Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత పురాతనమైన ఈ ఆలయాను సందర్శించారా?

తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత పురాతనమైన ఈ ఆలయాను సందర్శించారా?

తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న అత్యంత పురాతాన దేవాలయాల గురించి కథనం.

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడును దేవాలయాల రాష్ట్రంగా పేర్కొంటారు. ఆ రాష్ట్రంలో ప్రతి పట్టణం, గ్రామంలో ఎంతో కొంత పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఉంటాయి. ఇందుకు తమిళనాడు రాజధాని చెన్నై అతీతం కాదు. చెన్నైలో చూడదగిన ప్రాంతాలు అన్న తక్షణం మనకు మెరినా బీచ్ మాత్రమే గుర్తుకు వస్తుంది. అయితే ఈ మహానగరంలో చూడదగిన పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించిన క్లుప్త సమాచారం మీ కోసం అందిస్తున్నాం. మీరు చెన్నైలో ఉన్నా లేదా చెన్నై టూర్ కు వెళ్లినప్పుడు ఆ దేవాలయాల దర్శనం చేసుకొండి. మరెందుకు ఆలస్యం చదవండి.

కపలీశ్వర దేవాలయం

కపలీశ్వర దేవాలయం

P.C: You Tube

ప్రస్తుతం మైలాపూర్ వద్ద ఈ కపలీశ్వర దేవాలయం ఉంది. చాలా కాలం క్రితం నిర్మించిన ఈ దేవాలయన్ని పోర్చుగీసువారు పడగొట్టడంతో విజయనగర రాజుల 16వ శతాబ్దంలో తిరిగి నిర్మించినట్లు ఇక్కడ దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది. పురాణాలను అనుసరించి పార్వతీ దేవి ఇక్కడ శివుడి గురించి నెమలి రూపంలో తపస్సు చేసినట్లు చెబుతారు.

పార్థసారథి దేవాలయం

పార్థసారథి దేవాలయం

P.C: You Tube

8వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని పల్లవులు నిర్మించినట్లు చెబుతారు. ఇది వైష్ణవాలయం. కురుక్షేత్రానికి సంబంధించిన అనేక ఘట్టాలు ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కారు. ఇక్కడ ఆ శ్రీ క`ష్ణుడు తన కుటుంబ సభ్యులందరితో కొలువై ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ విష్ణువుకు మీసాలు కూడా ఉంటాయి. మీసాలు ఉన్న విష్ణువు విగ్రహాన్ని మనం భారత దేశంలో ఇదొక్కచోట మాత్రమే చూడగలం.

జైన దేవాలయం.

జైన దేవాలయం.

P.C: You Tube

జైన తీర్థాంకరుడైన చంద్రప్రభు భగవాన్ ఇక్కడ ప్రధాన దైవం. రాజస్థాన్ లోని దిల్వార దేవాలయాల వాస్తు శైలిని మనం ఇక్కడ గమనించవచ్చు. చెన్నైలోని మిగిలిన దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయం కొంత ఆధునిక శైలితో నిర్మితమైనది. ఈ దేవాలయాన్ని జైనులే కాకుండా మిగిలిన మతానికి చెందిన వారు కూడా ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు.

కరణీశ్వర్ దేవాలయం

కరణీశ్వర్ దేవాలయం

P.C: You Tube

ఇది శైవాలయం. ఇక్కడ ఇంద్రుడు శివలింగాన్ని స్థాపించాడని చెబుతారు. వశిష్ట మహర్షి నుంచి కామధేనువును తిరిగి పొందడంలో కల అడ్డంకులను తొగించుకోవడం కోసం ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని పురాణ కథనం. ఇక్కడ ఇంద్రుడు నిర్మించిన గోపతి సరస్సులో స్నానం చేస్తే పంచ మహాపాతకాలు తొలిగిపోతాయని చెబుతారు.

మరున్ దీశ్వర దేవాలయం

మరున్ దీశ్వర దేవాలయం

P.C: You Tube

దాదాపు ఒక ఎకర విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది. ఇది శైవాలయం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ పరమశివుడిని భక్తులు వైద్యుడిగా భావిస్తారు. ఈ దేవాలయంలోని తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుడిని సందర్శిస్తే సర్వ రోగాలు నయమవుతాయని స్థానిక భక్తుల నమ్మకం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X