Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల వేంకటేశ్వరుడి పల్లకి దేనితో ఎవరు చేయించారో తెలుసా?

తిరుమల వేంకటేశ్వరుడి పల్లకి దేనితో ఎవరు చేయించారో తెలుసా?

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వినియోగించే పల్లకికి సంబంధించిన కథనం.

తిరుమల వేంకటేశ్వరుడి సేవించి ఆయన ఆశిస్సులు పొందిన వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం కార్పోరేట్ దిగ్గజాల నుంచి రాజకీయ నాయకుల వరకూ ఏదేని ఒక పనిని ప్రారంభించడం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో ఆ స్వామివారిని దర్శించుకొని కానుకలు సమర్పిస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం.

ఈ నేపథ్యంలోనే స్వామివారిని కొలిచిన వారిలో పురాణ పురుషులతో పాటు చరిత్రలో నిలిచిపోయిన రాజులూ ఉన్నారు. తమకు చేతనైనంతగా ఆ స్వామివారికి కానుకలు సమర్పించి ఆ ఏడుకొండాల స్వామి కృపకు నోచుకున్నారు. వీరిలో మైసూరు మహారాజులు కూడా ఉన్నారు. స్వామివారికి వారు సమర్పించిన కానుకలను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైసూరు రాజులు సమర్పించిన కానుకలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

మైసూరు మహారాజు

మైసూరు మహారాజు

P.C: You Tube

తిరుమల వేంకటేశ్వరుడికి మైసూరు మహారాజు పరమ భక్తులు. ఆలయ అభివ`ద్ధి కోసం ఆ మహారాజులు అచంచల భక్తిభావంతో భూరి విరాళాలను సమర్పించారు. ముఖ్యంగా శ్రీవారి మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తులకు ప్లాటినం, బంగారు, వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలతో తయారు చేయించిన అమూల్యమైన ఆభరణాలను బహూకరించారు.

పల్లకిని ఏనుగు దంతంతో

పల్లకిని ఏనుగు దంతంతో

P.C: You Tube

బ్రహ్మోత్సవాల్లో వినియోగించే గరుడ, గజ, ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను మైసూరు మహారాజులే అందించారు. స్వామివారి వాహన సేవలో భాగంగా బ్రహ్మోత్సవాల్లోని ఐదవ రోజు ఉదయం జరిగే పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని మైసూరు మహారాజు ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో ప్రత్యేకంగా తయారు చేయించారు.

నిత్య ధీపారాధనకు

నిత్య ధీపారాధనకు

P.C: You Tube

ఇవే కాకుండా నిత్య ధీపారాధనకు అవసరమైన అవునెయ్యి కూడా దాదాపు మైసూరు సంస్థానం నుంచే ఇచ్చే సంప్రదాయం దాదాపు 300 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్ని కర్నాటక ప్రభుత్వం కొనసాగిస్తోంది.

ప్రత్యేక ఆస్థానం

ప్రత్యేక ఆస్థానం

P.C: You Tube

ప్రతి రోజూ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతం సేవకు ముందు నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి ప్రతి రోజు 5 కిలోల ఆవునెయ్యి ఇప్పటికీ అందుతోంది. ఆలయ అభివ`ద్ధికి, మైసూరు మహారాజు చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మించిన ఉత్తరాబాధ్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి నెల ఆ రోజు రాత్రి రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు.

300 ఏళ్లుగా

300 ఏళ్లుగా

P.C: You Tube

అదే విధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, అణివార ఆస్థానాల్లో మైసూరు మహారాజు పేరిట ప్రత్యేక హరతి ఉంటుంది. శ్రీక`ష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీ మలయప్ప స్వామివారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవంలో పాల్గొని అనంతరం ఆలయానికి చేరుకొంటారు. ఈ విధానం గత 300 ఏళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతూ ఉండటం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X