Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవిని సందర్శిస్తే పసుపు కుంకుమలు చల్లగా వందేళ్లు ఉంటాయంటా అందుకే

ఈ దేవిని సందర్శిస్తే పసుపు కుంకుమలు చల్లగా వందేళ్లు ఉంటాయంటా అందుకే

ముంబైలోని జోగేశ్వరి గుహాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశం దేవాలయాల నిలయం. ఇక్కడ ఉన్నన్ని దేవాలయాలు బహుశా ఏ దేశంలో కూడా ఉండవేమో. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క విశిష్టత. అందులో ఉన్న దేవుళ్లు కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయని అనాదిగా భక్తులు నమ్ముతున్నారు.

అటువంటి దేవాలయాలను తరుచూ సందర్శిస్తూ ఉంటారు. అంటువంటి కోవకు చెందినదే జోగేశ్వరి దేవాలయం. ఈ దేవాలయ నిర్మాణం సుమారు ఐదో శతాబ్దంలో జరిగిందని తెలుస్తోంది. దీన్ని బట్టి ఇది ఎంతటి పురాతనమైనదో తెలుసుకోవచ్చు.

ఇక్కడి అమ్మవారిని ఎక్కువగా మహిళలు సందర్శిస్తూ ఉంటారు. ఇందుకు గల కారణాలతో పాటు ఆ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం....

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

అత్యంత పురాతనమైన జోగేశ్వరి దేవాయం ముంబై మహానగరంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయం వల్లే ఆ ప్రాంతానికి జోగేశ్వరి అని పేరు కూడా వచ్చింది. ఇది ఒక గుహాలయం.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

అంటే కొండ గుహను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆదిపరాశక్తికి ప్రతిరూపంగా ఈ మాతను కొలుస్తారు. ముఖ్యంగా ఈ దేవిని పూజించడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న తమ భర్తల ఆరోగ్యం బాగుపడి చిరకాలం జీవిస్తారని మహిళలు నమ్ముతారు.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

అందువల్లే నిత్యం ఎంతో మంది ఈ దేవిని పూజించడానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఈ జోగేశ్వరి దేవి ఇప్పటికీ ముంబైతో పాటు మహారాష్ట్రంలోని చాలా కుటుంబాలకు కులదైవతా.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

అదే విధంగా ఈ జోగేశ్వరిని కులదైవంగా పూజించే వారు గుజరాత్ తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ దేవాలయాన్ని ఐదో శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ దొరికిన ఆధారాలను అనుసరించి పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

అజంత, ఎల్లోరా గుహాలను నిర్మించిన వారే ఈ జోగేశ్వరి మాత గుహాలయాన్ని కూడా నిర్మించారనే కథనం కూడా ప్రచారంలో ఉంది.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

అజంతా, ఎల్లోగా గుహల నిర్మాణం పూర్తైన తర్వాత తిరుగు ప్రయాణం సమయంలో కొద్ది రోజులు విశ్రాంతి కోసం ఆగిన కార్మికులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

వీరికి స్థానిక రాజు సహకారం అందించారని తెలుస్తోంది. ముంబై నగరంలో జోగేశ్వరి అనే ప్రాంతంలో ఈ జోగేశ్వరి గుహాలయం ఉంది.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

ఇక్కడికి చేరుకోవడానికి ముంబై నగరంలోని చాలా ప్రాంతాల నుంచి బస్సులు, లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

ఈ గుహాలయంలో జోగేశ్వరీ దేవితో పాటు పరమేశ్వరుడు, గణపతి తదితర దేవుళ్ల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

ముంబైలోని జోగేశ్వరీ దేవి గుహాలయం

P.C: You Tube

ఒకప్పుడు ఈ గుహాలయాన్ని అంబోలి గుహాలయం అని కూడా పిలిచేవారు. ప్రతి శివరాత్రి, కార్తిక సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆ సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X