Search
  • Follow NativePlanet
Share
» »ఈ క్షేత్రంలో పువ్వు కింద పడితే ‘కడుపున కాయ కాసినట్లే’

ఈ క్షేత్రంలో పువ్వు కింద పడితే ‘కడుపున కాయ కాసినట్లే’

నెల్లూరు దగ్గరగా ఉన్న సిద్దుల కొండ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

ఆ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత మాత్రమే చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఆలయానికి తలుపులు ఉండవు. కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారమైన ఆ గుడిలోని దైవానికి మంత్ర పుష్పం పేరుతో ప్రత్యేక అర్చన చేస్తారు.

ముఖ్యంగా అక్కడ ఉన్న రెండు విగ్రహాల పై పువ్వులు పెడుతారు. ఆ పువ్వులు కిందికి రాలితే తమకు సంతానం కలుగుతుందని భక్తులు విశ్వాసం. ఇక ఆలయం దగ్గరే అరుదైన నవగ్రహాల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నవగ్రహాలు వారి భార్యలతో సహా కొలువై ఉన్నారు.

ఈ క్షేత్రంలో రాహు, కేతు పరిహార పూజలు కూడా జరుగుతాయి. అంతే కాకుండా ఇక్కడ ఉన్న ఏడు సరస్సుల్లో స్నానం చేస్తే ఎంతటి పాపాలైనా సమిసిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఈ విశిష్టమైన దేవాలయం గురించిన వివరాలు మీ కోసం

దట్టమైన అడవి ప్రాంతం

దట్టమైన అడవి ప్రాంతం

P.C: You Tube

ప్రస్తుతం సిద్దుల కొండగా పిలిచే ప్రాంతం దాదాపు రెండు శతాబ్దాల క్రితం ఒక దట్టమైన అడవి. ఇక్కడ స్థానిక గిరిజనులు గోవులను కాసేవారు. ఈ క్రమంలోనే ఒక గిరిజనుడు గోవులను కాస్తూ అడవిలో దారి తప్పిపోయాడు.

ఇద్దరు మునులు

ఇద్దరు మునులు

P.C: You Tube

ఇక సాయంత్రం కాగానే అడవిలో చీకటి అలుముకోంది. అయితే ఒక చిన్న గుట్ట పై నుంచి దేదీప్యమానంగా వెలుగు రావడం గమనించిన ఆ గిరిజనుడు అక్కడికి చేరుకొన్నాడు. గిరిజనుడికి అక్కడ ఇద్దరు మునులు తపస్సు చేసుకొంటూ కనిపించారు.

వారి శరీరం నుంచి వెలుగు

వారి శరీరం నుంచి వెలుగు

P.C: You Tube

వారి శరీరం నుంచే ఆ వెలుగు రావడం గమనించాడు. వారి తపస్సును భంగం చేయడం ఇష్టంలేని ఆ గిరిజనుడు మూడు రోజుల పాటు అలాగే వారిని చూస్తూ అక్కడ ఉండిపోయాడు. నాలుగో రోజు ఆ ఇద్దరు మునులు కళ్లు తెరవగానే ఎదురుగా గిరిజనుడు కనిపించాడు.

పల్లెకు వెలుతాడు

పల్లెకు వెలుతాడు

P.C: You Tube

దీంతో వారు ఇక్కడ చూసిన విషయం ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. ఒక వేళ చెబితే నీవు వెంటనే చనిపోతావని చెప్పి అక్కడి నుంచి గిరిజనుడిని పంపించివేశారు. దీంతో ఆ గిరిజనుడు భయంభయంగా ఊరికి వెళుతాడు.

మొత్తం వివరిస్తాడు

మొత్తం వివరిస్తాడు

P.C: You Tube

నాలుగు రోజుల తర్వాత ఊరిలోకి వచ్చిన గిరిజనుడిని అక్కడి వారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? అడవిలో ఎలా బతికి ఉన్నావు? అని ప్రశ్నల పై ప్రశ్నలు కురిపించాడు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆ గిరిజనుడు జరిగిన విషయం మొత్తం తన ఊరివారికి వివరించాడు.

చనిపోతాడు

చనిపోతాడు

P.C: You Tube

దీంతో వెంటనే ఆ గిరిజనుడు చనిపోతాడు. జరిగిన తప్పు తెలుసుకొన్న గ్రామప్రజలందరూ గిరిజనుడు చెప్పిన ఆనవాళ్లను అనుసరించి అడవిలో ఆ మునులు ఉన్న చోటుకు చేరుకొంటాడు. అయితే వారు అక్కడికి వెళ్లగానే మునులు రాతి విగ్రహాలుగా మారిపోతారు.

కోర్కెలు సిద్ధించడం

కోర్కెలు సిద్ధించడం

P.C: You Tube

దీంతో గ్రామస్తులు మిక్కిలి బాధపడి తమ తప్పును క్షమించమని వేడుకొంటారు. ఆ విగ్రహాలకు నవకోటి, నవనాధులని పేరుపెడుతారు అటు పై వారికి పూజలు చేస్తారు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత గ్రామస్తులు కోరిన కోర్కెలన్నీ సిద్ధించడం మొదలు పెడుతాయి.

అలా ఆ పేరు వచ్చింది

అలా ఆ పేరు వచ్చింది

P.C: You Tube

దీనికంతటికి కారణం ఆ మునులే అని భావించిన ఆ గ్రామస్తులు వారిని సిద్ధులని పిలవడం మొదలు పెడుతారు. ఇక దీంతో ఆ ప్రాంతం సిద్ధుల కొండగా పేరుపొందింది. ఆ క్షేత్రం వివరాలు తెలుసుకొన్న పక్క గ్రామాల వారు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు.

రాజ రాజ నరేంద్రుడు

రాజ రాజ నరేంద్రుడు

P.C: You Tube

ఇదిలా ఉండగా రాజరాజ నరేంద్రుడి కుమారుడు సారంగధరుడు. అత్యంత అందగాడిగా ఈయనకు ఆ కాలంలో పేరుండేది. యుక్త వయస్సురాగానే సారంగధరుడికి పెళ్లిచేయాలని భావించిన రాజ రాజ నరేంద్రుడు వివిధ దేశాల నుంచి యువరాజుల చిత్రాలను తెప్పిస్తాడు.

చిత్రాంగి

చిత్రాంగి

P.C: You Tube

అందులో చిత్రాంగి అనే పేరుగల యువరాణి రాజ రాజ నరేంద్రుడికి బాగా నచ్చుతుంది. దీంతో ఆ చిత్రాంగిని రాజ రాజ నరేంద్రుడే బలవంతంగా పెళ్లి చేసుకొంటాడు. అయితే ఆ చిత్రాంగికి సారంగధరుడంటే ఇష్టం.

బలాత్కారం

బలాత్కారం

P.C: You Tube

ఈ నేపథ్యంలో ఒకసారి రాజ రాజ నరేంద్రుడు అంత:పురంలో లేని సమయంలో సారంగధరుడి వద్దకు వెళ్లి చిత్రాంగి తన కోరికను తీర్చాల్సిందిగా బలవంతం చేస్తుంది. అయితే సారంగధరుడు ‘నీవు నాకు తల్లితో సమానం' అని బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేస్తాడు.

సారంగధరుడు

సారంగధరుడు

P.C: You Tube

దీనిని అవమానంగా భావించిన చిత్రాంగి రాజరాజ నరేంద్రుడు కోటకు తిరిగి వచ్చిన తర్వాత సారంగధరుడు నన్ను బలత్కారించబోయాడని అబద్ధం చెబుతుంది. దీంతో కోపగించుకొన్న రాజు సారంగధరుడి కాళ్లు, చేతులు నరికేయాల్సిందిగా ఆదేశిస్తాడు.

కత్తుల కొండ

కత్తుల కొండ

P.C: You Tube

రాజు ఆదేశాల ప్రకారం భటులు సారంగధరుడిని ప్రస్తుత సిద్ధల కొండ దగ్గర ఉన్న సైదాపురం మండలం, చాగాణం సమీపంలోని కత్తుల కొండకు తీసుకువెళ్లి కాళ్లు చేతులు నరికేస్తారు. అవిటివాడైన సారంగధరుడు ఎలాగో సిద్దుల కొండకు చేరుకొంటారు.

సారంగధరుడి విగ్రహం కూడా

సారంగధరుడి విగ్రహం కూడా

P.C: You Tube

అక్కడి సిద్దులు ఈయన బాధను తెలుసుకొని సాంత్వన చేకూరుస్తారు. ఈ క్రమంలో సారంగధరుడు ఇక్కడే తపస్సు చేసుకొంటూ శివైఖ్యం పొందారని కూడా చెబుతారు. అందుకు గుర్తుగా ఇక్కడ సారంగధరుడి విగ్రహం కూడా చూపిస్తారు.

తలుపులు ఉండేవి కావు

తలుపులు ఉండేవి కావు

P.C: You Tube

ఇదిలా ఉండగా సిద్ధులు విగ్రహాలుగా మారిన చోట ఆలయాన్ని నిర్మించి తలుపులు బిగించారు. అయితే కొన్ని రోజులకే ఆ ఆలయ తలుపులు ఉండేవి కావు. ఇలా కొన్ని పదుల సార్లు జరిగాయి. దీంతో సిద్ధులకు తలుపులు ఇష్టం లేదని భావించిన భక్తులు ఆలయానికి తలుపులు ఏర్పాటు చేయడం మానేశారు. అందువల్లే ఈ దేవాలయానికి తలుపులు ఉండవు.

మంత్రపుష్పం

మంత్రపుష్పం

P.C: You Tube

ఆలయంలోని మరో విశేషం మంత్రపుష్పం. భక్తులు ఒక పువ్వును తీసుకొని ఏదైనా కోర్కెను కోరుకొని ఆలయంలోని నవకోటి, నవనాధుల శిలామూర్తుల పై ఉంచుతారు. అది కిందపడితే తమ కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్మకం.

సంతానం లేనివారు

సంతానం లేనివారు

P.C: You Tube

ముఖ్యంగా సంతానం లేని వారు ఈ మంత్రపుష్పం పూజలో పాల్గొంటారు. సంతానం కలిగితే పిల్లలకు సిద్ధలయ్య, నవకోటి, నవనాథ, సారంగధరుడు అనే పేర్లు పెడుతారు. అందువల్లే ఈ ప్రాంతంలో ఈ పేర్లు ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తుంటారు.

సర్పక్షేత్రం

సర్పక్షేత్రం

P.C: You Tube

ఈ కొండకు సమీపంలో బండపై సర్పాకారంలో వెలిసిన ఆకారాలను రాహు, కేతువులని చెబుతారు. అందుకే ఈ క్షేత్రానికి సర్పక్షేత్రమని పేరు. కొండ కింద అరుదైన విగ్రమాలుగా చెప్పే సతీ, సమేతంగా నవగ్రహాలు ఉంటాయి.

ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజలు

P.C: You Tube

ప్రతి ఏటా వసంతపంచమి రోజున చిన్నారులకు ఇక్కడ ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి, శివరాత్రుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక సోమవారాల్లో జరిగే ఉత్సవాలకు కడప, చిత్తూరు, చెన్నై ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

ఎలా వెళ్లాలి.

ఎలా వెళ్లాలి.

P.C: You Tube

నెల్లూరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ సిద్దుల కొండ క్షేత్రం కలదు. బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా గూడురు నుంచి ఈ సిద్దుల కొండకు కేవలం అరగంట ప్రయాణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X