Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ కూడా నాగ బంధం అందుకే రహస్యంగా నిధి అన్వేషణ

ఇక్కడ కూడా నాగ బంధం అందుకే రహస్యంగా నిధి అన్వేషణ

ఉండవల్లి లోని గుహాలయాలకు సంబంధించిన కథనం.

గత కొంత కాలంగా నాగబంధం, నిధి, అనంతమైన సంపద, అనంత పద్మనాభుడు అన్న పాదాలు మీడియాలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. కేరళలోని అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నేల మాళిగల్లో ఒక ద్వారానికి నాగ బంధం ఉందని దానిని తీయడానికి వీలుకావడ లేదని చెబుతున్నారు.

ఒకవేళ ఆ నాగ బంధ రహస్య వీడితే అనంతమైన సంపద మనకు దొరుకుతుందనేది ఆ వార్తల సారాంశం. అయితే అదే అనంత పద్మనాభుడు ఉన్న మరో చోట కూడా అదే నాగ బంధం ఉంది. అయితే అతి అస్పష్టంగా కనిపిస్తోంది. అయినా కూడా ఆ నాగబంధం ఉన్న చోట రహస్యంగా నిధి అన్వేషణ జరుగుతూ ఉంది. ఇందుకోసం అక్కడ ఉన్నటు వంటి అనేక శిల్పాలను ధ్వంసం కూడా చేశారు.

అయినా ఆ నాగ బంధం రహస్యం ఇప్పటికీ తేట తెల్లం కాలేదు. అందువల్లే అక్కడ మరింతగా నిధి కోసం తాము చేస్తున్న ప్రయత్నాన్ని వీడనాడలేనదు. ఈ నేపథ్ఆయంలో నాగ బంధం ఉన్న ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

 కొండను తొలుచుకొంటూ వెళ్లడం

కొండను తొలుచుకొంటూ వెళ్లడం

P.C: You Tube

కొండను తొలుచుకొంటూ వెళ్లి అలయాలను, విగ్రహాలను మలిచి నిర్మించిన కట్టడాలనే గుహాలయాలు అంటారు. భారత దేశంలో ఇటువంటి గుహాలయాలు చాలానే ఉన్నాయి. అందులో ఉండవల్లి గుహాలయాలు కూడా ఒకటి.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలో

P.C: You Tube

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి అతి ప్రాచీన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటి మంగళగిరి వైపున కొంత ముందుకు వెళితే ఉండవల్లి సెంటర్ వస్తుంది. విజయవాడ నుంచి ఇక్కడకు 11 కిలోమీటర్ల దూరం

 విష్ణు కుండినులు

విష్ణు కుండినులు

P.C: You Tube

ఇక్కడ నుంచి అమరావతి పైపు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే మనం ఉండవల్లి గుహాలయాలను చేరుకోవచ్చు. వీటిని దాదాపు క్రీస్తు శకం 420-620 మధ్య ఆంధ్రప్రదేశ్ ను పాలించిన విష్ణుకుండినుల కాలంలో వీటి నిర్మాణం సాగినట్లు చరిత్ర కారులు చెబుతారు.

పల్లవుల కాలం నాటిదని

పల్లవుల కాలం నాటిదని

P.C: You Tube

అయితే ఈ గుహాలయాల నిర్మాణం పూర్తి కాకుండా అసంపూర్తిగానే వదిలేశారు. ఇదిలా ఉండగా ఈ గుహాలయాలు పల్లవుల కాలం నాటివని వాదించేవారు కూడా ఉన్నారు. ఉండవల్లి గుహాలయాలు మొత్తం నాలుగు అంతస్తులు.

బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులు

బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులు

P.C: You Tube

ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లడానికి వీలుగా గుహ లోపలే మెట్లను కూడా నిర్మించారు. ప్రతి అంతస్తులోనూ విశాలమైన విహారాలు, మందిరాలు, అందమైన స్తంభాలు, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులకు సంబంధించిన అనేక విగ్రహాలను మనం ఇక్కడ చూడవచ్చు.

ఆ శిల్ప శైలి

ఆ శిల్ప శైలి

P.C: You Tube

మొదటి అంతస్తులో గుప్తుల, చాళుక్యుల కాలపు శిల్ప నిర్మాణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం పల్లవుల శైలి శిల్ప సౌదర్యాన్ని చూడవచ్చు. అయితే ఈ అంతస్తులోని శిల్పాల్లో కొన్ని అసంతపూర్తిగా ఉండటం గమనార్హం.

త్రిమూర్తుల ఆలయం

త్రిమూర్తుల ఆలయం

P.C: You Tube

దీని పై ఉన్న రెండో అంతస్తులో త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ఆలయాలు ఉన్నాయి. అయితే ఇందులోని విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అందువల్ల ప్రస్తుతం మనం శిథిలాలను మాత్రమే చూడగలం.

సొరంగ మార్గాన్ని

సొరంగ మార్గాన్ని

P.C: You Tube

మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్లే మెట్ల మార్గం పక్కనే ఉన్న స్థలంలో ఒక శాసనం కనిపిస్తుంది. ఈ శాసనంలో ఉన్న అక్షరాలను అనుసరించి పూర్వం మంగళగిరి పానకాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం నుంచి ఉండవల్లికి ఈ గుహాలయానికి సొరంగ మార్గం ఉండేదని తెలుస్తోంది.

సైనికులను తరలించేవారు

సైనికులను తరలించేవారు

P.C: You Tube

అదే విధంగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ సైన్యాన్ని ఈ రహస్య మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు రహస్యంగా తరిలించేవారని తెలుస్తోంది. ఇందుకు వినియోగించిన రహస్య మార్గాలను ప్రస్తుతం మూసివేశారు.

నాగ బంధం

నాగ బంధం

P.C: You Tube

ఇదిలా ఉండగా ఈ రహస్య మార్గాల్లో భూ మాళిగల్లో అనంతమైన నిధి ఉందని చెబుతారు. ఆ నిధికి నాగబంధాన్ని వేసి కట్టడి చేశారని చెబుతారు. సదరు నాగబంధాన్ని మనం ఈ ఉండవల్లి గుహాలయంలోని మూడో అంతస్తులో అస్పష్టంగా గమనించవచ్చు.

వివిధ దేవతా మూర్తులు

వివిధ దేవతా మూర్తులు

P.C: You Tube

రెండో అంతస్తును నుంచి మూడో అంతస్తులోకి ప్రవేశించడానికి ఉన్న మెట్లను కూడా అందంగా తీర్చి దిద్దారు. ఈ మూడో అంతస్తులో రెండు వరుసల స్తంభాల మధ్య విశాలమంటపం ఉంటుంది. ఈ స్తంభాల పై దశావతారాలు, వివిధ దేవతామూర్తలు శిల్పాలు మనలను ఇట్టే ఆకర్షిస్తాయి.

వినాయకుడి ప్రతిమ

వినాయకుడి ప్రతిమ

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ ఉన్న వినాయకుడి ప్రతిమ మనలను ఇట్టే ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఇక్కడి వినాయకుడి విగ్రహానికి ఉన్న తొండం పై నిజమైన చర్మం ఉన్నదా? అన్నట్లు ఆ విగ్రహం మలిచిన తీరు మనలను ఆకర్షిస్తుంది.

ఆది వరాహ మూర్తి

ఆది వరాహ మూర్తి

P.C: You Tube

ఇక దేశంలో అత్యంత అరుదుగా కనిపించే ఆది వరాహ మూర్తి కూడా ఈ ఉండవల్లి గుహాలయంలో మనం చూడవచ్చు. ఇక్కడ లక్ష్మీ సమేతుడై వరాహ రూపంలో శ్రీమన్నారయణుడు మనకు దర్శనమిస్తాడు.

విశిష్టమైన విగ్రహం

విశిష్టమైన విగ్రహం

P.C: You Tube

అదేవిధంగా ఇక్కడ ఉన్న మరో నరసింహ విగ్రహం కూడా చాలా విశిష్టమైనది. సాధారణంగా నరసింహస్వామి హిరణ్యకసిపుడిన సంహరించే సమయంలో మొహంలో ఉగ్రరూపం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం స్వామి మొహం ప్రసన్న వదనంతో ఉంటూ హిరణ్యకసిపుడిని చంపుతున్నట్లు ఉండటం విశేషం.

అనంత పద్మనాభుని విగ్రహం

అనంత పద్మనాభుని విగ్రహం

P.C: You Tube

అటు పక్కనే మనకు వామనావతార ఘట్టం కనిపిస్తుంది. ఇక ఈ ఉండవల్లి గుహలయాలకే ప్రత్యేకతను తీసుకువచ్చిన అనంత పద్మనాభ విగ్రహం ఈ మూడవ అంతస్తు చివరన కనిపిస్తుంది. దాదాపు 20 అడుగులు ఉన్న ఈ విగ్రహాన్ని నల్లని గ్రానైట్ తో రూపొందించారు.

జయ, విజేయులు పాదల చెంత

జయ, విజేయులు పాదల చెంత

P.C: You Tube

అయితే భక్తులు చల్లే పసుపు కుంకుమలతో ఆ నల్లని విగ్రహం కాస్త ఎర్రగా మారిపోయింది. ఇక ఇక్కడ అనంత పద్మనాభుని చుట్టూ దేవతలు నాట్యం చేస్తుండగా జయ, విజేయులు ఆయన పాదల చెంత ఉంటారు.

గరుక్మంతుడు కూడా

గరుక్మంతుడు కూడా

P.C: You Tube

అంతేకాకుండా అనేకమంది బుుషులు అనంతపద్మనాభుడి చుట్టూ ఉంటూ అయన్ను స్తుతిస్తున్నట్లు ఉంటుంది. అదేవిధంగా అనంత పద్మనాభుడి పైన గరుక్మంతుడు ఎగుతున్నట్లు ఉంటుంది.

బుుషి పుంగవులు

బుుషి పుంగవులు

P.C: You Tube

ఈ మూడవ అంతస్తు వెలుపల నాలుగు బుుషి పుంగవుల విగ్రహాలు, సింహం బొమ్మలు కనిపిస్తాయి. ఈ నాలుగు విగ్రహాలు నాలుగు వేదాలకు ప్రతీకగా చెబుతారు. అందుకు తగ్గట్లు వారి చేతిలో ఉన్న జపమాలతో పాటు తాళపత్రగ్రంధాలను చూపిస్తారు.

అసంపూర్తిగా

అసంపూర్తిగా

P.C: You Tube

ఇక ఈ మూడో అంతస్తు పై భాగంలో ఉన్న నాలుగో అంతస్తును చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. అయితే ఈ నాలుగో అంతస్తు అసంపూర్తిగా మిగిలిపోయి ఉంది. అక్కడక్కడ బౌద్ధ మతానికి సంబంధించినట్లుగా అనిపించే విగ్రహాలు కన్పించినా ఎక్కువ వైష్ణవ సంబంధ విగ్రహాలే మనం ఇక్కడ చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X