Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా స్కాంట్ ల్యాండ్ కూర్గ్ లో చూడదగ్గ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో తెలుసా

ఇండియా స్కాంట్ ల్యాండ్ కూర్గ్ లో చూడదగ్గ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో తెలుసా

ఇండియా స్కాంట్ ల్యాండ్ గా పిలువబడే కూర్గ్ గురించిన కథనం.

By Kishore

అద్భుతమైన పచ్చటి తివాచి పరిచట్లు ఉన్న ప్రకృతి సౌందర్యం కూర్గ్ సొంతం. ఇక్కడి ఎతైన పర్వత శిఖరాలు, మనోహరమైన జలపాతాలతో పాటు కోయిలమ్మ పాటలు వింటూ నడుచుకొని వెలుతుంటే ఎదరయ్యే మృగరాజు గాండ్రిపులు, ఏనుగుల గంభీరమైన నడక మిమ్ములను చూపుతిప్పుకోనివ్వదు.

ఉదయన్నే పర్వతాలను ముద్దాడుతూ వెళ్లే పొగమంచు పర్యాటకులకు నయనమనోహరంగా కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అనంతమైన ప్రకృతి అందాలకు కూర్గ్ నిలయం కాబట్టే ఈ ప్రాంతాన్ని స్కాట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. నవంబర్ నుంచి మార్చ్ మధ్య కూర్గ్ చూడటానికి చాలా బాగుంటుంది.

కూర్గ్ కు దగ్గర రైల్వేస్టేషన్ మైసూరులో ఉంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 120 కిలోమీటర్లు. అదే విధంగా కూర్గ్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ట్యాక్సీల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.

 అబ్బే వాటర్ ఫాల్స్

అబ్బే వాటర్ ఫాల్స్

P.C: You Tube

సిటీ సెంటర్ నుంచి ఎంత దూరం.....24 కిలోమీటర్లు

కూర్గ్ లో చూడదగిన అత్యంత ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అబ్బే జలపాతం కూడా ఒకటి. మడికేరి నుంచి కూత వేట దూరంలో ఉన్న ఈజలపాతం చూడటానికి కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కావేరమ్మ హొయలు పోతూ అంతెత్తు నుంచి కిందికి జాలువారడాన్ని చూడాల్సిందే కాని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

 బ్రహ్మగిరి

బ్రహ్మగిరి

P.C: You Tube

సిటీ సెంటర్ నుంచి ఎంత దూరం.....88 కిలోమీటర్లు

ఇది ఒక పర్వత శిఖర ప్రాంతం. ఈ శిఖరం చేరడానికి కొంత దూరం మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్ మార్గంలో రంగురంగుల పువ్వులు, పచ్చటి గడ్డిభూములు మిమ్ములను అందంగా పలకరిస్తాయి. బ్రహ్మగిరి ఒక అభయారణ్యం. కూడా. ఇక్కడ సింహపు తోక కలిగిన కోతులు, అడవి పిల్లి, చుక్కల దుప్పి వంటివి జంతువులన్నింటినీ చూస్తూ బ్రహ్మగిరి శిఖరం పై భాగానికి చేరుకోవడం అంతులేని అనుభూతిని మిగులుస్తుంది.

దుబారే ఎలిఫెంట్ క్యాంప్

దుబారే ఎలిఫెంట్ క్యాంప్

P.C: You Tube

సిటీ సెంటర్ నుంచి ఎంత దూరం.....17 కిలోమీటర్లు

కూర్గ్ వెళ్లిన వారు తప్పక దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ను సందర్శించకుండా తిరిగిరారు. ఇక్కడ ఏనుగులకు స్నానం చేయించడానికి, వాటితో ఆడుకోవడానికి కూడా అవకాశం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఎలిఫెంట్ సఫారికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. కావేరీ నదీ తీరం వెంబడి ఏనుగు సవారి చేస్తూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుంది.

ఇరుప్పు ఫాల్స్

ఇరుప్పు ఫాల్స్

P.C: You Tube

సిటీ సెంటర్ నుంచి ఎంత దూరం.....61 కిలోమీటర్లు

కూర్గ్ పర్యాటకంలో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఇరుప్పు వాటర్ ఫాల్స్ ముందు వరుసలో ఉంటుంది. లక్ష్మణ తీర్థ అనే చిన్న నది దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతూ చేసే ఒక రకమైన ధ్వనులు మనలను మైమరిపింపజేస్తాయడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

నాగర్ హోల్ నేషనల్ పార్క్

నాగర్ హోల్ నేషనల్ పార్క్

P.C: You Tube

జంతుప్రేమికులకు నాగర్ హోల్ నేషనల్ పార్క్ ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన నేషనల్ పార్కులతో పోలిస్తే నాగర్ హోల్ కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మైదాన ప్రాంతం ఎక్కువ. దీంతో మనం జంతువులను దగ్గర నుంచి చూడవచ్చు. ఈ నేషనల్ పార్క్ దాదాపు 270 జాతుల పక్షులకు ఆశ్రయం కల్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X