Search
  • Follow NativePlanet
Share
» »90 అడుగుల పొడవైన గుహలో ఎందుకు ఆ లింగం ఎప్పుడూ అక్కడే ఏర్పడుతుంది? ఇలా ప్రశ్నలు ఎన్నో...

90 అడుగుల పొడవైన గుహలో ఎందుకు ఆ లింగం ఎప్పుడూ అక్కడే ఏర్పడుతుంది? ఇలా ప్రశ్నలు ఎన్నో...

అమర్నాథ్ యాత్రకు సంబంధించిన కథనం

భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర గురించే చర్చ మొత్తం. ఈ చర్చ రెండు రకాలుగా సాగుతోంది. అందులో మొదటిది ఈ యాత్ర పురాణ ప్రాధాన్యతతతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక రహస్యాల గురించి .

ఆధునిక సాంకేతికత ఇంతగా అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఆ రహస్యాల మర్మం తెలుసుకోలేకపోతున్నారు. అదే విధంగా ఈ యాత్రలో పాల్గొంటే మొక్షం లభిస్తుందనుకొనేవారు కూడా ఈ విషయం పై తోటివారితో చర్చించడంతో పాటు నేటివ్ ప్లానెట్ వంటి సోషియల్ మీడియాలో సర్చ్ చేస్తున్నారు.

ఇక ప్రపంచం మొత్తం ఈ యాత్ర పై దృష్టి సారించింది. యాత్ర భగ్నం కాకుండా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు ఏంటన్న విషయం పై నిషితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి రహస్యాలతో పాటు భద్రతా ఏర్పాట్ల పై కథనం మీ కోసం...

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులు సముద్ర మట్టానికి దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగాన్ని సందర్శిస్తుంటారు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ప్రపంచంలోని అతి పెద్ద గుహల్లో ఈ అమర్నాథ్ గుహ కూడా ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవుతో ఉన్న ఈ గుహ హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఏడాదిలో జులై, ఆగస్టు మాసాల్లో మినహా మిగితా సమయం మొత్తం ఈ గుహ పూర్తిగా మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో మైనస్ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఈ పరిస్థితుల్లో ఈ గుహను చేరుకోవడం చాలా కష్టం. జులై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం వేడెక్కుతుంది. మంచు కరుగుతుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

అయితే శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగానే ఉంటుంది. దాదాపు 45 నుంచి 60 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

విచిత్రమేమంటే ఈ గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో అవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తోందన్న విషయం పై మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఈ గుహ దాదాపు 5వేల ఏళ్ల క్రితం ఏర్పడినదని చెబుతారు. ఇక్కడ గణపతి, పార్వతికి కూడా రెండు మంచులింగాలు ఉన్నాయి. మహాదేవుని లింగ రూపం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ మంచు మూర్తులు కనిపిస్తాయి. తరువాత అవీ ఉండవు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఇక పురాణ కథనం ప్రకారం పరమశివుడు పార్వతి దేవికి ఇక్కడే స`ష్టి రహస్యాన్ని బోధించాడని చెబుతారు. అయితే ఆ సమయంలో గుహలో ఉన్న పావురాల జంట ఆ రహస్యాన్ని విని అమరత్వం పొందుతాయి.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఇప్పటికీ ఆ పావురాల జంటను యాత్రికులు సందర్శించుకోవచ్చు. అంటే ఆ పావురాలు స`ష్టి ఉన్నత వరకూ ఉంటాయని స్థానికులు చెబుతారు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

కశ్మీర రాజుల కథలను వివరించే రాజతరంగిణి పుస్తకంలో కూడా ఈ అమర్నాథ్ యాత్ర, ఇక్కడి అమర్నాథ మంచు శివలింగం తదితర ప్రస్తావనలు ఉన్నాయి.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

రాణి సూర్యమతి అమర్నాథ్ స్వామికి త్రిశూలం, విల్లును కానుకలుగా సమర్పించినట్లు ఈ పుస్తకంలో వివరించబడింది. మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన లేదు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

అయితే 15వ శతాబ్దంలో ఓ గొర్రెల కాపరి ద్వారా ఈ గుహ గురించి తిరిగి ప్రస్తావనకు వచ్చింది. అప్పటి నుంచి ఈ మంచు లింగాన్ని సందర్శించుకోవడానికి భక్తులు వెలుతున్నారు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఇక పురాణ కథనం ప్రకారం పరమశివుడు అమర్ నాథ్ గుహ వద్దకు వెలుతూ తన మెడలో ఉన్న సర్పాన్ని శేష్ నాగ్ సరస్సు వద్ద విడిచి పెట్టి వెళ్లాడని చెబుతారు. అందువల్ల ఆ పేరు వచ్చింది.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

పహల్గాంకి దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ యాత్రికులు శేష్ నాగ్ సరస్సును చూస్తారు. హిందూ పురాణాలను అనుసరించి ఏడు తలల సర్పరాజు శేష్ నాగ్ నుంచి ఈ సరస్సుకు ఆ పేరు వచ్చింది.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఈ సరస్సు చుట్టూ ఏడు పర్వత శిఖరాలు ఉండటం విశేషం. అందువల్లే ఇక్కడ ఆ సర్పరాజు ఇప్పటికీ ఉన్నాడని చెబుతారు. పహల్గాం నుంచి ఇక్కడకు కాలి నడకనే ప్రయాణం. ఈ సరస్సు శీతాకాలం నుంచి జూన్ నెల వరకూ మంచుతో కప్పబడి ఉంటుంది.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఈ సరస్సు చుట్టూ ఏడు పర్వత శిఖరాలు ఉండటం విశేషం. అందువల్లే ఇక్కడ ఆ సర్పరాజు ఇప్పటికీ ఉన్నాడని చెబుతారు. పహల్గాం నుంచి ఇక్కడకు కాలి నడకనే ప్రయాణం. ఈ సరస్సు శీతాకాలం నుంచి జూన్ నెల వరకూ మంచుతో కప్పబడి ఉంటుంది.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఈ ఏడాది మొత్తం 60 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఇందుకు సంబంధించిన ముందస్తు ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది ఈ యాత్ర కోసం తమ పేర్లను సిద్ధం చేసుకొన్నారు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

భారతీయ సైన్యానికి చెందిన వారు ఈ గుహ, ఇందులోని మంచులింగానికి గస్తీ కాస్తూ ఉంటారు. యాత్రికులు ప్రయాణం చేసే వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా మొట్టమొదటిసారిగా వాటికి రేడియో ఫీక్వెన్సీ ఐడెంటిఫైయింగ్ ట్యాగ్ లు అమర్చారు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

ఈ సారి అమర్నాథ్ యాత్రికుల పై ఉగ్రదాడుల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ దళాలు ద్విచక్రవాహనాల పై తిరిగే గస్తీ తిరగ నున్నారు. ఇటువంటి ఏర్పాటు ఇదే మొదటిసారి. మొత్తం 40 వేల మంది ఈ గస్తీలో పాల్గొననున్నారు.

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

అత్యంత సాహసం...పార్వతీ వల్లభుడి దర్శనం

P.C: You Tube

బులెట్ ప్రూఫ్ బంకర్లు, సీసీకెమారాలు, డ్రోన్స్ తో పాటు అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ సాటిలైట్ కమ్యునికేషన్ విధానాన్ని కూడా ఈ సారి వాడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X