ఆ నీటిని తాగిన వెంటనే వారు యవ్వన దంపతులుగా మారుతారు. ఈ విషయం తెలిసిన చాలా మంది అక్కడికి వచ్చి ఆ సరస్సులోని తాగి యవ్వన వంతులవుతారు. అంతేకాకుండా వారికి చావు కూడా ఉండదు. దీంతో స`ష్టి ధర్మం గతి తప్పుతుంది. విషయాన్ని యముడు నారదుడి ద్వారా త్రిమూర్తులకు తెలుపుతాడు.

హనుమంతుడు

హనుమంతుడు

P.C: You Tube

విషయం తెలుసుకొన్న త్రిమూర్తల ఆజ్జమేరకు హనుమతుందు ఒక పెద్ద కొండను తెచ్చి సరస్సులో వేస్తాడు. అయితే అత ప్రభావంతో ఆ కొండ నీటిలో పుష్పంలో తేలింది. దీంతో త్రిమూర్తులు తమ పాదాలతో దాన్ని అణగదొక్కారు. దానికి గుర్తుగా నేటికీ కొండ పై పశ్చిమ భాగంలో రుద్ర పాదం, తూర్పున విష్ణు పాదం, ఉత్తరాన బ్రహ్మపాదాలు ఉన్నాయి. నీటి పై పుష్పం వలే తేలియడింది కావున నాటి నుండి కాంపల్లె గ్రామం పుష్పగిరిగా పేరుగాంచిందని చెబుతారు.

అమరత్వం పొందుతారు.

అమరత్వం పొందుతారు.

P.C: You Tube

ఇప్పటికీ ఆ సరస్సు వల్ల అమరత్వం పొందిన అంటే చావును జయించిన వారు ప్రతి రోజు ఆ కొండ కింద ఉన్న సరస్సు ఒడ్డున ఉన్నారని చెబుతారు. ప్రస్తుతం ఆ కొండ కింద ఉన్న సరస్సులో స్నానం చేయడానికి వీలుకాదు. ఒకవేళ స్నానం చేస్తే మాత్రం వారు అమరత్వం పొందుతారని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X