Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ శ్రీ కృష్ణుడికి మీసాలుంటాయి సందర్శనతో విజయం మీ చెంత

ఇక్కడ శ్రీ కృష్ణుడికి మీసాలుంటాయి సందర్శనతో విజయం మీ చెంత

చెన్నైలోని పార్థసారథి దేవాలయానికి సంబంధించిన కథనం.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఓ పుణ్యక్షేత్రం అతి పురాతనమైనది. దాదాపు 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంతో పాటు అందులోని మూలవిరాట్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామంలో ఆ నల్లనయ్య కు కూడా బానపు దెబ్బలు తిన్నాడని ఈ క్షేత్రం మనకు తెలియజేస్తుంది.

అందుకు గుర్తుగా ఆయన మొహం నిండా మచ్చలను చూసిస్తుంది. అంతే కాకుండా వేంకటేశ్వరుడు ఇక్కడ శ్రీ కృష్ణుడి రూపంలో తన పరివారంతో సహా కొలువై ఉన్నాడు. ఇటువంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అదే విధంగా మీసాలతో ఉన్న శ్రీ కృష్ణుడిని ఈ ప్రంపంచం మొత్తం మీద ఈ దేవాలయంలోనే చూడగలం. ఇక ఇక్కడి దేవాలయంలో రెండు ధ్వజస్థంబాలు కనిపిస్తాయి.

అదే విధంగా ఈ క్షేత్రంలో పుత్ర కామేష్టి యాగం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఆ క్షేత్రం అరుదైన చిత్రమాలిక మీ కోసం

అర్జునుడి రథాన్ని నడిపినవాడు

అర్జునుడి రథాన్ని నడిపినవాడు

P.C: You Tube

పార్థుడు అంటే అర్జునుడు, సారధి అంటే రథాన్ని నడిపిన వాడు అని అర్థం. ఈ రెండు పదాలను కలిపితే అర్జునుడి రథాన్ని నడిపిన వాడు అని అర్థం. అర్జునుడి రథాన్ని నడిపిన వాడు కృష్ణుడు. అందువల్లే శ్రీ కృష్ణుడిని పార్థసారథి అని కూడా పిలుస్తారు.

రామానుజ చార్యులు

రామానుజ చార్యులు

P.C: You Tube

దేశంలో ధర్మ సంస్థాపనతో పాటు ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు ఆ పార్థసారథి రామానుజాచార్యలు రూపంలో జన్మించినది ఇక్కడేనని చెబుతారు. రామానుజా చార్యులు విశిష్టద్వైత మతాన్ని ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

వేంకటేశ్వరుడు

వేంకటేశ్వరుడు

P.C: You Tube

స్థల పురాణాన్ని అనుసరించి తొండమాన్ చక్రవర్తికి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వరుడు ఇక్కడ సకుటుంబ సపరివారంగా శ్రీ క`ష్ణుడి రూపంలో పార్థసారథిగా వెలిసినట్లు చెబుతారు. అందువల్లే ఇక్కడ స్వామివారిని వేంకటకృష్ణన్ అని పిలుస్తారు.

108 వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటి

108 వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటి

P.C: You Tube

108 వైష్ణవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. దీనిని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర కారులు చెబుతారు. ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తులు నమ్మకం.

 స్వామివారితో పాటు వీరు కూడా

స్వామివారితో పాటు వీరు కూడా

P.C: You Tube

ఇక ఈ క్షేత్రంలో స్వామివారు భర్య రుక్మిణీదేవి, సోదరులు బలరాముడు, సాత్యకిలు ఉంటారు. అంతేకాకుండా స్వామివారి కుమారుడైన ప్రద్యుమ్నూడు మనుమడైన అనిరుద్ధుడిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

మరెక్కడా చూడలేం

మరెక్కడా చూడలేం

P.C: You Tube

ఇలా శ్రీ కృష్ణుడు సకుటుంబ సపరివారంగా కొలువై ఉండటాన్ని మనం కేవలం ఇక్కడ మాత్రమే చూడగలం. అదేవిధంగా ఇక్కడ శ్రీ కృష్ణుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. శ్రీరంగనాథ రూపం (శయనించిన స్థితిలో), చక్రవర్తి తిరుమగన్ (నిలుచున్న), గజేంద్రవరదన్ (పయనించే స్థితిలో) అళగియశింగర్ (కూర్చొన్న స్థితిలో)కనిపిస్తాడు.

విభిన్న స్థితిలో

విభిన్న స్థితిలో

P.C: You Tube

సాధారణంగా ఒక క్షేత్రంలో ఒకే స్థితిలో విగ్రహాలను చూస్తాం. అయితే ఈ క్షేత్రంలో మాత్రమే స్వామివారు ఇలా విభిన్న స్థితిలో కనిపిస్తారు. ఇక మూలవిరాట్టు విగ్రహం కూడా విభిన్నమే. ఇక్కడ ఉన్నట్లు స్వామివారి విగ్రహం మనకు మరెక్కడా కనిపించదు.

ఆనవాళ్లు

ఆనవాళ్లు

P.C: You Tube

మహాభారతం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడి రథసారథిగా వ్యవహరించాడు. ఆ శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో పాల్గొన్నట్లు చెప్పే కొన్ని ఆనవాళ్లను ఇక్కడ స్వామి వారి మొహంలో మనం చూడవచ్చు.

 మచ్చలు

మచ్చలు

P.C: You Tube

యుద్ధంలో బీష్ముడు వదిలిన కొన్ని బానాలు స్వామివారి మహానికి కూడ తగిలినట్లు చెబుతారు. అందువల్లే స్వామి వారి మొహం పై ఇక్కడ మనం మచ్చలను చూడవచ్చు. అదే విధంగా కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం తెలిసిందే.

కేవలం శంఖం మాత్రమే

కేవలం శంఖం మాత్రమే

P.C: You Tube

అందువల్ల ఇక్కడి ఆలయంలో మూలవిరాట్టుకు సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. అదే విధంగా యుద్ధంలో పాల్గొన్న దానికి ప్రతీకగా ఇక్కడ స్వామివారికి మీసాలు ఉంటాయి.

రెండు ధ్వజస్థంబాలు

రెండు ధ్వజస్థంబాలు

P.C: You Tube

అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో రెండు ధ్వజస్థంబాలు ఉంటాయి. అందులో ఒకటి గర్భగుడికి ఎదురుగా ఉండగా మరొకటి ఆలయంలో ఉన్న నరసింహస్వామి ఉపాలయానికి ఎదురుగా ఉంటుంది.

 అనేక ఉపాలయాలు

అనేక ఉపాలయాలు

P.C: You Tube

ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. అందులో వేదవల్లి దేవాలయం, రంగనాథస్వామి గుడి, శ్రీరాముడి గుడి, వరదరాజస్వామి గుడి, నరసింహ స్వామి దేవాలయం, ఆండాళ్లమ్మ దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, రామానుజాచార్యుల సన్నిది తదితరాలు ముఖ్యమైనవి.

చెక్కతో తయారైన ఉత్సవ విగ్రహం

చెక్కతో తయారైన ఉత్సవ విగ్రహం

P.C: You Tube

సాధారణంగా ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో తయారై ఉంటాయి. అయితే ఈ దేవాలయంలో మాత్రం చెక్కతో చేయబడిన ఉత్సవ విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ విగ్రహంతో పాటు ఉభయ నాంచారులను వివిధ సమయాల్లో ఊరేగిస్తారు.

సకల పాపాలు పోతాయి

సకల పాపాలు పోతాయి

P.C: You Tube

దేవాలయాలనికి ఎదురుగా ఉన్న ప్రధాన తటాకాన్ని కైరవిణి అని అంటారు. ఈ తటాకానికి అనుసంధానంగా ఇంద్ర, సోమ, మీన, అగ్ని, విష్ణు అనే తీర్థాలు ఉన్నాయి. వీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయని నమ్ముతారు.

మిరపకాయలు, వేరుశెనగ నూనె నిషిద్ధం

మిరపకాయలు, వేరుశెనగ నూనె నిషిద్ధం

P.C: You Tube

ఈ ఆలయంలో మిరపకాయలు, వేరుశెనగ నూనె నిషిద్ధం. వీటితో తయారైన ఆహార పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా కాని భక్తులకు ప్రసాదంగా కాని అందించరు. అందువల్లే ఇక్కడ స్వామివారికి చక్కెరపొంగలి లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా పెడుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X