Search
  • Follow NativePlanet
Share
» »కాకులు వాలని క్షేత్రం, అందుకే శని నుంచి దూరం కోసం లక్షల మంది భక్తులు ఇక్కడకు

కాకులు వాలని క్షేత్రం, అందుకే శని నుంచి దూరం కోసం లక్షల మంది భక్తులు ఇక్కడకు

ఈ క్షేత్రంలో విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసి బ్రహ్మర్షి పదవిని పొందాలని ప్రయత్నించాడు. ఇందు కోసం శివలింగాన్ని కూడా ప్రతిష్టించాడు. అయితే ఆయన తపో దీక్షకు భగ్నం కలిగించడానికి కాకాసురడనే రాక్షసుడు విఫలయత్నం చేశాడు.

ఈ క్రమంలో విశ్వామిత్రుడి శాపం వల్ల ఇక్కడ ఆ పురాణ కాలం నుంచి ఇప్పటి వరకూ ఒక్క కాకి కూడా వాలలేదు. అందుకు నిదర్శనంగా ఈ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఒక్క కాకి కూడా మనకు కనిపించదు.

అందువల్ల ఈ క్షేత్రానికి శనిదోష నివారణకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక ఇక్కడ పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాలయాలను చూడవచ్చు. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధిచిన పూర్తి వివరాలు మీ కోసం....

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

వీరభాగవత క్షేత్రమని విఖ్యాతి పొందిన సత్రశాల గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

మాచెర్లకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, రెంటచింతల మండలోని ఈ క్షేత్రం పరమపవిత్రమైన క`ష్ణానది ఒడ్డున ఉంది. ఇక్కడ ఇటీవల జరిగిన క`ష్ణ పుష్కరాల సందర్భంగా పలు అభివ`ద్ధికార్యక్రమాలు చేప్టారు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

స్థానిక పురాణ కథనం ప్రకారం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవిని పొందడం కోసం సత్రశాలలో ఓ శివలింగాన్ని ప్రతిష్టించి ఘోర తపస్సు చేస్తుంటాడు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

అయితే ఇది గిట్టని దైదా కుమారుడైన కాకాసురుడనే రాజు ఆ విశ్వామిత్రుడి తపస్సుకు భగ్నం కలిగించాలని ఇక్కడకి వచ్చి కావ్...కావ్ అని అరుస్తుంటాడు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

దీంతో ఆగ్రహించిన విశ్వామిత్రుడు ఇక పై ఏ ఒక్క కాకి అయినా ఈ క్షేత్రంలో అడుగు పెడితే ఆ జాతి మొత్తం అంతరించి పోతుందని శపిస్తాడు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

అందువల్లే ఆ పురాణ కాలం నుంచి ఇప్పటి వరకూ సత్రశాల పుణ్యక్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనిపించవు. ఇందుకు గల శాస్త్రీయ కోణం పై అధ్యయనం జరిగిన ఫలితం లేకపోయింది.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

ఇదిలా ఉండగా శనివాహనమైన కాకులు ఇక్కడ వాలకపోవడం వల్ల ఈ క్షేత్రంలో పూజలు చేస్తే శని దోషాల నుంచి దూరమవుతాయని భక్తుల నమ్మకం.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

అందువల్లే ఈ క్షేత్రంలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ శనిపరిహార దోష పూజలు చేయడం వల్ల కుటుంబ కలహాలు రావని, వ్యాపార బాగా జరుగుతుందని భక్తులు నమ్ముతారు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

ఇదిలా ఉండగా విశ్వామిత్రుడు ప్రతిష్టించిన శివలింగం తర్వాతి కాలంలో భమరాంబ సమేత మల్లికార్జున స్వామి పేరుతో ప్రాచూర్యం పొందింది.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

అటు పై అనేక మంది సాధువులు, బుుషులు ఇక్కడ సత్రాల్లో ఉంటూ అనేక యాగాలు చేయడం వల్ల ఈ క్షేత్రాన్ని సత్రశాల అనే పేరువచ్చిందని స్థానికులు చెబుతారు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

ఇక ఇక్కడ ఉన్న ఆలయాన్ని క్రీస్తు శకం 1244లో కాకతీయ సామంతుడైన మహామండలేశ్వర కాయస్త అంబయ్య దేవుడు స్వామివారి ధూప, దీప నైవేద్యాలను జరిపించడానికి వసూలు చేసిన సొమ్ములో దేవాలయం నిర్మించాడని చెబుతారు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

ఇక ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడి కవికి సమకాలీకుడైన యథావాక్కుల అన్నమయ్య ఈ పుణ్యక్షేతరంలోనే సర్వేశ్వర శతకం రచించి శివైఖ్యం పొందాడని తెలుస్తోంది.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

సత్రశాలలో భ్రమరాంబ మల్లికార్జున దేవాలయమే కాకుండా అనేక ప్రాచీన, పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కుమారస్వామి దేవాలయం అతి ముఖ్యమైనది.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

అదే విధంగా కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి దేవాలయం, కాలభైరవ, చీకటి మల్లయ్య, బ్రహ్మ, ఆంజనేయ, అమరలింగేశ్వర, సంతాన మల్లికార్జున, శ్రీ చెన్న కేశవ స్వామి, శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

ప్రతి ఏటా ఇక్కడ ఆషాడ శుద్ధ ఏకాదశి వ్యాస పూర్ణిమ, మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు క`ష్ణానదిలో లాంచీల ద్వారా ఈ క్షేత్రానికి వస్తుంటారు. ముఖ్యంగా సత్రశాల సమీపంలోని అన్ని గ్రామాల నుంచి ప్రభలు కట్టుకొని ఇక్కడికి వస్తారు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

ఆ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ ఉత్సవాల్లో యువతదే సందడి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ కళాకారులను ఇక్కడికి రప్పిస్తారు.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

ఈ క్షేత్రంలో శ్రీశైలంలో వలే అన్ని మత, కులాల వారికి సత్రాలు ఉన్నాయి. వీటిలో ఉచిత వసతితోపాటు భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఇవన్నీ దాతల ఇచ్చిన విరాళాల ద్వారా నిర్మించినవే.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

గుంటూరు నుంచి 125 కిలోమీటర్ల దూరంలో సత్రశాల ఉంటుంది. అేదవిధ:గా మాచెర్లకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది.

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

వీరభాగవత క్షేత్రం...సత్రశాల

P.C: You Tube

గుంటూరు, మాచార్ల ద్వారా బస్సుల్లో పాల్వాయి జంక్షన్ చేరుకోవాలి. అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి నిత్యం అటోలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X